Bajaj Pulsar 220F : తిరిగొచ్చిన బజాజ్​ పల్సర్​ 220ఎఫ్​.. బుకింగ్స్​ షురూ!-bajaj pulsar 220f makes a comeback bookings opened check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bajaj Pulsar 220f : తిరిగొచ్చిన బజాజ్​ పల్సర్​ 220ఎఫ్​.. బుకింగ్స్​ షురూ!

Bajaj Pulsar 220F : తిరిగొచ్చిన బజాజ్​ పల్సర్​ 220ఎఫ్​.. బుకింగ్స్​ షురూ!

Sharath Chitturi HT Telugu
Feb 18, 2023 06:37 AM IST

Bajaj Pulsar 220F : పల్సర్​ 220ఎఫ్​ను బజాజ్​ రీలాంచ్​ చేస్తోంది! గతేడాది డిస్కంటిన్యూ అయిన ఈ మోడల్​.. తిరిగి డీలర్​షిప్​ షోరూమ్​లకు చేరింది. పూర్తి వివరాలు..

తిరిగొచ్చిన బజాజ్​ పల్సర్​ 220ఎఫ్​.. బుకింగ్స్​ షురూ!
తిరిగొచ్చిన బజాజ్​ పల్సర్​ 220ఎఫ్​.. బుకింగ్స్​ షురూ! (HT AUTO)

Bajaj Pulsar 220F : గతేడాది.. డిస్కంటిన్యూ చేసిన పల్సర్​ 220ఎఫ్​ మోడల్​ను దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ బజాజ్​ ఆటో లిమిటెడ్​.. మళ్లీ తీసుకొస్తోంది! ఇందుకు సంబంధించిన కొత్త యూనిట్​లు, ఇప్పటికే డీలర్​షిప్​ షోరూమ్​లకు చేరినట్టు సమాచారం. పలు డీలర్​షిప్​ షోరూమ్​లు బుకింగ్స్​ని కూడా ఓపెన్​ చేసినట్టు తెలుస్తోంది. రానున్న కొన్ని వారాల్లో డెలివరీలు సైతం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

అయితే.. బజాజ్​ పల్సర్​ 220ఎఫ్​ను ఆ సంస్థ ఎందుకు తిరిగి తీసుకొస్తోందో వివరించలేదు. కానీ ఇందుకు రెండు కారణాలు ఉండొచ్చని మార్కెట్​ వర్గాలు భావిస్తాయి. ఒకటి.. ఈ మోడల్​కు మంచి డిమాండ్​ ఉందని సంస్థ భావిస్తుండటం. రెండోది.. న్యూ జెన్​ పల్సర్​ 250 మోడల్స్​కు ఆశించిన మేర డిమాండ్​ కనిపించకపోవడం.

బజాజ్​ పల్సర్​ 220ఎఫ్​.. తిరిగొస్తోంది!

Bajaj Pulsar 220F on road price in Hyderabad : పల్సర్​ ఎఫ్​250, పల్సర్​ ఎన్​250 మోడల్స్​తో పల్సర్​ 220ఎఫ్​ను గతేడాది రిప్లేస్​ చేసింది బజాజ్​ ఆటో. అవి ఈ మోడల్​కు సక్సెసర్​లుగా భావించింది. కానీ ఇప్పుడు పాత మోడల్​ను మళ్లీ తీసుకొస్తుండటం గమనార్హం.

అయితే.. ఈ బజాజ్​ పల్సర్​ 220ఎఫ్​లో భారీ మార్పులు కనిపించకపోవచ్చు. డిస్కంటిన్యూ అవ్వకముందే.. ఈ వెహికిల్​ ఒక బీఎస్​6 వేరియంట్​. ఇక ఇప్పుడు దీనిని ఓబీడీ2 కంప్లైంట్​గా మార్చాల్సి ఉంటుంది.

బజాజ్​ పల్సర్​ 220ఎఫ్​ ఇంజిన్​..

Bajaj Pulsar 220F price : బజాజ్​ పల్సర్​ 220ఎఫ్​లో 220 సీసీ, సింగిల్​ సిలిండర్​, ఫ్యూయెల్​ ఇంజెక్టెడ్​, ఎయిర్​ - ఆయిల్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 8500 ఆర్​పీఎం వద్ద 20.8 బీహెచ్​పీ పవర్​ను, 7000 ఆర్​పీఎం వద్ద 18.5 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉంటుంది.

ఇక ఈ బైక్​ను రూ. 1.35లక్షల ఎక్స్​షోరూం ప్రైజ్​తో బజాజ్​ ఆటో లాంచ్​ చేసే అవకాశం ఉంది.

బజాజ్​ పల్సర్​ పీ150..

Bajaj Pulsar P150 mileage : ఇక బజాజ్​ నుంచి వచ్చిన లేటెస్ట్​ పల్సర్​ పీ150పై ఆ సంస్థ భారీగా ఆశలు పెట్టుకుంది. న్యూ జెన్​ పల్సర్​లో అతి చౌకైన బైక్​ ఇదే. పల్సర్​ ఎన్​160, పల్సర్​ ఎన్​250 బైక్స్​లో ఉన్న ఇంజిన్​ ఇందులో ఉంటుంది. రెండు వేరియంట్లలో ఇది అమ్మకానికి ఉంది. సింగిల్​ డిస్క్​ వేరియంట్​ ధర రూ. 1.17లక్షలు. ట్విన్​ డిస్క్​ వేరియంట్​ ధర రూ. 1.20లక్షలు.