Bajaj Pulsar N160 vs Pulsar NS160 : పల్సర్ ఎన్160 వర్సెస్ ఎన్ఎస్160.. ది బెస్ట్ ఏది?
Bajaj Pulsar N160 vs Pulsar NS160 : బజాజ్ పల్సర్ ఎన్160, ఎన్ఎస్160 మధ్య వ్యత్యాసాలు ఏంటి? వీటి ధరలు ఏంటి? వంటి వివరాలు ఇక్కడ చూద్దాం. రెండింటినీ పోల్చి చూసి ది బెస్ట్ ఏదో తెలుసుకుందాము.
Bajaj Pulsar N160 vs Pulsar NS160 : 2 వీలర్ సెగ్మెంట్లో బజాజ్‌కు మంచి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త మోడల్స్‌తో కస్టమర్లను ఆకర్షిస్తుంది ఈ దిగ్గజ ఆటో సంస్థ. ఇక బజాజ్ మోడల్స్‌లో.. పల్సర్ ఎన్160, పల్సర్ ఎన్ఎస్160కి క్రేజ్ చాలా ఎక్కువగా ఉంది. పేర్లు ఒకే విధంగా ఉండటంతో ఈ రెండు ఒకటే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రెండు బైక్స్‌లో కాస్త వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో.. బజాజ్ పల్సర్ ఎన్160, ఎన్ఎస్160ని పోల్చి.. రెండింట్లో ది బెస్ట్ ఏదో తెలుసుకుందాము..
బజాజ్ పల్సర్ ఎన్160 వర్సెస్ పల్సర్ ఎన్ఎస్160- లుక్స్.. ఫీచర్స్
పల్సర్ ఎన్ఎస్160తో పోల్చుకుంటే.. పల్సర్ ఎన్160 కాస్త మాడెర్న్గా కనిపిస్తుంది. పల్సర్ ఎన్160 డిజైన్.. పల్సర్ ఎన్250తో పోలి ఉంటుంది. పల్సర్ ఎన్ఎస్160.. పల్సర్ ఎన్ఎస్200తో పోలి ఉంటుంది.
Bajaj Pulsar N160 price in Hyderbad : ఇక ఫీచర్స్ విషయానికొస్తే.. పల్సర్ ఎన్ఎస్160తో పోల్చుకుంటే.. ఎన్160 కొంచెం బెటర్‌గా ఉంటుంది. ఎన్160లో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, కొత్త సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. సైడ్ స్టాండ్ కటాఫ్‌తో పాటు యూఎస్బీ ఛార్జర్ కూడా లభిస్తోంది.
బజాజ్ పల్సర్ ఎన్160 వర్సెస్ పల్సర్ ఎన్ఎస్160- ఇంజిన్..
ఇంజిన్ విషయానికొస్తే.. ఈ రెండింట్లోనూ కాస్త వ్యత్యాసం కనిపిస్తుంది. రెండింట్లోనూ సింగిల్ సిలిండర్ యూనిట్స్‌తో పాటు ఎయిర్ ఆయిల్ కూలింగ్ సెటప్ ఉన్నాయి. కానీ పల్సర్ ఎన్160లో 2- వాల్వ్ సెటప్ ఉంటుంది. ఇది.. 8,750 ఆర్పీఎం 15.78బీహెచ్పీ పవర్‌ను, 6,750 ఆర్పీఎం వద్ద 14.65ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
Honda Activa 125 vs Suzuki Access 125 : హోండా యాక్టివా వర్సెస్ సుజుకీ ఏసెస్.. ది బెస్ట్ ఏదో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Bajaj Pulsar NS160 price in Hyderabad : మరోవైపు పల్సర్ ఎన్ఎస్160లో 4- వాల్వ్ సెటప్ ఉంటుంది. ఇది.. 9000 ఆర్పీఎం వద్ద 16.96 బీహెచ్పీ పవర్‌ను, 7,200 ఆర్పీఎం వద్ద 14.6ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
బజాజ్ పల్సర్ ఎన్160 వర్సెస్ పల్సర్ ఎన్ఎస్160- ధర..
ఇండియా మార్కెట్లో పల్సర్ ఎన్160 డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ ధర రూ. 1.30లక్షలుగా ఉంది. సింగిల్ ఛానెల్ ఏబీఎస్ ధర రూ. 1.23లక్షలుగా ఉంది. ఇక పల్సర్ ఎన్ఎస్160 ధర రూ. 1.25లక్షలుగా ఉంది. పైన చెప్పిన ధరలు ఎక్స్‌షోరూం ప్రైజ్‌లు.
సంబంధిత కథనం