Honda Activa 125 vs Suzuki Access 125 : దేశంలో బైక్స్‌తో పాటు స్కూటర్లకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా నగరాల్లో స్కూటర్లకు డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంది. ట్రాఫిక్‌లో సులభంగా తిరగడం, బైక్స్‌తో పోల్చుకుంటే ఖర్చు తక్కువగా ఉండటం ఇందుకు కారణం. ఇక ప్రస్తుతం మార్కెట్లో హోండా యాక్టివాకు సుజుకీ ఏసెస్ స్కూటర్లకు మంచి పోటీ నడుస్తోంది. ఈ నేపథ్యంలో హోండా యాక్టివా 125, సుజుకీ ఏసెస్ 125ని పోల్చి.. ఈ రెండింట్లో ది బెస్ట్ ఏదో తెలుసుకుందాము..
స్టాండర్డ్ యాక్టివాతో పోల్చుకుంటే.. హోండా యాక్టివ్ 125 సైజ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. డిజైన్‌లో మాత్రం మార్పులు కనిపించవు. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఆలాయ్ వీల్స్, ఎక్స్టర్నల్ ఫ్యూయెల్ ఫిల్లర్ క్యాప్, ఫుల్ మెటల్ బాడీ వస్తోంది.
Honda Activa 125 on road price in Hyderabad : ఇక ఏసెస్ 125 డిజైన్ చూస్తే.. రెట్రో వైబ్ వస్తుంది. ఇందులో స్క్వేర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. అలాయ్ వీల్స్, క్రోమ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. యాక్టివ్ 125 కన్నా ఏసెస్ 125లో కలర్ ఆప్షన్స్ చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి.
హోండా యాక్టివ్ 125లో 123.97సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 6,500 ఆర్పీఎం వద్ద 8.18 బీహెచ్పీ పవర్‌ను, 5,000 ఆర్పీఎం వద్ద 10.3ఎన్ఎం టారక్ను జనరేట్ చేస్తుంది.
Suzuki Access 125 on road price in Hyderabad : ఇక ఏసెస్ 125లో 124 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 6,750 ఆర్పీఎం వద్ద 8.58 బీహెచ్పీ పవర్‌ను, 5,500 ఆర్పీఎం వద్ద 10ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఈ రెండింట్లోనూ.. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ పొజిషన్ ల్యాంప్స్, ఎక్స్టర్నల్ ఫ్యూయెల్ ఫిల్లర్ క్యాప్, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్, అలాయ్ వీల్స్ ఉన్నాయి. ఏసెస్ 125లో యూఎస్బీ సాకెట్ అదనంగా ఉంటుంది. ఇంజిన్ స్టార్ట్/ స్టాప్ బటన్, బ్లూటూత్ ఏనెబుల్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా వస్తున్నాయి.
Suzuki Access 125 feature : హోండా యాక్టివా 125 ధర రూ. 77,743- రూ. 84,916 (ఎక్స్‌షోరూం) మధ్యలో ఉంటుంది. సుజుకీ ఏసెస్ 125 ధర రూ. 77,600- రూ. 87,200 (ఎక్స్‌షోరూం) మధ్యలో ఉంటుంది.
సంబంధిత కథనం