Suzuki Access 125లో ఇప్పుడు మరింత యూత్‌ఫుల్ కలర్ Solid Ice Green వేరియంట్ లాంచ్!
Suzuki Access 125 Solid Ice Green: సుజుకి యాక్సెస్ 125లో ఇప్పుడు మరొక అద్భుతమైన కలర్ వేరియంట్ విడుదల అయింది. తొలిసారిగా డ్యుఎల్ టోన్ పెయింట్ స్కీంలో యూత్‌ఫుల్ కలర్ ఆప్షన్‌లో వచ్చింది. దీని ధర, ఫీచర్లు, ఇతర వివరాలు చూడండి.
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తమ 125cc స్కూటర్ Suzuki Access 125 లో సరికొత్త కలర్ వేరియంట్‌ను విడుదల చేసింది. సుజుకి యాక్సెస్ 125 రైడ్ కనెక్ట్ అలాగే స్పెషల్ ఎడిషన్ స్కూటర్లను ఇప్పుడు సాలిడ్ ఐస్ గ్రీన్ లేదా పెర్ల్ మిరాజ్ వైట్ అనే ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లో కూడా పొందవచ్చు. సుజుకి యాక్సెస్ స్కూటర్ డ్యూయల్-టోన్ కలర్ థీమ్‌ను పొందడం ఇదే మొదటిసారి. దీని డ్యూయల్-టోన్ థీమ్‌కు విరుద్ధమైన రంగులో ఈ స్కూటర్ సీట్ కవర్‌ను బ్రౌన్ కలర్‌లో అందించారు. ఇది స్కూటర్‌కు మరింత స్టైలిష్ అప్పీల్‌ను అందిస్తుంది.
ఇది పండగల సీజన్ కావడంతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా కంపెనీ ఈ సరికొత్త కలర్ వేరియంట్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త కలర్ వేరియంట్ చేరికతో Suzuki Access 125 స్కూటర్ ఇప్పుడు మొత్తంగా 17 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.
Suzuki Access 125 Solid Ice Green- ధరలు
సుజుకి యాక్సెస్ సాలిడ్ ఐస్ గ్రీన్ / పెర్ల్ మిరాజ్ వైట్ కలర్ వేరియంట్ స్కూటర్ ధరలు ఎక్స్-షోరూం వద్ద రూ. 83 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి.
సుజుకి యాక్సెస్ స్పెషల్ ఎడిషన్ (డిస్క్ బ్రేక్) ధర, రూ. 83,000/-
సుజుకి యాక్సెస్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ (డ్రమ్ బ్రేక్) ధర, రూ. 85,200/-
సుజుకి యాక్సెస్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ (డిస్క్ బ్రేక్) ధర, రూ. 87,200/-
స్పెషల్ ఎడిషన్ కాకుండా సాధారణమైన సుజుకి యాక్సెస్ 125 స్టాండర్డ్ వేరియంట్ ధర ఎక్స్- షోరూం వద్ద రూ. 77,600 నుంచి ప్రారంభమవుతుంది. ఇవి సింగిల్ టోన్ కలర్ ఆప్షన్లో మాత్రమే లభిస్తాయి.
Suzuki Access 125 Ride Connect- ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
సుజుకి యాక్సెస్ 125 శ్రేణిలో ప్రీమియం వెర్షన్ స్కూటర్‌ను ‘రైడ్ కనెక్ట్’ అనే పేరుతో పిలుస్తారు. ఈ సుజుకి రైడ్ కనెక్ట్ ఎడిషన్ స్కూటర్ బ్లూటూత్ ఎనేబుల్డ్ డిజిటల్ కన్సోల్‌తో వస్తుంది. దీని సహాయంతో మీ మొబైల్ ఫోన్‌ను మీ వాహనంతో కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా అనేక రైడింగ్ ఫీచర్లను యాక్సెస్ చేయటానికి వీలు కలుగుతుంది. ఇందులో భాగంగా టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఇన్‌కమింగ్ కాల్స్, SMS , వాట్సాప్ అలర్ట్ డిస్‌ప్లే, మిస్డ్ కాల్ అలర్ట్ వంటి ఫీచర్లను పొందవచ్చు. అంతేకాకుండా వేగం ఎక్కువైనపుడు హెచ్చరికలు, ఫోన్ బ్యాటరీ స్టేటస్ డిస్‌ప్లే , గమ్యస్థానం చేరటానికి అంచనా సమయం మొదలైన అలర్ట్స్ కూడా పొందవచ్చు.
ఇంకా, క్రోమ్ ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ రీఫిల్లింగ్ మూత, సూపర్ బ్రైట్ LED హెడ్‌ల్యాంప్, LED పొజిషన్ లైట్లు, USB సాకెట్ ఉన్నాయి.
కొత్త కలర్ వేరియంట్లో యాంత్రికంగా ఎలాంటి మార్పు ఉండదు. ఇందులో 124cc ఇంజిన్ ఉంటుంది, ఇది 8.6 bhp శక్తిని, 10 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్