LML Electric Scooter । ఐకానిక్ బ్రాండ్ స్కూటర్ కంపెనీ గ్రాండ్ రీఎంట్రీ.. ఎలక్ట్రిక్ బైక్‌ల ఆవిష్కరణ!-sg corporate mobility unveils lml moonshot star orion and other electric scooter bikes ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Lml Electric Scooter । ఐకానిక్ బ్రాండ్ స్కూటర్ కంపెనీ గ్రాండ్ రీఎంట్రీ.. ఎలక్ట్రిక్ బైక్‌ల ఆవిష్కరణ!

LML Electric Scooter । ఐకానిక్ బ్రాండ్ స్కూటర్ కంపెనీ గ్రాండ్ రీఎంట్రీ.. ఎలక్ట్రిక్ బైక్‌ల ఆవిష్కరణ!

HT Telugu Desk HT Telugu
Sep 29, 2022 08:37 PM IST

LML Electric Scooter: స్కూటర్ బ్రాండ్ లోహియా మెషీన్స్ రీఎంట్రీ ఇస్తోంది. LML Orion, LML Moonshot, LML Star వంటి LML ఎలక్ట్రిక్ బైక్‌ల విశేషాలు చూడండి.

LML ebikes
LML ebikes

కొన్నేళ్ల క్రితం ఉత్పత్తి నిలిపివేసిన లోహియా మెషీన్స్ (LML), మళ్లీ చాలా కాలం తర్వాత సరికొత్త అవతారంలో పునరాగమనం చేయనుంది. SG కార్పొరేట్ మొబిలిటీ అనే సంస్థ LML బ్రాండ్‌ మీద మూడు ద్విచక్ర వాహనాలను తీసుకురాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా LML ఎలక్ట్రిక్ ఇ-బైక్, LML హైపర్‌బైక్ సహా ఐకానిక్ LML స్కూటర్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్ ప్రవేశపెట్టనున్నారు.

ఈ వరుసలో ముందుగా LML ఎలక్ట్రిక్ ఇ-బైక్, LML హైపర్‌బైక్ మార్కెట్లోకి విడుదల కాబోతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందోనన్న కుతూహలానికి నేటితో తెరపడింది. ఇ-బైక్ LML Orion పేరుతో రాబోతుంది. అలాగే హైపర్‌బైక్ LML Moonshot పేరుతో విడుదల కానుంది. తాజాగా వీటి ఆవిష్కరణ జరిగింది.

ఓరియన్ eCycle అనేది LML మొదటి ఎలక్ట్రిక్ ఉత్పత్తి. ఇది IP67 సర్టిఫైడ్ బ్యాటరీ యూనిట్, ఇన్-బిల్ట్ GPSతో వస్తుంది.

LML Orion- eBike

<p>LML Orion</p>
LML Orion

LML నుండి రెండవ ఉత్పత్తి మూన్‌షాట్. ఇది పెడల్ లేదా థ్రోటిల్ చేయగల ఈబైక్. ఇందులో మార్చుకోగలిగే బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తున్నారు.

LML Moonshot

<p>LML Moonshot</p>
LML Moonshot

ఇవి 2023 ప్రథమార్థంలో మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఈ రెండింటితో పాటు SG కార్పొరేట్ మొబిలిటీ తమ బ్రాండ్ నుంచి రాబోయే ఎలక్ట్రిక్ కాన్స్పెప్ట్ స్కూటీ LML Starను కూడా ఆవిష్కరించింది.

LML Star

<p>LML Star</p>
LML Star

LML Star మోడల్‌లో LED హెడ్‌ల్యాంప్, లెడ్ టెయిల్లాంప్, LED DRLలు, LED టర్న్ ఇండికేటర్‌లు ఉన్నాయని డిజైన్ చూపిస్తుంది. ముందు, వెనుక చక్రాలు రెండూ అల్లాయ్ వీల్, ట్యూబ్‌లెస్ టైర్‌లకు డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటాయి.

LML Electric Scooter భారతీయ మార్కెట్లో స్టార్ టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్, ఒకినావా, ప్యూర్ EVత్, హీరో ఎలక్ట్రిక్‌లతో ఇ-స్కూటర్ సెగ్మెంట్‌లో పోటీ పడుతుందని నివేదికలు పేర్కొన్నాయి.

ద్వితియార్థంలో LML Electric Scooter విడుదలవుతుంది. అయితే ఈ ఐకానిక్ స్కూటర్ ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో కంపెనీ వెల్లడించలేదు.

WhatsApp channel

సంబంధిత కథనం