TVS NTORQ 125 Blue Price। టీవీఎస్ రేసింగ్ స్కూటర్.. ఇప్పుడు ఇంకా స్టైలిష్!
టీవీఎస్ స్కూటర్ TVS NTORQ 125 రేస్ ఎడిషన్ లో ఇప్పుడు సరికొత్త సరికొత్త మెరైన్ బ్లూ కలర్ (Marine Blue) ఆప్షన్ విడుదలైంది. దీని ధర,ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
TVS మోటార్ కంపెనీ తమ పాపులర్ స్కూటర్ మోడల్ TVS NTORQ 125 రేస్ ఎడిషన్‌లో సరికొత్త మెరైన్ బ్లూ కలర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ఇప్పుడు ఆకర్షణీయమైన బ్లూ పెయింట్ స్కీమ్‌లో కూడా లభ్యమవుతోంది. రెడ్ వెర్షన్ మాదిరిగానే బ్లూ వెర్షన్‌లో కూడా ఫ్లాగ్ రేస్-ప్రేరేపిత గ్రాఫిక్‌లు అందించారు. NTorq 125 స్కూటర్ వివిధ వేరియంట్‌లను కలిగి ఉంది, వాటిలో ఒకటి ఈ రేస్ ఎడిషన్. ఇది చాలా కాలం పాటు ఎరుపు, నలుపు కలర్ షేడ్లలో మాత్రమే అందించారు. కొంత కాలం పాటు పసుపు, నలుపు షేడ్లలోనూ అందించారు. అయితే ద్విచక్ర వాహన మార్కెట్లో హోండా కంటే టీవీఎస్ వెనకబడింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా తమ సేల్స్ పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో రానున్న పండగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.
TVS NTORQ 125 కొత్త కలర్ వేరియంట్ కూడా 3-టోన్ కాంబినేషన్‌తో లభిస్తుంది. ఇందులో భాగంగా బ్లాక్, మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ బ్లూ అనే షేడ్లలో ఎంచుకోవచ్చు. ఈ స్కూటర్ రేస్ ఎడిషన్ LED టెయిల్, హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. 'రేస్ ఎడిషన్' లోగో కూడా ఇచ్చారు. ఈ కలర్ వేరియంట్ స్కూటర్ ఇంకా స్టబ్ మఫ్లర్, టెక్స్‌చర్డ్ ఫ్లోర్‌బోర్డ్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.
మెరైన్ బ్లూ కలర్‌లో కొత్త TVS NTORQ 125 రేస్ ఎడిషన్ ధర రూ. 87,011/- (ఎక్స్-షోరూమ్). భారతదేశంలోని అన్నీ TVS మోటార్ డీలర్‌షిప్‌లలో ఇప్పుడు కొత్త షేడ్ కోసం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
TVS NTORQ 125 రేస్ ఎడిషన్ స్పెక్స్- ఫీచర్స్
TVS NTORQ 125 రేస్ ఎడిషన్ స్కూటర్‌లో 124.8 cc సామర్థ్యం కల సింగిల్-సిలిండర్ 4-స్ట్రోక్, 3-వాల్వ్, ఎయిర్-కూల్డ్ SOHC, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 6.9 kW శక్తిని, 10.5 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ రేస్ ఎడిషన్ స్కూటర్ గంటకు 95 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఇది కేవలం 9 సెకన్లలో 0-60 kmph వేగాన్ని అందుకోగలదు.
ఇంకా ఈ స్కూటర్‌లో పాస్-బై స్విచ్, డ్యూయల్ సైడ్ స్టీరింగ్ లాక్, పార్కింగ్ బ్రేక్, ఇంజన్ కిల్ స్విచ్ వంటి కీలక ఫీచర్లు లభిస్తాయి. అదనంగా, USB ఛార్జర్, 20-లీటర్ బూట్ సామర్థ్యం, TVS EZ సెంటర్ స్టాండ్‌ను కలిగి ఉంటుంది. TVS NTORQ 125 స్కూటర్‌ను బ్లూటూత్ ద్వారా TVS SmartXonnectTMతో కనెక్ట్ చేసుకొని 60కి పైగా ఫీచర్లను డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.
సంబంధిత కథనం