Honda Activa 7G । మరింత కొత్తగా ముస్తాబై రాబోతున్న హోండా యాక్టివా, వివరాలు ఇవిగో-honda activa 7g scooter to be launched soon check latest updates ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Honda Activa 7g । మరింత కొత్తగా ముస్తాబై రాబోతున్న హోండా యాక్టివా, వివరాలు ఇవిగో

Honda Activa 7G । మరింత కొత్తగా ముస్తాబై రాబోతున్న హోండా యాక్టివా, వివరాలు ఇవిగో

HT Telugu Desk HT Telugu
Aug 10, 2022 05:02 PM IST

హోండా టూవీలర్స్ కంపెనీ త్వరలో కొత్త తరం హోండా యాక్టివా (Honda Activa 7G)ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. దీనిలో ఎలాంటి ఫీచర్లు కొత్తగా రాబోతున్నాయో ఓ లుక్ వేయండి.

<p>Honda Activa 7G</p>
<p>Honda Activa 7G</p>

హోండా 2వీలర్స్ తన రాబోయే కొత్త స్కూటర్ Honda Activa 7G టీజర్‌ను విడుదల చేసింది. దీంతో ఈ కొత్త స్కూటర్ లాంచ్‌ ఎప్పుడెప్పుడా అని ఆసక్తి మొదలైంది. భారతీయ మార్కెట్లో హోండా యాక్టివా ఒక సూపర్ హిట్ స్కూటర్ మోడల్. జనవరి 2020లో లాంచ్ అయిన ఆరవ తరం మోడల్‌ మాత్రమే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది. మళ్లీ ఇది విడుదలైన రెండేళ్ల తర్వాత 7వ తరం హోండా యాక్టివా త్వరలోనే రాబోతుంది. ఈ నేపథ్యంలో Honda Activa 7G ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం ఉన్న ఇంజన్ కెపాసిటీ, ఫీచర్లలో ఏమైనా పెరుగుదల ఉంటుందా అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇటీవల విడుదల చేసిన టీజర్లో స్కూటర్ ఫ్రంట్ కౌల్‌ను మాత్రమే పాక్షికంగా బహిర్గతం చేశారు. చిత్రంలో హెడ్‌ల్యాంప్ టర్న్ ఇండికేటర్‌లను కలిగి ఉంది, హోండా బ్యాడ్జ్ కనిపిస్తున్నాయి. డిజైన్ విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. టీజర్ గమనిస్తే ప్రస్తుత Activa 6G మాదిరిగానే Honda Activa 7G డిజైన్‌ను కలిగి ఉంది. అయితే ఫీచర్లలో ఏమైనా కొత్త అప్‌డేట్‌లు తీసుకువచ్చే అవకాశం ఉంది.

Honda Activa 7G ఫీచర్లు, స్పెక్స్ అంచనా

ప్రతి కొత్త తరం యాక్టివాలో సరికొత్త ట్రెండ్‌లు, సాంకేతికతను కంపెనీ అందిస్తూ వస్తోంది. అదేవిధంగా, ఈ 2022 Activa 7Gలో కూడా అప్‌డేట్ చేసిన టెక్నాలజీ, బ్లూటూత్, SMSతో కూడిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ , కాల్ అలర్ట్‌లు వంటి ఫీచర్లు ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం Activa 6Gలో స్కూటర్ BS6-ఆధారిత 109.51cc సింగిల్-సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్‌ను ఇచ్చారు. ఇది 8,000 rpm వద్ద 7.68 BHP శక్తిని, అలాగే 5,250 rpm వద్ద 8.79 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేయగలదు. దీని ఇంజన్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు.

కొన్ని చిన్న ట్వీక్‌లతో ఇదే ఇంజిన్‌ను Honda Activa 7Gలోనూ అందించవచ్చునని భావిస్తున్నారు.

కొత్త తరం హోండా స్కూటర్‌కు సంబంధించిన అధికారిక వివరాలు రానున్న వారాల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.

టాపిక్