Yamaha Aerox 155 MotoGP । యమహా ప్రత్యేక ఎడిషన్ రేస్ స్కూటర్.. దూసుకుపోతుందంతే!-2022 yamaha aerox 155 motogp price features and all the details you need to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yamaha Aerox 155 Motogp । యమహా ప్రత్యేక ఎడిషన్ రేస్ స్కూటర్.. దూసుకుపోతుందంతే!

Yamaha Aerox 155 MotoGP । యమహా ప్రత్యేక ఎడిషన్ రేస్ స్కూటర్.. దూసుకుపోతుందంతే!

HT Telugu Desk HT Telugu
Sep 25, 2022 09:43 AM IST

యమహా నుంచి 2022 Yamaha Aerox 155 MotoGP ఇది Monster Energy స్పాన్సర్ చేస్తున్న ప్రత్యేక ఎడిషన్ స్కూటర్. ఈ స్కూటర్ ప్రత్యేకతలు, ధర మొదలైన వివరాలు చూడండి.

2022 Yamaha Aerox 155 MotoGP
2022 Yamaha Aerox 155 MotoGP

ప్రముఖ ద్విచక్ర వాహనతయారీదారు యమహా తమ బ్రాండ్ నుంచి స్పెషల్ ఎడిషన్ సిరీస్ అయినటువంటి MotoGP ఎడిషన్‌లో సరికొత్త Aerox 155 స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ ప్రత్యేక MotoGP ఎడిషన్ కోసం 'మాన్‌స్టర్ ఎనర్జీ' డ్రింక్ కంపెనీ ప్రధాన స్పాన్సర్‌గా ఉంటుంది. యమహా కంపెనీ తమ ద్విచక్ర వాహనాల శ్రేణిలో MotoGP ఎడిషన్‌లను తీసుకురావాలనే ప్రణాళికతో ఉంది. ఇందులో భాగంగా ఇదివరకే పలు మోడళ్లలో స్పెషల్ ఎడిషన్ మోటార్ సైకిళ్లను లాంచ్ చేసింది. మామూలు యమహ బైక్ మోడళ్లతో పోలిస్తే ఈ స్పెషల్ ఎడిషన్ బైక్‌లు డిజైన్ పరంగా, ఫీచర్ల పరంగా, అలాగే పనితీరుపరంగా కాస్త మెరుగ్గా ఉంటాయి. ఈ క్రమంలో వీటి ధర కూడా మిగతా వాటికంటే ఎక్కువగానే ఉంటుంది.

భారత మార్కెట్లో 2022 Yamaha Aerox 155 MotoGP ఎడిషన్‌ స్కూటర్‌ ధర ఎక్స్- షోరూమ్ వద్ద రూ. 1.41 లక్షలుగా ఉంది. అంటే స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 2 వేలు ఎక్కువ. ఎక్స్- షోరూమ్ వద్ద స్టాండర్డ్ మోడల్ Yamaha Aerox స్కూటర్ ధర రూ. 1,39,300 కి అందుబాటులో ఉంది.

Yamaha Aerox 155 MotoGP డిజైన్

కాగా, సరికొత్త Yamaha Aerox 155 MotoGP ఎడిషన్‌ స్కూటర్ యాంత్రికంగా ఎలాంటి అప్‌గ్రేడ్‌లను పొందలేదు. డిజైన్‌కు సంబంధించి కొన్ని కాస్మొటిక్ అప్‌డేట్లతో మాత్రం వచ్చింది. స్పెషల్ ఎడిషన్ Aerox 155 పూర్తిగా నలుపు రంగు ట్రీట్‌మెంట్‌ను కలిగి ఉంది. వైజర్, ఫ్రంట్ ఆప్రాన్, ఫ్రంట్ మడ్‌గార్డ్, సైడ్ ప్యానెల్‌లు, వెనుక ప్యానెల్‌లపై Yamaha MotoGP బ్రాండింగ్ ఉంది.

Yamaha Aerox 155 MotoGP ఇంజిన్, స్పెసిఫికేషన్లు

Yamaha Aerox 155 స్కూటర్‌లో యమహా R15 బైక్‌లో ఉన్నట్లుగా 155cc సామర్థ్యం కలిగిన బ్లూ కోర్ ఇంజిన్ (లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, SOHC, 4-వాల్వ్). ఉంటుంది. ఈ ఇంజిన్‌ను CVT యూనిట్‌తో జత చేశారు. ఇది గరిష్టంగా 15 PS శక్తిని, 13.9 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Aerox 155 MotoGP ఎడిషన్‌లో 14-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో కూడిన ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చారు. ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనకవైపు డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఫ్రంట్ బ్రేక్‌లో సింగిల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది.

Yamaha Aerox 155 MotoGP ఫీచర్లు

మిగతా ఫీచర్ల విషయానికి వస్తే.. Aerox 155 MotoGP ఎడిషన్‌లో LED హెడ్‌లైట్, LED టైల్‌లైట్, సీటు కింద 24.5 లీటర్ బూట్ స్పేస్, బాహ్య ఇంధన మూత, స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జింగ్ చేయడానికి USB పోర్ట్, మల్టీ-ఫంక్షన్ కీ స్విచ్, సైడ్ స్టాండ్ కట్-ఆఫ్, బ్లూటూత్ కనెక్టివిటీ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్