Exter vs Fronx : హ్యుందాయ్ ఎక్స్టర్ వర్సెస్ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్.. ఏది బెస్ట్?
11 July 2023, 17:03 IST
- Hyundai Exter vs Maruti Suzuki Fronx : హ్యుందాయ్ ఎక్స్టర్ వర్సెస్ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్.. ఈ రెండింట్లో ఏ ఎస్యూవీ బెస్ట్? ఇక్కడ తెలుసుకుందాము..
హ్యుందాయ్ ఎక్స్టర్ వర్సెస్ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్.. ఏది బెస్ట్?
Hyundai Exter vs Maruti Suzuki Fronx : దేశ ఆటోమొబైల్ మార్కెట్లో లేటెస్ట్ ఎంట్రీ హ్యుందాయ్ ఎక్స్టర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తక్కువ ధరకు అదిరిపోయే ఫీచర్స్ ఇస్తున్న ఈ ఎస్‌యూవీపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు ఈ మోడల్.. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రెండింటి స్పెసిఫికేషన్స్ ఏంటి..?
ఎక్స్టర్ ఎస్‌యూవీలో ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్, బ్లాక్ రేడియేటర్ గ్రిల్, సిల్వర్డ్ స్కిడ్ ప్లేట్స్, రూఫ్ రెయిల్స్, ఇండికేటర్ మౌంటెడ్ ఓఆర్వీఎంలు, క్లాడింగ్, 15 ఇంచ్ డైమెంట్ కట్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి.
ఇక మారుతీ ఫ్రాంక్స్ ఎస్‌యూవీలో బ్లాక్డ్ ఔట్ గ్రిల్, పెద్ద హుడ్, రూఫ్ రెయిల్స్, ఇండికేటర్ మౌంటెడ్ ఓఆర్వీఎంలు, ఆల్ ఎల్ఈడీ లైటింగ్, బ్లాక్డ్ ఔట్ వీల్ ఆర్చీస్, 16 ఇంచ్ అలా వీల్స్ వస్తున్నాయి.
Hyundai Exter dimensions : డైమెన్షన్స్ విషయానికొస్తే.. ఎక్స్టర్ పొడవు 3,815ఎంఎం. వెడల్పు 1,710ఎంఎం. వీల్‌బేస్ 2,450ఎంఎం. మరోవైపు ఫ్రాంక్స్ పొడవు 3,999ఎంఎం. వెడల్పు 1,765ఎంఎం. వీల్‌బేస్ 2,520ఎంఎం.
ఇదీ చూడండి:- Maruti Suzuki Fronx vs Baleno : ఫ్రాంక్స్ వర్సెస్ బలెనో.. ఈ కార్లలో ఏది బెస్ట్?
ఈ రెండింటి ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..
హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్యూవీ 5 సీటర్ కేబిన్‌లో బ్లాక్డ్ ఔట్ డాష్‌బోర్డ్, లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, మెటల్ పెడల్స్, రేర్ ఏసీ వెంట్స్, క్రోమ్ ఫినిష్డ్ గేర్ నాబ్‌లు వస్తున్నాయి. వయర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, 2.32 ఇంచ్ డిస్పలే ట్విన్ కెమెరాలతో కూడిన డాష్‌బోర్డ్. 8 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ కమాండ్‌తో కూడిన ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, క్రూజ్ కంట్రోల్, ఏబీఎస్, ఈఎస్సీ వంటివి లభిస్తున్నాయి.
Maruti Suzuki Fronx price in Hyderabad : మరోవైపు మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌లో లెథరెట్ అప్‌హోలిస్ట్రీ, డ్యూయెల్ టోన్ డాష్‌బోర్డ్, రేర్ ఏసీ వెంట్స్, క్రోమ్ ప్లేటెడ్ డోర్ హ్యాండిల్స్, ఫ్లాట్ బాటమ్ మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, రేర్ పార్సెల్ ట్రే, హెడ్ అప్ డిస్ప్లే, వయర్లెస్ ఛార్జర్, 9 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, యాంబియెంట్ లైటింగ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్సీ, రేర్ వ్యూ కెమెరాలు వస్తున్నాయి.
ఈ రెండు ఎస్‌యూవీలోని ఇంజిన్ ఆప్షన్స్ ఇవే..
హ్యుందాయ్ కొత్త వెహికిల్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 82 హెచ్‌పీ పవర్‌ను, 113.8 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్/ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది. సీఎన్జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉండనుంది.
మారుతీ సుజుకీ వెహికల్లో 1.2 లీటర్ డ్యూయెల్జెట్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 89హెచ్‌పీ పవర్‌ను, 113ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 1.0 లీటర్ బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ ఇంజిన్.. 99 హెచ్‌పీ పవర్‌ను, 147.6 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి.
వీటి ధరలు ఎంతంటే..
Hyundai Exter price : ఎక్స్టర్ ఎక్స్‌షోరూం ధర రూ. 5.99లక్షలు- రూ. 9.5లక్షల వరకు ఉంటుంది. ఇక ఫ్రాంక్స్ ఎక్స్‌షోరూం ధర రూ. 7.49లక్షలు- రూ. 13.13లక్షల మధ్యలో ఉంటుంది.