తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Creta Facelift : హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​లో భారీ మార్పులు పక్కా! లాంచ్​ ఎప్పుడు?

Hyundai Creta facelift : హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​లో భారీ మార్పులు పక్కా! లాంచ్​ ఎప్పుడు?

Sharath Chitturi HT Telugu

02 July 2023, 13:40 IST

google News
    • Hyundai Creta facelift : హ్యుందాయ్​ క్రేటా ఎస్​యూవీ ఫేస్​లిఫ్ట్​కు సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది. ఈ మోడల్​ టెస్ట్​ రన్​ జరిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు..
హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​లో భారీ మార్పులు పక్కా! లాంచ్​ ఎప్పుడు?
హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​లో భారీ మార్పులు పక్కా! లాంచ్​ ఎప్పుడు?

హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​లో భారీ మార్పులు పక్కా! లాంచ్​ ఎప్పుడు?

Hyundai Creta facelift test run : దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హ్యుందాయ్​ మోటార్​కు ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉంది 'క్రేటా' ఎస్​యూవీ. ఈ క్రేటాకు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ రాబోతోందని గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు ఈ ఊహాగానాలను నిజం చేస్తూ ఓ వార్త బయటకొచ్చింది. క్రేటా ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ ప్రస్తుతం టెస్ట్​ రన్​ దశలో ఉన్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఫలితంగా ఈ మోడల్​ త్వరలోనే ఇండియాలో లాంచ్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​..

మధ్యప్రదేశ్​ ఇండోర్​లో ఖండ్వాకు సమీపంలోని నాట్రాక్స్​ టెస్టింగ్​ సెంటర్​లో హ్యుందాయ్​ క్రేటా ఎస్​యూవీ టెస్ట్​ రన్​ జరిగింది. ఆన్​లైన్​లో తొలిసారిగా ఈ మోడల్​ ఫొటోలు లీక్​ అయ్యాయి.

Hyundai Creta facelift launch date : క్రేటాను 2016లో ఇండియాలో లాంచ్​ చేసింది హ్యుందాయ్​ సంస్థ. ఇక ఈ ఎస్​యూవీకి చెందిన ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ వచ్చే ఏడాది లాంచ్​ అవ్వొచ్చు. లాంచ్​ తర్వాత.. ఈ మోడల్​ కియా సెల్టోస్​, మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా వంటి ఎస్​యూవీలకు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

ఇక తాజాగా లీకైన ఫొటోల్లో క్రేటా డిజైన్​ పరంగా పెద్దగా వివరాలు తెలియడం లేదు. ఈ వాహనాన్ని వ్రాప్​ చేసి టెస్ట్​ రన్​ చేయడం ఇందుకు కారణం. అయితే స్పై షాట్స్​ ప్రకారం.. ఈ ఎస్​యూవీలో వర్టికల్​ ఎల్​ఈడీ హెడ్​లైట్​ క్లస్టర్​ ఉంటుందని తెలుస్తోంది. అలాయ్​ వీల్స్​ కొత్తగా వస్తున్నట్టు కనిపిస్తోంది. వీల్స్​ డిజైన్​ కూడా కొత్తగా ఉంది. హ్యుందాయ్​ అల్కజార్​ను ఇవి పోలి ఉన్నాయి.

ఇదీ చూడండి:- Hyundai car Sales: జూన్ నెలలో హ్యుండై కార్ల అమ్మకాల జోరు; ఈనెలలోనే మార్కెట్లోకి ఎక్స్టర్ ఎస్యూవీ

కేబిన్​లో భారీ మార్పులు పక్కా..!

Hyundai Creta facelift India : రానున్న క్రేటా వర్షెన్​కు సంబంధించిన రూఫ్​లైన్​ని కూడా స్పై షాట్స్​ చూపించాయి. పెద్దగా మార్పులేవీ కనిపించలేదు. అయితే ఓఆర్​వీఎంలపై కెమెరా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. ఈ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లో 360 డిగ్రీ వ్యూ ఫీచర్​ ఉండనుంది.

ఇక వెహికిల్​ రేర్​లో బంపర్​ను రీడిజైన్​ చేసే అవకాశం ఉంది. టెయిల్​గేట్​ క్లస్టర్​ కొత్తగా ఉండొచ్చు. ఎల్​ఈడీ లైట్​ బార్​ కూడా కొత్తగా రావొచ్చు. ఫ్రెంట్​ ఫేస్​ కూడా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త గ్రిల్​ ఉండొచ్చు.

హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​ కేబిన్​లో భారీ మార్పులే జరగొచ్చని తెలుస్తోంది. ఏడీఏఎస్​ టెక్నాలజీ రాబోతోంది! కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​లోనూ ఇది ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

Hyundai Creta facelift 2023 : ఇక ఈ క్రేటా కొత్త వర్షెన్​లో 1.5లీటర్​ పెట్రోల్​, 1.5 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ కొత్తగా ఉండే అవకాశం ఉంది. 1.5 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ కూడా ఉండొచ్చు. వెర్నా ఫేస్​లిఫ్ట్​లో దీనిని తొలిసారిగా పరిచయం చేసింది సంస్థ.

ఈ క్రేట్​ ఫేస్​లిఫ్ట్​ ఎస్​యూవీ ఫీచర్స్​, స్పెసిఫికేషన్స్​, ధర వంటి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు హ్యుందాయ్​ క్రేటా ఈవీ ని కూడా సంస్థ ప్లాన్​ చేస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం