Hyundai car Sales: జూన్ నెలలో హ్యుండై కార్ల అమ్మకాల జోరు; ఈనెలలోనే మార్కెట్లోకి ఎక్స్టర్ ఎస్యూవీ
Hyundai car Sales: జూన్ నెలలో కూడా హ్యుండై కార్ల అమ్మకాల జోరు కొనసాగింది. జూన్ లో మొత్తం 65,601 కార్లను హ్యుండై అమ్మగలిగింది. ఇది గత సంవత్సరం జూన్ నెల అమ్మకాల కన్నా 5% అధికం.
Hyundai Sales: జూన్ నెలలో కూడా హ్యుండై కార్ల అమ్మకాల జోరు కొనసాగింది. జూన్ లో మొత్తం 65,601 కార్లను హ్యుండై అమ్మగలిగింది. ఇది గత సంవత్సరం జూన్ నెల అమ్మకాల కన్నా 5% అధికం. 2022 జూన్ లో మొత్తం 62,351 హ్యుండై కార్లు అమ్ముడుపోయాయి. ఈ వివరాలను హ్యుండై మోటార్ ఇండియా లిమిటెడ్ (Hyundai Motor India Ltd HMIL) శనివారం వెల్లడించింది.
ఎగుమతుల్లో భారీ పెరుగుదల
జూన్ నెలలో దేశీయంగా హ్యుండై కార్ల అమ్మకాల్లో 2% పెరుగుదల నమోదైందని హ్యుండై సంస్థ వెల్లడించింది. జూన్ లో దేశీయంగా 50,001 యూనిట్లను అమ్మగలిగామని, గత సంవత్సరం జూన్ లో 49,001 యూనిట్లను అమ్మగలిగామని వెల్లడించింది. అలాగే, ఎగుమతుల్లో 17% మెరుగుదలను సాధించగలిగామని తెలిపింది. ఈ జూన్ లో 15,600 యూనిట్ల హ్యుండై కార్లను ఎగుమతి చేశామని, గత సంవత్సరం జూన్ లో 13,350 యూనిట్ల హ్యుండై కార్లను ఎగుమతి చేశామని తెలిపింది.
వెర్నా, క్రెటా, టస్కన్..
ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లో వెర్నా, క్రెటా, టస్కన్ కార్లు తమ తమ సెగ్మెంట్లలో మార్కెట్ లీడర్స్ గా నిలిచాయని HMIL సీఓఓ తరుణ్ గార్గ్ వెల్లడించారు. మిగతా మోడల్స్ కు కూడా వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు.
జులైలో మార్కెట్లోకి ఎక్స్ టర్ ఎస్ యూ వీ
ఈ నెలలో మైక్రో ఎస్ యూ వీ ఎక్స్టర్ (Exter) ను హ్యుండై భారతీయ మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. ఈ కారు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ. 11 వేలు చెల్లించి ప్రి బుక్ చేసుకోవచ్చు. హ్యుండై ఎక్స్టర్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ), ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్. ఈ మోడల్స్ లో 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్, స్మార్ట్ ఆటో ఏఎంటీ (Automated Manual Transmission) వర్షన్స్ లో లభిస్తుంది. సీఎన్జీ వర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ కారు ఆరు సింగిల్ టోన్, మూడు డ్యుయల్ టోన్ కలర్స్ లో లభిస్తుంది. కొత్తగా కాస్మిక్ బ్లూ, రేంజర్ ఖాకీ కలర్స్ ను యాడ్ చేశారు.