Hyundai CRETA EV : టెస్ట్ రన్ దశలో హ్యుందాయ్ క్రేటా ‘ఈవీ’.. లాంచ్ ఎప్పుడు?
01 May 2023, 7:29 IST
- Hyundai CRETA EV : హ్యుందాయ్ క్రేట్ ఈవీ.. ప్రస్తుతం టెస్ట్ రన్ దశలో ఉంది. ఈ ఈవీ మోడల్‌పై భారీ అంచనాలే ఉన్నాయి.
టెస్టింగ్ దశలో హ్యుందాయ్ క్రేటా ఈవీ.. లాంచ్ ఎప్పుడు?
Hyundai CRETA EV : తన పోర్ట్‌ఫోలియోలోని బెస్ట్ సెల్లింగ్ మోడల్ క్రేటాకు ఈవీ టచ్ ఇచ్చేందుకు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ హ్యుందాయ్ క్రేటా ఈవీ.. ఇండియాలో త్వరలోనే లాంచ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ-ఎస్యూవీ టెస్ట్ రన్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పిక్స్ పలుమార్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి.
ఇటీవలి కాలంలో.. ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌పై హ్యుందాయ్ మోటార్స్ ఎక్కువ ఫోకస్ చేస్తోంది! ఇందుకు తగ్గట్టుగానే ఇండియా మార్కెట్లో ఐయానిక్ 5, కోనా ఈవీలను లాంచ్ చేసింది. ఇక ఇప్పుడు క్రేటా ఈవీ లాంచ్‌కు సన్నద్ధమవుతోంది. క్రేట్‌కు ఉన్న డిమాండ్‌ను చూసి.. ఈవీ వర్షెన్‌కి కూడా ఆదరణ లభిస్తుందని ఆశలు పెట్టుకుంది.
హ్యుందాయ్ క్రేటా ఈవీ- లుక్స్..
Hyundai CRETA EV launch in India : హ్యుందాయ్ క్రేటా ఈవీ డిజైన్.. ఐసీఈ ఇంజిన్‌తోనే పోలి ఉంటుంది! ఇందులో స్కల్ప్టెడ్ హుడ్, క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్ విత్ క్రోమ్ హెడ్‌లైట్స్, ఇంటిగ్రేటెడ్ స్ప్లిట్ టైప్ డీఆర్ఎల్స్తో కూడిన ట్రై బీమ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, రూఫ్ రెయిల్స్, స్కిడ్ ప్లేట్స్, డిజైనర్ అలాయ్ వీల్స్ ఉంటాయి. ఇక రేర్‌లో రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్‌తో పాటు స్ప్లిట్ స్టైల్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ రావొచ్చు.
ఇదీ చదవండి:- C3 Aircross vs Hyundai Creta : సీ3 ఎయిర్‌క్రాస్ వర్సెస్ హ్యుందాయ్ క్రేటా.. ఏది బెస్ట్?
హ్యుందాయ్ క్రేటా ఈవీ- ఫీచర్స్..
ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ కేబిన్ కూడా ఐసీఈ ఇంజిన్ వేరియంట్‌ను పోలి ఉండే అవకాశం ఉంది. విలాసవంతమైన 5 సీటర్ కేబిన్‌లో డ్యూయెల్ టోన్ డాష్‌బోర్డ్, ప్రీమియం అప్‌హోలిస్ట్రీ, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వయర్లెస్ ఛార్జర్, యాంబియెంట్ లైటింగ్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, భారీ ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్ వచ్చే అవకాశం ఉంది.
ప్యాసింజర్ సేఫ్టీ కోసం ఈవీల మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్సీలు రావొచ్చు.
హ్యుందాయ్ క్రేటా ఈవీ- రేంజ్..
Hyundai CRETA EV price : క్రేటా ఈవీ టెక్నికల్ వివరాలు ఇంకా అందుబాటులో లేవు. కాగా ఈ-ఎస్‌యూవీలో భారీ బ్యాటరీ ప్యాక్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 400కి.మీలు ప్రయాణించే విధంగా ఈ ఈవీని హ్యుందాయ్ రూపొందిస్తున్నట్టు సమచారం.
హ్యుందాయ్ క్రేటా ఈవీ- ధర..
ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న క్రేటా ఈవీ ధరకు సంబంధించిన వివరాలను సంస్థ ఇంకా ప్రకటించలేదు. లాంచ్ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. ఐసీఈ ఇంజిన్ వర్షెన్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 10.87లక్షలుగా ఉంది. ఈవీ ధర ఏ విధంగా ఉంటుందోనని మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.