Honda new EV : 'ఈవీ' కోసం హోండా క్రేజీ ప్లాన్.. సూపర్ లైనప్‌తో మార్కెట్లోకి!
30 April 2023, 6:22 IST
- Honda new EV : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా.. ఈవీ పోర్ట్‌ఫోలియోను పెంచుకునేందుకు క్రేజీ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే పలు మోడల్స్‌ను లాంచ్ చేయనుంది!
'ఈవీ' కోసం హోండా క్రేజీ ప్లాన్.. సూపర్ లైనప్‌తో మార్కెట్లోకి!
Honda new EV : దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా.. డెడికేటెడ్ ఎలక్ట్రిక్ వెహికిల్ ప్లాట్ఫార్మ్పై పని చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాట్ఫార్మ్పై మిడ్ సైజ్ నుంచి లార్జ్ సైజ్ వరకు ఈవీలను రూపొందించవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సరికొత్త ఎస్‌యూవీని 2025 నాటికి అంతర్జాతీయంగా లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. కంపెనీ భవిష్యత్తు కార్యచరణను వివరించేందుకు ఏర్పాటు చేసిన ఈవెంట్లో.. హోండా అధ్యక్షుడు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. మరి ఈ ఈవీ ఇండియా మార్కెట్లోకి వస్తుందా? లేదా? అన్న అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.
ప్రస్తుతానికైతే.. ఈ కొత్త ఈవీ ప్లాట్ఫార్మ్ గురించి హోండా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే.. అకూరా జెడ్డీఎక్స్, ప్రొలోగ్ వంటి మోడల్స్‌కు ఈవీ వర్షెన్‌ను 2024 నాటికి లాంచ్ చేయాలని సంస్థ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు వాహనాలు జీఎం (జనరల్ మోటార్స్) అల్టియం ప్లాట్ఫార్మ్పై రూపొందుతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సంస్థల మధ్య భాగస్వామ్యం ఉండటంతో, భవిష్యత్తులోనూ చౌకైన్ వాహనాలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు సమాచారం. ఇవి 2027 నుంచి లాంచ్ అవుతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చదవండి:- Honda electric motorcycles: 500 - 750 సీసీ ఎలక్ట్రిక్ బైక్స్ పై హోండా దృష్టి
Honda EV cars : ఇక నార్త్ అమెరికాలోని తమ ప్రొడక్షన్ ప్లాంట్‌ను ఈవీ హబ్‌గా మార్చాలని హోండా ప్రయత్నిస్తోంది. ఈ ఎన్ఎస్2, ఈన్పీ2 వంటి మోడల్స్ 2024 తొలినాళ్లల్లోనే లాంచ్ అవ్వొచ్చు. ఈఎన్ ఎస్యూవీ ప్రొడక్షన్ వర్షెన్ కాన్సెప్ట్ 2024 చివర్ల బయటకి వస్తుందని ససమాచారం. వీటితో పాటు మరో 7 ఎలక్ట్రిక్ వాహనాలను 2027లోపు లాంచ్ చేయాలని ప్లాన్ వేసింది హోండా.
ఇండియా మార్కెట్లో..
ఇండియా మార్కెట్లో ఓ కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీని లాంచ్ చేస్తోంది హోండా. జూన్‌లో దీనిని ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ ఎస్యూవీ.. ఇప్పటికే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రేటా, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, కియా సెల్టోస్, వోక్స్వ్యాగన్ టైగన్, ఎంజీ ఆస్టర్, స్కోడా కుషాక్ వంటి మోడల్స్‌కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్ల అంచనాలు ఉన్నాయి.
Honda cars news latest : హోండా సిటీని రూపొందించిన ప్లాట్ఫార్మ్పైనే ఈ కొత్త ఎస్‌యూవీని తయారు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది! 6 స్పీడ్ మేన్యువల్, సీవీటీ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉండొచ్చు.