Hyundai Verna vs Honda city : హ్యుందాయ్​ వెర్నా వర్సెస్​ హోండా సిటీ.. ఏది బెస్ట్?-2023 hyundai verna vs honda city check features price and detailed comparison here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Verna Vs Honda City : హ్యుందాయ్​ వెర్నా వర్సెస్​ హోండా సిటీ.. ఏది బెస్ట్?

Hyundai Verna vs Honda city : హ్యుందాయ్​ వెర్నా వర్సెస్​ హోండా సిటీ.. ఏది బెస్ట్?

Sharath Chitturi HT Telugu
Mar 23, 2023 09:42 AM IST

2023 Hyundai Verna vs Honda city : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని సెడాన్​ సెగ్మెంట్​లో హ్యుందాయ్​ వెర్నా, హోండా సిటీ ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారాయి. ఈ రెండింటికీ ఇటీవలే అప్డేటెడ్​ వర్షెన్​లు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. ఈ రెండు మోడల్స్​లో ఏది బెస్ట్​ అన్నది తెలుసుకుందాము..

హ్యుందాయ్​ వెర్నా వర్సెస్​ హోండా సిటీ.. ఏది బెస్ట్​?
హ్యుందాయ్​ వెర్నా వర్సెస్​ హోండా సిటీ.. ఏది బెస్ట్​?

2023 Hyundai Verna vs Honda city : 2023 వెర్నాను లాంచ్​ చేసి మిడ్​ సైజ్​ సెడాన్​ సెగ్మెంట్​లోకి రీ ఎంట్రీ ఇచ్చింది ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థ హ్యుందాయ్​. ఇక ఈ హ్యుందాయ్​ వెర్నా.. ఇదే సెగ్మెంట్​లో రారాజుగా కొనసాగుతున్న హోండా సిటీకి గట్టిపోటీనిస్తోంది. 2023 హోండా సిటీ కూడా ఇటీవలే మార్కెట్​లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో.. ఈ రెండు అప్డేటెడ్​ కార్లను పోల్చి.. ది బెస్ట్​ ఏది? ఏది కొంటే బెటర్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

2023 హ్యుందాయ్​ వెర్నా వర్సెస్​ 2023 హోండా సిటీ- లుక్స్​..

2023 Honda city price : 2023 హోండా సిటీలో స్కల్ప్​టెడ్​ బానెట్​, స్లోపింగ్​ రూఫ్​లైన్​, స్వెప్ట్​బ్యాక్​ ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, రీడిజైన్డ్​ హనీకూంబ్​ మెష్​ గ్రిల్​, 16 ఇంచ్​ డైమండ్​ కట్​ అలాయ్​ వీల్స్​, జెడ్​ షెప్​ 3డీ వ్రాప్​- అరౌండ్​ ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​ ఉంటాయి.

2023 Hyundai Verna on road price Hyderabad : ఇక 2023 హ్యుందాయ్​ వెర్నాలో మస్క్యులర్​ హుడ్​, బంపర్​- మౌంటెడ్​ ఎల్​ఈడీ లైట్స్, స్ప్లిట్​ టైప్​ ఫుల్​- విడ్త్​ డీఆర్​ఎల్​, పారామెట్రిక్​ గ్రిల్​, స్లోపింగ్​ రూఫ్​లైన్​, 16 ఇంచ్​ డైమండ్​ కట్​/ బ్లాక్డ్​- ఔట్​ అలాయ్​ వీల్స్​, కనెక్టెడ్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్స్​ ఉంటాయి.

2023 హ్యుందాయ్​ వెర్నా వర్సెస్​ 2023 హోండా సిటీ- ఇంజిన్​..

2023 Honda city on road price Hyderabad : హోండా సిటీ అప్డేటెడ్​ వర్షెన్​లో 1.5 లీటర్​ పెట్రోల్​- హైబ్రీడ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 125హెచ్​పీ పవర్​ను, 253 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇక 1.5లీటర్​ ఇన్​లైన్​ 4 సిలిండర్​ పెట్రోల్​ ఇంజిన్​.. 119.35హెచ్​పీ పవర్​ను, 145 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఈ రెండింట్లోనూ 5 స్పీడ్​ మేన్యువల్​, సీవీటీ, ఈ-సీవీటీ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉన్నాయి.

2023 Hyundai Verna launch : 2023 హ్యుందాయ్​ వెర్నాలో 1.5 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 113.4 హెచ్​పీ పవర్​ను, 144 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇక 1.5లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​.. 158హెచ్​పీ పవర్​ను, 253 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఈ రెండింట్లోనూ 6 స్పీడ్​ మేన్యువల్​, 7 స్పీడ్​ డీసీటీ, ఐవీటీ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉన్నాయి.

2023 హ్యుందాయ్​ వెర్నా వర్సెస్​ 2023 హోండా సిటీ- ఫీచర్స్​..

2023 హోండా సిటీలో లెథర్​ అప్​హోలిస్ట్రీ, ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​, యాంబియెంట్ లైటింగ్​, సెమీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 8 ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ ప్యానెల్​ సెటప్​ ఉన్నాయి.

Hyundai Verna 2023 : ఇక హ్యుందాయ్​ వెర్నా లేటెస్ట్​ వర్షెన్​లో హీటెడ్​- వెంటిలేటెడ్​ సీట్స్​, స్విఛెబుల్​ టైప్​ ఇంటర్​ఫేస్​, డ్యూయెల్​ 10.25 ఇంచ్​ స్క్రీన్​ సెటప్​, 8 స్పీకర్​ బోస్​ సౌండ్​ సిస్టెమ్​, ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​ వంటివి ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్స్​ కింద రెండు కార్లలోనూ ఏడీఏఎస్​ సిస్టెమ్​, 6 ఎయిర్​బ్యాగ్స్​ ఉన్నాయి.

2023 హ్యుందాయ్​ వెర్నా వర్సెస్​ 2023 హోండా సిటీ- ధర..

2023 Hyundai Verna price : 2023 హోండా సిటీ ఎక్స్​షోరూం ధర రూ. 11.49లక్షలు- రూ. 20.39లక్షల మధ్యలో ఉంటుంది. ఇక 2023 హ్యుందాయ్​ వెర్నా ఎక్స్​షోరూం ధర రూ. 10.9లక్షలు- రూ. 17.38లక్షల మధ్యలో ఉంటుంది.

Whats_app_banner