2023 Honda City vs Skoda Slavia : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీలతో పాటు సెడాన్ మోడల్స్‌కి కూడా మంచి డిమాండ్ కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే.. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ఇటీవలే లాంచ్ అయ్యింది. మారుతీ సుజుకీ సియాజ్, స్కోడా స్లావియా వంటి మోడల్స్‌కు ఈ 2023 హోండా సిటీ గట్టిపోటీనిస్తోంది. ఈ తరుణంలో.. సరికొత్త హోండా సిటీని స్కోడా స్లావియాతో పోల్చి.. ఈ రెండింట్లో ఏది కొంటే బెటర్? అన్న విషయాన్ని తెలుసుకుందాము..
2023 హోండా సిటీలో మస్క్యులర్ బానెట్, స్లోపింగ్ రూఫ్‌లైన్, డీఆర్ఎల్స్తో కూడిన స్వెప్ట్‌బ్యాక్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, రీడిజైన్డ్ హనీకూంబ్ మెష్ గ్రిల్, 16 ఇంచ్ డైమెండ్ కట్ అలాయ్ వీల్స్, జెడ్ షేప్డ్ 3డీ వ్రాప్- అరౌండ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ వంటివి వస్తున్నాయి.
2023 Honda City on road price in Hyderabad : ఇక స్కోడా స్లావియాలో పెద్ద స్కల్ప్టెడ్ బానెట్, క్రోమ్ సరౌండెడ్ బటర్‌ఫ్లై గ్రిల్, షార్ప్- లుకింగ్ డ్యూయెల్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, 16 ఇంచ్ డ్యూయెల్ టోన్ అలాయ్ వీల్స్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ వంటివి లభిస్తున్నాయి.
2023 హోండా సిటీలో 1.5 లీటర్ పెట్రోల్ హైబ్రీడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 125 హెచ్‌పీ పవర్‌ను, 253 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇన్లైన్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన2.. 119.35 హెచ్‌పీ పవర్‌ను, 145 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్, సీవీటీ, ఈ- సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్స్ వస్తున్నాయి.
Skoda Slavia on road price in Hyderabad : ఇక స్కోడా స్లావియాలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 113 హెచ్‌పీ పవర్‌ను, 175 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 1.5 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్.. 148 హచ్పీ పవర్‌ను, 250 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఆటోమెటిక్, 7 స్పీడ్ డీఎస్జీ గేర్‌బాక్స్ ఆప్షన్స్ లభిస్తున్నాయి.
2023 హోండా సిటీలో ప్రీమియం లెథర్ అప్‌హోలిస్ట్రీ, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, యాంబియెంట్ లైటింగ్, క్రూజ్ కంట్రోల్, సెమీ- డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 8.0 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏడీఏఎస్ ఫంక్షన్స్ వంటి ఫీచర్స్ ఉంటాయి.
Honda City 2023 price : స్కోడా స్లావియాలో వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్స్, వయర్లెస్ ఛార్జర్, సన్‌రూఫ్, యాంబియెంట్ లైటింగ్, 8 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 8 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ2, 6 ఎయిర్‌బ్యాగ్స్ లభిస్తున్నాయి.
Skoda Slavia price Hyderabad : 2023 హోండా సిటీ ఎక్స్‌షోరూం ధర రూ. 11.49లక్షలు- రూ. 20.39లక్షల మధ్యలో ఉంటుంది. అదే సమయంలో స్కోడా స్లావియా ఎక్స్‌షోరూం ధర రూ. 11.29లక్షలు రూ. 18.4 లక్షల మధ్యలో ఉంటుంది.