Honda electric motorcycles: 500 - 750 సీసీ ఎలక్ట్రిక్ బైక్స్ పై హోండా దృష్టి
Honda electric motorcycles: ఎప్పటికప్పుడు కొత్త వాహన శ్రేణితో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో హోండా మోటార్స్ దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వాహనాల్లో చవకైన స్కూటర్స్, మోపెడ్స్ ఉత్పత్తిపై దృష్టి పెట్టిన సంస్థ తాజాగా, 500 సీసీ - 750 సీసీ రేంజ్ లో పవర్ బైక్స్ ఉత్పత్తి పై ఆసక్తి చూపుతోంది.

Honda electric motorcycles: త్వరలో పవర్ బైక్
వాహన కాలుష్యాన్ని తగ్గించే దిశగా తమ కంపెనీ వ్యూహాన్ని 2022లో హోండా సంస్థ ప్రకటించింది. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ బైక్స్ ఉత్పత్తికి ప్రాధాన్యతను పెంచింది. ఇప్పటివరకు మెజారిటీ వినియోగదారులకు అందుబాటులో ఉండేలా అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసింది. ఇకపై యువత ను దృష్టిలో పెట్టుకుని 500 సీసీ - 750 సీసీ రేంజ్ లో పవర్ బైక్స్ ను కూడా ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ బైక్స్ ను ఉత్పత్తి చేసే దిశగా వేరే ఏ ఇతర టూ వీలర్ మ్యాన్యుఫాక్చరర్ ఆలోచించలేదు. త్వరలో 500 లేదా 750 cc రేంజ్ లో టూ సిలిండర్ ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఇటీవల హోండా మోటార్ కంపెనీ ప్రకటించింది. అయితే, ఆ మోటార్ సైకిల్ కు సంబంధించిన ఇతర ఏ వివరాలు కూడా బయటకు రాలేదు.
Honda electric motorcycles: ఇప్పుడున్న ప్లాట్ ఫామ్ పైననే..
ఇప్పుడు ఉన్న ఐసీఈ (ICE) ప్లాట్ ఫామ్ పైననే 500 సీసీ - 750 సీసీ రేంజ్ లో పవర్ బైక్స్ ను కూడా ఉత్పత్తి చేయాలని హోండా మోటార్స్ భావిస్తోంది. అయితే, ఈ బైక్ మార్కెట్లోకి రావడానికి కనీసం మరో రెండేళ్లు పట్టే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఏటా కనీసం 10 లక్షల ఎలక్ట్రిక్ బైక్స్ ను అమ్మాలని హోండా మోటార్స్ లక్ష్యంగా పెట్టుకుంది.