Honda new EV : 'ఈవీ' కోసం హోండా క్రేజీ ప్లాన్​.. సూపర్​ లైనప్​తో మార్కెట్​లోకి!-honda to launch new electric vehicle by 2025 check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda New Ev : 'ఈవీ' కోసం హోండా క్రేజీ ప్లాన్​.. సూపర్​ లైనప్​తో మార్కెట్​లోకి!

Honda new EV : 'ఈవీ' కోసం హోండా క్రేజీ ప్లాన్​.. సూపర్​ లైనప్​తో మార్కెట్​లోకి!

Sharath Chitturi HT Telugu
Apr 30, 2023 06:22 AM IST

Honda new EV : ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థ హోండా.. ఈవీ పోర్ట్​ఫోలియోను పెంచుకునేందుకు క్రేజీ ప్లాన్​ వేసింది. ఇందులో భాగంగానే పలు మోడల్స్​ను లాంచ్​ చేయనుంది!

'ఈవీ' కోసం హోండా క్రేజీ ప్లాన్​.. సూపర్​ లైనప్​తో మార్కెట్​లోకి!
'ఈవీ' కోసం హోండా క్రేజీ ప్లాన్​.. సూపర్​ లైనప్​తో మార్కెట్​లోకి! (HT AUTO)

Honda new EV : దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హోండా.. డెడికేటెడ్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​ ప్లాట్​ఫార్మ్​పై పని చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాట్​ఫార్మ్​పై మిడ్​ సైజ్​ నుంచి లార్జ్​ సైజ్​ వరకు ఈవీలను రూపొందించవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సరికొత్త ఎస్​యూవీని 2025 నాటికి అంతర్జాతీయంగా లాంచ్​ చేయనున్నట్టు ప్రకటించింది. కంపెనీ భవిష్యత్తు కార్యచరణను వివరించేందుకు ఏర్పాటు చేసిన ఈవెంట్​లో.. హోండా అధ్యక్షుడు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. మరి ఈ ఈవీ ఇండియా మార్కెట్​లోకి వస్తుందా? లేదా? అన్న అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.

ప్రస్తుతానికైతే.. ఈ కొత్త ఈవీ ప్లాట్​ఫార్మ్​ గురించి హోండా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే.. అకూరా జెడ్​డీఎక్స్​, ప్రొలోగ్​ వంటి మోడల్స్​కు ఈవీ వర్షెన్​ను 2024 నాటికి లాంచ్​ చేయాలని సంస్థ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు వాహనాలు జీఎం (జనరల్​ మోటార్స్​) అల్టియం ప్లాట్​ఫార్మ్​పై రూపొందుతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సంస్థల మధ్య భాగస్వామ్యం ఉండటంతో, భవిష్యత్తులోనూ చౌకైన్​ వాహనాలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు సమాచారం. ఇవి 2027 నుంచి లాంచ్​ అవుతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి:- Honda electric motorcycles: 500 - 750 సీసీ ఎలక్ట్రిక్ బైక్స్ పై హోండా దృష్టి

Honda EV cars : ఇక నార్త్​ అమెరికాలోని తమ ప్రొడక్షన్​ ప్లాంట్​ను ఈవీ హబ్​గా మార్చాలని హోండా ప్రయత్నిస్తోంది. ఈ ఎన్​ఎస్​2, ఈన్​పీ2 వంటి మోడల్స్​ 2024 తొలినాళ్లల్లోనే లాంచ్​ అవ్వొచ్చు. ఈఎన్​ ఎస్​యూవీ ప్రొడక్షన్​ వర్షెన్​ కాన్సెప్ట్​ 2024 చివర్ల బయటకి వస్తుందని ససమాచారం. వీటితో పాటు మరో 7 ఎలక్ట్రిక్​ వాహనాలను 2027లోపు లాంచ్​ చేయాలని ప్లాన్​ వేసింది హోండా.

ఇండియా మార్కెట్​లో..

ఇండియా మార్కెట్​లో ఓ కొత్త మిడ్​ సైజ్​ ఎస్​యూవీని లాంచ్​ చేస్తోంది హోండా. జూన్​లో దీనిని ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ ఎస్​యూవీ.. ఇప్పటికే మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉన్న మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా, హ్యుందాయ్​ క్రేటా, టయోటా అర్బన్​ క్రూజర్​ హైరైడర్​, కియా సెల్టోస్​, వోక్స్​వ్యాగన్​ టైగన్​, ఎంజీ ఆస్టర్​, స్కోడా కుషాక్​ వంటి మోడల్స్​కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​ల అంచనాలు ఉన్నాయి.

Honda cars news latest : హోండా సిటీని రూపొందించిన ప్లాట్​ఫార్మ్​పైనే ఈ కొత్త ఎస్​యూవీని తయారు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో 1.5 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉండనుంది! 6 స్పీడ్​ మేన్యువల్​, సీవీటీ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉండొచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం