తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Punch Ev : టాటా పంచ్-​ ‘ఈవీ వర్సెస్​ పెట్రోల్’​.. రెండింటికి తేడా ఏంటి?

Tata Punch EV : టాటా పంచ్-​ ‘ఈవీ వర్సెస్​ పెట్రోల్’​.. రెండింటికి తేడా ఏంటి?

Sharath Chitturi HT Telugu

09 January 2024, 6:19 IST

    • Tata Punch EV : టాటా పంచ్​ ఈవీ వర్సెస్​ ఐసీఈ ఇంజిన్​.. ఈ రెండింటికి మధ్య ఉన్న తేడాను ఇక్కడ తెలుసుకోండి..
టాటా పంచ్-​ ఈవీ వర్సెస్​ పెట్రోల్​.. రెండింటికి తేడా ఏంటి?
టాటా పంచ్-​ ఈవీ వర్సెస్​ పెట్రోల్​.. రెండింటికి తేడా ఏంటి?

టాటా పంచ్-​ ఈవీ వర్సెస్​ పెట్రోల్​.. రెండింటికి తేడా ఏంటి?

Tata Punch EV : ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లో టాటా పంచ్​ ఎస్​యూవీకి సూపర్​ డిమాండ్​ కనిపిస్తోంది. ఇక ఇప్పుడు.. మచ్​ అవైటెడ్​ టాటా పంచ్​ ఈవీని రివీల్​ చేసింది టాటా మోటార్స్​ సంస్థ. బుకింగ్స్​ కూడా ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఈ మోడల్​ లాంచ్​కానుంది. ఈ టాటా పంచ్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ డిజైన్​ సూపర్​ అట్రాక్టివ్​గా ఉంది. ఈ నేపథ్యంలో.. ఐసీఈ ఇంజిన్​ని ఎలక్ట్రిక్​ వెహికిల్​ని పోల్చి, రెండింట్లో ఉన్న తేడాలను ఇక్కడ తెలుసుకుందాము..

టాటా పంచ్​ ఈవీ వర్సెస్​ ఐసీఈ- డిజైన్​..

టాటా నెక్సాన్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్ డిజైన్​​ నుంచి స్ఫూర్తి పొంది.. కొత్త టాటా పంచ్​ ఈవీని డిజైన్​ చేసినట్టు కనిపిస్తోంది. ఇందులో స్లీక్​ కనెక్టెడ్​ ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​, స్ప్లిట్​ హెడ్​లైట్స్​, ఫాగ్​ ల్యాంప్స్​, మాడిఫైడ్​ బంపర్​ డిజైన్​ వంటివి వస్తున్నాయి.

Tata Punch on road price in Hyderabad : ఇక టాటా పంచ్​ ఎస్​యూవీ ఐసీఈ ఇంజిన్​కి కన్వెన్షనల్​ లుక్​ ఉంటుంది. కనెక్టెడ్​ ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​ ఉండవు. రగ్గ్​డ్​ లుక్స్​ ఉంటాయి.

ఈ రెండు వెహికిల్స్​ సైడ్​, రేర్​ వ్యూ ఒకే విధంగా ఉంటాయి. కాకాపోతే.. ఐసీఈ ఇంజిన్​లో ఉన్న ఫ్యూయెల్​ పోర్ట్​, ఎలక్ట్రిక్​ వెహికిల్​కి ఉండదు.

టాటా పంచ్​ ఈవీ వర్సెస్​ ఐసీఈ- ఫీచర్స్​..

టాటా పంచ్​ ఈవీ కేబిన్​కి సంబంధించిన వివరాలపై ప్రస్తుతం స్పష్టత లేదు. కాగా.. ఇందులో లేటెస్ట్​ టెక్నాలజీతో కూడిన డాష్​బోర్డ్​ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. డిజైన్​ మాత్రం ఐసీఈ ఇంజిన్​తో పోలి ఉంటుంది.

Tata Punch EV launch date : టాటా మోటార్స్​ కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో 10.25 ఇంచ్​ డిజిటల్​ డ్రైవర్​ డిస్​ప్లే, 10.25 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, వయర్​లెస్​ ఫోన్​ ఛార్జింగ్​, 360 డిగ్రీ వ్యూ కెమెరా, ఆర్కేడ్​.ఈవీ యాప్​ సూట్​ వంటివి వస్తాయట.

ఇక ఈ రెండు టాటా పంచ్​ మోడల్స్​లో సన్​రూఫ్​, ఆటో ఫోల్డింగ్​ ఓఆర్​వీఎంలు, ఆడ్రాయిడ్​ ఆటో- యాపిల్​ కార్​ప్లే వంటివి ఒకే విధంగా ఉంటాయి.

టాటా పంచ్​ ఈవీ వర్సెస్​ ఐసీఈ- ఇంజిన్​..

Tata Punch EV price in Hyderabad : టాటా పంచ్​ ఈవీలో రెండు ఎలక్ట్రిక్​ ఇంజిన్​లు ఉంటాయి. లాంగ్​ రేంజ్​, స్టాండర్డ్​ రేంజ్​. బ్యాటరీ ప్యాక్​ వివరాలు అందుబాటులోకి రాలేదు. కానీ రేంజ్​ మాత్రం కనిష్ఠంగా 300 కి.మీలు, గరిష్ఠంగా 600 కి.మీల వరకు ఉండొచ్చు!

ఇక టాటా పంచ్​ ఎస్​యూవీ ఐసీఈ ఇంజిన్​లో 1199 సీసీ పెట్రోల్​, 3 సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 86 హెచ్​పీ పవర్​ని, 115 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

టాటా పంచ్​ ఎస్​యూవీ ఎక్స్​షోరూం ధర రూ. 6లక్షలు- రూ. 10.10లక్షల మధ్యలో ఉంటుంది. ఇక ఎలక్ట్రిక్​ వర్షెన్​ ధర వివరాలు అందుబాటులోకి రాలేదు. కాగా.. ఈ మోడల్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 12లక్షలుగా ఉండొచ్చని మర్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం