HONOR Magic6 : హానర్ నుంచి కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్.. లాంచ్ డేట్ ఇదే!
26 December 2023, 12:05 IST
- HONOR Magic6 : హానర్ సంస్థ నుంచి కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ రాబోతోంది.. లాంచ్ డేట్‌తో పాటు ఫీచర్స్‌కు చెందిన కొన్ని వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి.
హానర్ మేజిక్6 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ ఇవే!
HONOR Magic6 : హానర్ సంస్థ నుంచి సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. దీని పేరు హానర్ మేజిక్ 6. ఇందులో 3 గ్యాడ్జెట్స్ ఉంటాయి. అవి.. మేజిక్ 6, మేజిక్ 6 ప్రో, మేజిక్ 6 అల్టిమేట్! కాగా.. ఈ సిరీస్ లాంచ్ డేట్ ఆన్లైన్లో లీక్ అయ్యింది. లాంచ్‌తో పాటు ఈ మొబైల్స్ ఫీచర్స్ వంటి వివరాలపై ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాము..
హానర్ మేజిక్ 6 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్..!
ఆన్లైన్లో లీక్ అయిన డేటా ప్రకారం ఈ హానర్ మేజిక్ 6 సిరీస్.. చైనాలో 2024 జనవరి 11న లాంచ్ అవుతుంది. ఇందుకోసం సంస్థ ఓ గ్రాండ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తోంది.
పలు లీక్స్ ప్రకారం.. హానర్ మేజిక్ 6 లైనప్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ఉండొచ్చు. క్వాడ్- కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్ ఉంటుంది. డ్యూయెల్ ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరాల కోసం పిల్ షేప్ కటౌట్ డిజైన్ వస్తుంది.
HONOR Magic6 launch : ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో 50ఎంపీ ఓమ్నీ విజన్ ఓవీ50కే ప్రైమరీ కెమెరా ఉంటుందట. ఇక టాప్ ఎండ్ మోడల్ హానర్ మేజిక్ 6 ప్రోలో 2 వే శాటిలైట్ కనెక్టివిటీ లభిస్తుందట.
ఈ మొబైల్స్‌లో మేజిక్ఓఎస్ 8.0 సపోర్ట్ చేసే ఆన్-డివైజ్ జెనరేటివ్ ఏఐ కెపబులిటీ ఫీచర్స్ ఉంటాయని తెలుస్తోంది.
ఇదీ చూడండి:- OnePlus 12 vs Google Pixel 8 : ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్?
హానర్ మేజిక్ 6 పోర్షే మోడల్ కూడా..!
హానర్ మేజిక్ 6 సిరీస్‌లో వచ్చే 3 స్మార్ట్ఫోన్స్తో పాటు ఒక స్పెషల్ ఎడిషన్‌ని కూడా లాంచ్ చేయాలని సంస్థ ప్లాన్ చేస్తోంది! దీని పేరు హానర్ మేజిక్ 6 పోర్షే ఎడిషన్. ఐకానిక్ పోర్షే 911 స్పోర్ట్స్ కార్లోని డిజైన్ ఎలిమెంట్స్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటాయని సమాచారం. స్పెసిఫికేషన్స్ మాత్రం మేజిక్ 6 ప్రోని పోలి ఉంటాయని తెలుసతోంది. ఈ స్పెషల్ ఎడిషన్‌లో 160 ఎంపీ పెరిస్కోపిక్ టెలిఫొటోలెన్స్ ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ వార్తతో స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎగ్జైట్ అవుతున్నారు.
HONOR Magic6 price in India : ఇక ఈ హానర్ మేజిక్ 6 సిరీస్ ఇతర ఫీచర్స్, ధర వివరాలపై క్లారిటీ లేదు. లాంచ్ టైమ్ నాటికి వీటిపై పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి.