OnePlus 12 vs Google Pixel 8 : ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?-oneplus 12 vs google pixel 8 check detailed comparison of features here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus 12 Vs Google Pixel 8 : ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

OnePlus 12 vs Google Pixel 8 : ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Dec 26, 2023 08:10 AM IST

OnePlus 12 vs Google Pixel 8 : వన్​ప్లస్​ 12 వర్సెస్​ గూగుల్​ పిక్స్​ 8.. ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకుందాము..

ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?
ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

OnePlus 12 vs Google Pixel 8 : వన్​ప్లస్​ 12 స్మార్ట్​ఫోన్​ కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. అయితే.. ఇండియన్​ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో ఇది.. గూగుల్​ పిక్సెల్​ 8కి గట్టి పోటీనిస్తుందని టెక్​ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

వన్​ప్లస్​ 12 వర్సెస్​ గూగుల్​ పిక్సెల్​ 8- ఫీచర్స్​..

వన్​ప్లస్​ 12 డిజైన్​.. ఇంచుమించు వన్​ప్లస్​ 11లానే ఉంటుంది. కొన్ని మార్పులు మాత్రం కనిపిస్తాయి. కాగా.. ఈ స్మార్ట్​ఫోన్​లో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3 చిప్​సెట్​ ఉంటుంది. 120 హెజ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.82 ఇంచ్​ కర్వ్​డ్​ ఓఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం! 4500 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్​ లెవల్​ ఇందులో కనిపిస్తుంది.

ఇక గూగుల్​ పిక్సెల్​ 8లో 6.2 ఇంచ్​ ఎల్​టీపీఎస్​ ఓఎల్​ఈడీ ఆక్టువా డిస్​ప్లే ఉంది. ఇందులో ఆల్​వేస్​ ఆన్​ డిస్​ప్లే ఉండటం విశేషం. 60 హెచ్​జెడ్​- 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో ఈ స్మార్ట్​ఫోన్​ వస్తోంది. ఇందులో అబ్సీడియన్​, హాజెల్​, రోస్​ వంటి కలర్​ ఆప్షన్స్​ ఉన్నాయి. 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​- 256 జీబీ స్టోరేజ్​ ఆప్షన్స్​ వస్తున్నాయి. ఈ గూగుల్​ పిక్సెల్​ 8లో టెన్సార్​ జీ3 చిప్​సెట్​ ఉంది. ఆండ్రాయిడ్​ 14 సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది.

OnePlus 12 price in India : వన్​ప్లస్​ కొత్త గ్యాడ్జెట్​లో 50ఎంపీ ప్రైమరీ, 64ఎంపీ సెకెండరీ, 48ఎంపీ అల్ట్రావైడ్​ లెన్స్​​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది. 5,400ఎంఏహెచ్​ బ్యాటరీతో పాటు 100 వాట్​ వయర్డ్​- 50వాట్​ వయర్​లెస్ ఛార్జింగ సపోర్ట్​ దీనికి లభిస్తుంది. ఆండ్రాయిడ్​ 14 ఆధారిత కలర్​ఓఎస్​ 14 సాఫ్ట్​వేర్​పై ఈ మోడల్​ పనిచేస్తుంది.

గూగుల్​ పిక్సెల్​ 8లో 50ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ సెకెండరీ అల్ట్రా-వైడ్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 10.5 ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది. అండర్​ డిస్​ప్లే ఫింగర్​ప్రింట్​ స్కానర్​, ఫేస్​ అన్​లాక్​ వంటి ఫీచర్స్​ ఉన్నాయి. 4,575 ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. 27వాట్​ వయర్డ్​, 18వాట్​ వయర్​లెస్​ గూగుల్​ పిక్సెల్​ స్టాండ్​ వస్తోంది. యూఎస్​బీ- టైప్​ సీ ఛార్జర్​ లభిస్తోంది.

వన్​ప్లస్​ 12 వర్సెస్​ గూగుల్​ పిక్సెల్​ 8 - ధర వివరాలు..

వన్​ప్లస్​ 12లో నాలుగు వేరియంట్లు ఉన్నాయి. చైనాలో వీటి ధరలు ఇలా ఉన్నాయి..

వన్​ప్లస్​ 12 12జీబీ ర్యామ్​- 256 జీబీ స్టోరేజ్​- సుమారు రూ. 50,500. 16జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​- సుమారు రూ. 56,350. 16జీబీ ర్యామ్​- 1టీబీ స్టోరేజ్​- సుమారు రూ. 62,200. 24జీబీ ర్యామ్​- 1టీబీ స్టోరేజ్​- సుమారు రూ. 68,100. ఇండియాలో ఈ మొబైల్​ 2024 జనవరి చివర్లో లాంచ్​కానుంది.

Google Pixel 8 price in India : ఇక గూగుల్​ పిక్సెల్​ 8 సిరీస్​ ప్రారంభ ధర రూ. 75,999. ఐఫోన్​ 15 ప్రారంభ ధర 799 డాలర్లుగా ఉంది. అంటే సుమారు రూ. 79,900.

Whats_app_banner

సంబంధిత కథనం