Honor 100 series launch: త్వరలో మార్కెట్లోకి హానర్ 100 సిరీస్ స్మార్ట్ ఫోన్స్.. ఇవే స్పెషాలిటీస్..
15 November 2023, 13:38 IST
Honor 100 series launch: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ హానర్ (Honor) తన హానర్ 100 సిరీస్ ఫోన్లను భారత్ లో ఈ నవంబర్ 23వ తేదీన లాంచ్ చేయనుంది.
ప్రతీకాత్మక చిత్రం
Honor 100 series launch: హానర్ స్మార్ట్‌ఫోన్ ప్రియుల నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హానర్ 100 సిరీస్ నవంబర్ 23న లాంచ్ అవుతోంది. హానర్ 100 సిరీస్ లో భాగంగా, హానర్ 100, హానర్ 100 ప్రో స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేస్తున్నారు.
Honor 100 series specifications: హానర్ 100 స్పెసిఫికేషన్స్
హానర్ 100 సిరీస్ ఫోన్స్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50 MP ప్రైమరీ కెమెరా, విలక్షణమైన కెమెరా ఐలండ్ డిజైన్ తో ఉంటుంది. హానర్ 100 ప్రో (Honor 100 pro) లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ ను అమర్చినట్లు సమాచారం. ముఖ్యంగా, హానర్ 90 ప్రొలో స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1ని చిప్ సెట్ ఉంటుంది.తాజా, హానర్ 100 సిరీస్ 1.5K రిజల్యూషన్ ఉన్న, అధిక-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్‌తో OLED డిస్‌ప్లేతో వస్తుందని తెలుస్తుంది. హానర్ 100 లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ ఉంటుందని సమాచారం. ఈ రెండు మోడల్స్ కూడా 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి.
Honor 100 series design: హానర్ 100 డిజైన్
Honor 100 మరియు Honor 100 ప్రొ.. ఈ రెండు మోడల్స్ లో కూడా స్లీక్ బెజెల్స్ కర్వ్డ్ ఎడ్జెస్ ఉంటాయి. వనిల్లా మోడల్ లో సెల్ఫీల కోసం సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్ ఉంటుంది. అయితే ప్రో వేరియంట్ పిల్-ఆకారపు పంచ్-హోల్ కటౌట్‌లో డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. హానర్ 100 తెలుపు రంగులో, గ్రేడియంట్ డిజైన్ తో వస్తుంది. అలాగే, హానర్ 100 ప్రో లో ఎల్ఈడీ ఫ్లాష్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది.
Honor 100 series price: హానర్ 100 సిరీస్ ధర
హానర్ 100 సిరీస్ ధర రూ. 39990 నుంచి ప్రారంభం కావచ్చని అంచనా. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. పూర్తి వివరాల కోసం హానర్ 100 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ అధికారికంగా లాంచ్ అయ్యే నవంబర్ 23 వరకు వేచి ఉండాల్సిందే.