Honor 100 Pro : డ్యూయెల్ సెల్ఫీ కెమెరాలతో హానర్ 100 ప్రో! ఫీచర్స్ ఇవేనా?
Honor 100 Pro : హానర్ నుంచి ఓ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. దీని పేరు హానర్ 100 ప్రో అని సమాచారం. ఈ గ్యాడ్జెట్ ఫీచర్స్ కొన్ని ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఆ వివరాలు..
Honor 100 Pro : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్.. మంచి జోరు మీద ఉంది. వరుస పెట్టి కొత్త కొత్త మోడల్స్‌ను లాంచ్ చేస్తోంది. ఇక ఇప్పుడు.. హానర్ 100 ప్రో పేరుతో మరో గ్యాడ్జెట్‌ను సంస్థ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, లాంచ్ టైమ్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాము..
హానర్ 100 ప్రో ఫీచర్స్ ఇవేనా..?
హానర్ నుంచి వస్తున్న కొత్త స్మార్ట్‌ఫోన్‌లో 120 హెజ్జెడ్తో కూడిన అమోలెడ్ డిస్ప్లే ఉంటుందని ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టెషన్ పేర్కొంది. 1.5కే రిసొల్యూషన్ ఇందులో ఉండొచ్చని వెల్లడించింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ ప్రాసెసర్ లభించొచ్చు.
Honor 100 Pro price : ఆన్లైన్లో లీక్ అయిన డేటా ప్రకారం.. హానర్ 100 ప్రోలో డ్యూయెల్ ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరా ఉండొచ్చు. వచ్చే నెలలో ఈ గ్యాడ్జెట్‌కు చెందిన టెస్టింగ్ జరగుతుంది. అన్ని అనుకున్నట్టే జరిగితే.. ఈ మోడల్‌ను ఈ ఏడాది నవంబర్ తొలినాళ్లల్లో లాంచ్ చేయాలని సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చూడండి:- HONOR V Purse : వావ్.. ఇది పర్సులా ఉండే ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్!
ఈ గ్యాడ్జెట్‌కు సంబంధించిన ఇతర ఫీచర్స్, లాంచ్ డేట్, ధర వంటి వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. వీటిపై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ఇండియాలో హానర్ 90 సేల్ షురూ..
Honor 90 price in India : మరోవైపు.. చైనా మార్కెట్లో హానర్ 90ని కొన్ని నెలల క్రితం లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ.. ఇండియాలోకి కూడా ఈ మోడల్‌ను తీసుకొచ్చింది. తాజాగా.. ఈ డివైజ్ సేల్ ప్రారంభమైంది. హానర్ 90లో ఫుల్ హెచ్డీ+ రిసొల్యూషన్తో కూడిన 6.7 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. డైమండ్ సిల్వర్, మిడ్నైట్ బ్లాక్, ఎమరాలడ్ గ్రీన్ కలర్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ రేర్‌లో 200ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ అల్ట్రా వైడ్, 2ఎంపీ డెప్త్ సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీ కోసం ఫ్రెంట్లో 50ఎంపీ కెమెరా వస్తుండటం హైలైట్. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ దీని సొంతం. ఆండ్రాయిడ్ 13 ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.1 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది. ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం