Hero Mavrick 440 vs Bajaj Dominar 400 : హీరో మావ్రిక్ 440 కొనాలా? బజాజ్ డామినర్ 400 కొనాలా?
19 February 2024, 15:26 IST
- Hero Mavrick 440 on road price : హీరో మావ్రిక్ 440 కొనాలా? బజాజ్ డామినర్ 400 కొనాలా? ఈ రెండింటి ఫీచర్స్, ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హీరో మావ్రిక్ 440 కొనాలా? బజాజ్ డామినర్ 400 కొనాలా?
Hero Mavrick 440 price in Hyderabad : కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? హీరో మోటోకార్ప్ సంస్థ.. తాజాగా ఓ బైక్‌ని లాంచ్ చేసింది. అదే.. హీరో మావ్రిక్ 440. దీనికి కస్టమర్ల నుంచి ఆసక్తి కనిపిస్తోంది. ఈ బైక్.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న బజాజ్ డామినర్ 400కి గట్టిపోటీనిస్తుందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? అనేది ఇక్కడ తెలుసుకుందాము..
హీరో మావ్రిక్ 440 వర్సెస్ బజాజ్ డామినర్ 400- ఫీచర్స్..
హీరో మావ్రిక్ 440లో మస్క్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్, ప్రాజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, స్ల్పిట్ టైప్ హెచ్ షేప్ డీఆర్ఎల్స్, వైడ్ హ్యాండిల్ బార్, సింగిల్ పీస్ గ్రాబ్ రెయిల్, ఎల్ఈడీ టెయిల్ల్యాంప్, 17 ఇంచ్ డైమండ్ కట్ వీల్స్ వస్తున్నాయి.
Bajaj Dominar 400 price Hyderabad : బజాజ్ డామినర్ 400 బైక్‌లో స్కల్ప్టెడ్ ఫ్యూయెల్ ట్యాంక్, వైడ్ హ్యాండిల్ బార్, స్ల్పిట్ టైప్ సీట్స్, ఆల్వేస్- ఆన్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, డ్యూయెల్ బ్యారెల్ ఎగ్జాస్ట్, ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, రివర్స్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సెకెండరీ ట్యాంక్ మౌంటెడ్ డిస్ప్లే ఫీచర్స్ ఉంటాయి.
హీరో మావ్రిక్ 440 వర్సెస్ బజాజ్ డామినర్ 400- ఇంజిన్..
మావ్రిక్ 440 బైక్‌లో 440 సీసీ, ఎయిర్- ఆయిల్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 440లో కూడా ఇదే ఇంజిన్ కనిపిస్తుంది. ఇది.. 27 హెచ్‌పీ పవర్‌ని, 38 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
Hero Mavrick 440 top speed : ఇక బజాజ్ డామినర్ 400లో 373.3 సీసీ, లిక్విడ్ కూల్డ్, డీఓహెచ్సీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 39.4 హెచ్‌పీ పవర్‌ని 35 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
ఈ రెండు వెహికిల్స్‌లో కూడా 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.
Bajaj Dominar 400 on road price : ఈ రెండు బైక్స్‌లో కూడా రెండు వీల్స్‌కి డిస్క్ బ్రేక్స్, డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ సెటప్ వస్తున్నాయి. హీరో బైక్ ఫ్రెంట్లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో షాక్ అబ్సార్బర్స్‌తో సస్పెన్షన్స్ ఉంటాయి. ఇక బజాజ్ బైక్‌లో ఇన్వర్టెడ్ ఫ్రెంట్ ఫోర్క్స్, రేర్‌లో ప్రీలోడెడ్ అడ్జెస్టెబుల్ మోనో షాక్ అబ్సార్బర్స్ వస్తున్నాయి.
హీరో మావ్రిక్ 440 వర్సెస్ బజాజ్ డామినర్ 400- ధర ఎంతంటే..
latest bikes launched in India : ఇండియాలో.. హీరో మావ్రిక్ 440 కొత్త బైక్ ఎక్స్‌షోరూం ధరలు రూ. 1.99 లక్షలు, రూ. 2.24లక్షలుగా ఉన్నాయి. ఇక బజాజ్ డామినర్ 400 ఎక్స్‌షోరూం ధర రూ. 2.3లక్షలుగా ఉంది.