Hero Mavrick 440 : హీరో మావ్రిక్ 440.. ప్రీమియం బైక్ ధర ఎంతంటే..
Hero Mavrick 440 price : హీరో మోటోకార్ప్ సంస్థ.. సరికొత్త బైక్‌ని తీసుకొచ్చింది. ఈ హీరో మావ్రిక్ 440 ధర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
Hero Mavrick 440 review : ఇండియాలో దిగ్గజ్ 2 వీలర్ వెహికిల్స్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. ఇటీవలే సరికొత్త బైక్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దాని పేరు హీరో మావ్రిక్ 440. ఇది స్టైలిష్‌గాను, పవర్ఫుల్గాను ఉంది. ఈ వెహికిల్‌పై కస్టమర్స్‌లో ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ కొత్త బైక్ ఫీచర్స్, ధర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హీరో మావ్రిక్ 440- ఫీచర్స్ ఇవే..
హీరో మావ్రిక్ 440లో.. నియో రెట్రో ఎలిమెంట్స్‌తో కూడిన మస్క్యులర్ షేప్ ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఫ్యుయెల్ ట్యాంక్, ఫెండర్స్ కోసం మెటల్ని వాడింది హీరో మోటోకార్ప్. ఎల్ఈడీ లైటింగ్ వస్తోంది. డిజిటల్ స్పీడోమీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటివి కూడా ఉన్నాయి.
Hero Mavrick 440 price in India : హార్లీ డేవిడ్సన్ ఎక్స్400లో ఉండే ఇంజిన్నే హీరో మావ్రిక్ 440లో కూడా ఉపయోగించారు. ఇది.. ఒక 440సీసీ, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్, సింగిల్ సిలిండర్. ఇది.. 27 హెచ్‌పీ పవర్‌ని, 36 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ ఉన్నాయి.
హీరో మావ్రిక్ 440- ధర ఎంతంటే..
హీరో మావ్రిక్ 440 ఒక ఫ్లాగ్షిప్ బైక్. మూడు వేరియంట్స్‌లో ఇది అందుబాటులోకి వచ్చింది. అవి.. బేస్, మిడ్, టాప్. వీటి ఎక్స్‌షోరూం ధరలు వరుసగా.. రూ. 1.99లక్షలు, రూ. 2.14లక్షలు, రూ. 2.24లక్షలు. ఈ బైక్‌కి చెందిన ప్రీ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. రూ. 5వేల టోకెన్ అమౌంట్‌తో ఈ బైక్‌ని బుక్ చేసుకోవచ్చు.
హీరో మావ్రిక్ 440 బైక్ డెలివరీని ఏప్రిల్‌లో ప్రారంభించాలని సంస్థ ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా.. 'వెల్కమ్ టు మావ్రిక్ క్లబ్ ఆఫర్'ని కూడా లాంచ్ చేసేందుకు సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా.. రూ. 10వేలు విలువ చేసే కస్టమైజ్డ్ మావ్రిక్ కిట్ యాక్ససరీస్ని ఇవ్వాలని చూస్తోంది. అయితే.. మార్చ్ 15లోపు హీరో మావ్రిక్ 440ని బుక్ చేసుకున్న వారికే.. ఈ ఫెసిలిటీ లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Hero Mavrick 440 speed : హీరో మోటోకార్ప్ చరితరలోనే మోస్ట్ ప్రీమియం మోటార్‌సైకిల్ ఈ హీరో మావ్రిక్ 440.
"మావ్రిక్ 440తో.. ప్రీమియం బైక్స్‌లో మా జర్నీ కొనసాగుతోంది. బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాము. ఇది హార్లీ డేవిడ్సన్ 400ని పోలి ఉన్నా.. ఈ బైక్ ఓ యూత్‌ఫుల్ మాడర్న్ రోడ్స్ర్. ప్రీమియం సెగ్మెంట్లో ఆధిపత్యం కోసం మేము చేస్తున్న ప్రయత్నం.. ఈ బైక్‌తో కొనసాగుతుందని ఆశిస్తున్నాము," అని హీరో మోటోకార్ప్ సీఈఓ నిరంజన్ గుప్తా తెలిపారు.
సంబంధిత కథనం