తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero Karizma Launch : మార్కెట్​లోకి రీ- ఎంట్రీ ఇస్తున్న హీరో కరిష్మా..!

Hero Karizma launch : మార్కెట్​లోకి రీ- ఎంట్రీ ఇస్తున్న హీరో కరిష్మా..!

Sharath Chitturi HT Telugu

25 March 2023, 11:00 IST

google News
  • Hero Karizma launch  : హీరో కరిష్మా.. ఇండియా మార్కెట్​లో రీ ఎంట్రీ ఇవ్వనుంది! 2019లో ఇది డిస్కంటిన్యూ అయ్యింది.

మార్కెట్​లోకి రీ- ఎంట్రీ ఇస్తున్న హీరో కరిష్మా..!
మార్కెట్​లోకి రీ- ఎంట్రీ ఇస్తున్న హీరో కరిష్మా..! (HT AUTO)

మార్కెట్​లోకి రీ- ఎంట్రీ ఇస్తున్న హీరో కరిష్మా..!

New Hero Karizma launch : కరిష్మా మోడల్​కు లేటెస్ట్​ వర్షెన్​ను లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది దేశీయ దిగ్గజ బైక్స్​ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్​. ఈ ఏడాది రెండో భాగంలో హీరో కరిష్మా ఇండియా మార్కెట్​లోకి రీ- ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆల్​ న్యూ హీరో కరిష్మా వచ్చేస్తోంది..!

హీరో మోటోకార్ప్​ బైక్స్​ పోర్ట్​ఫోలియోలో ఒకప్పుడు ది బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉండేది ఈ కరిష్మా. అనంతర కాలంలో పోటీని తట్టుకోలేక డీలాపడింది. విక్రయాలు గణనీయంగా పతనమయ్యాయి. చివరికి.. ఈ మోడల్​ను 2019లో డిస్కంటిన్యూ చేసింది హీరో మోటోకార్ప్​.

Hero Karizma 2023 : ప్రస్తుతం ఇండియాలో ఆటోమొబైల్​ మార్కెట్​లో పరిస్థితులు​ మారుతున్నాయని సంస్థ భావిస్తోంది. కరిష్మా రీ- లాంచ్​ చేసే టైమ్​ వచ్చిందని ఫిక్స్​ అయ్యింది. అందుకే ఈ మోడల్​కు ఆల్​- న్యూ 210 సీసీ లిక్విడ్​ కూల్డ్​ ఇంజిన్​ను ఇచ్చి సరికొత్తగా లాంచ్​ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వెలువడ్డాయి.

2003లో తొలిసారి కరిష్మా మోడల్​ను మార్కెట్​లోకి తీసుకొచ్చింది హీరో మోటోకార్ప్​. స్పోర్ట్స్​- టూరర్​ సెగ్మెంట్​లో తొలి బైక్​ ఇదే. అప్పటివరకు ఉన్న 200సీసీ లిమిట్​ను దాటిన తొలి బైక్​ కూడా ఇదే! ఇందులో 223సీసీ, ఎస్​ఓహెచ్​సీ, ఎయిర్​-కూల్డ్​ ఇంజిన్​ ఉండేది.

హీరో కరిష్మా ఫీచర్స్​ ఇవే..!

Hero Karizma 210cc bike : హీరో కరిష్మా డిజైన్​కు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. అయితే.. ఇందులో సెమీ- ఫేర్డ్​ డిజైన్​, ఆల్​ ఎల్​ఈడీ లైటింగ్​ సెటప్​, రైజ్​డ్​ విండ్​స్క్రీన్​, స్ప్లిట్​ టైప్​ సీట్స్​, స్టబీ ఎక్సాస్ట్​, టేపరింగ్​ రేర్​ ఎండ్​ వంటివి ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. సెమీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, కనెక్టివిటీ ఆప్షన్స్​, డిజైనర్​ ఆలాయ్​ వీల్స్​ వంటివి ఉంటాయని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక సేఫ్టీ విషయానికొస్తే.. హీరో కరిష్మా ఫ్రెంట్​, రేర్​ వీల్స్​కి డిస్క్​ బ్రేక్స్​, డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్​ వంటి బ్రేకింగ్​ సెటప్​ రావొచ్చు. సస్పెన్షన్​ కోసం ఇన్​వర్టెడ్​ ఫోర్క్స్​, ప్రీలోడెడ్​ అడ్జస్టెబుల్​ మోనో షాక్​ యూనిట్స్​ వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

హీరో కరిష్మా ధర..

Latest Hero Karizma news : ఈ హీరో కరిష్మా మోడల్​ ప్రస్తుతానికి టెస్టింగ్​ దశలోనే ఉంది. అందుకే దీనిపై సరైన సమాచారం మార్కెట్​లో అందుబాటులో లేదు. ధర, ఫీచర్స్​ వంటిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే.. హీరో మోటోకార్ప్​ గత లాంచ్​లను పరిశీలిస్తే.. ఈ హీరో కరిష్మా ఎక్స్​షోరూం ధర రూ. 1.06లక్షలుగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం