Hero New Electric Scooter: హీరో నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది: లాంచ్ డేట్ ఇదే!
Hero New Electric Scooter: హీరో ఎలక్ట్రిక్ సంస్థ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇమేజ్ టీజర్‌ను ఆ కంపెనీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. వివరాలివే..
Hero New Electric Scooter: హీరో ఎలక్ట్రిక్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ టీజర్‌ను విడుదల చేసింది. లుక్ పరంగా చూస్తే ఇది హీరో ఆప్టిమాను పోలి ఉండేలా కనిపిస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్చి 15వ తేదీన లాంచ్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. టీజర్ ద్వారా డిజైన్‍కు సంబంధించిన కొన్ని వివరాలు తెలుస్తున్నాయి. వివరాలివే..
డిజైన్ ఇలా..
Hero New Electric Scooter: ఈ నయా హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ కౌల్ (Cowl) టాప్ పొజిషన్‍లో ఎల్ఈడీ హెచ్‍ల్యాంప్ ఉంటుందని టీజర్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది. కౌల్ సెంటర్‌లో ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు ఉన్నాయి. ఇవి కాస్త హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా స్కూటర్‌ను పోలి ఉన్నాయి. అలాయ్ వీల్స్, ముందర డిస్క్ బ్రేక్, కర్వీ సీట్, మందంగా ఉండే గ్రాబ్ రెయిల్, బ్లూ పెయింట్ థీమ్‍తో ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రానుంది.
కనెక్టెడ్ టెక్నాలజీతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రానుందని హీరో ఎలక్ట్రిక్ హింట్ ఇచ్చింది. ఇక మిగిలిన వివరాలను ఇప్పటికైతే ఆ సంస్థ వెల్లడించలేదు. కమింగ్ సూన్ అని టీజ్ చేసింది. అయితే ఈ కొత్త ఈ-స్కూటర్ ఈనెల 15వ తేదీన విడుదలవుతుందని అంచనాలు వెలువడుతున్నాయి.
Hero Electric Scooters Sales: భారత మార్కెట్‍లో ఈ ఏడాది ఫిబ్రవరిలో 5,861 ఎలక్ట్రిక్ స్కూటర్ యూనిట్లను హీరో ఎలక్ట్రిక్ విక్రయించింది. జనవరి(6,393)తో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువగా ఉంది. హీరో ఎలక్ట్రిక్ నుంచి ప్రస్తుతం ఏడు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. హీరో ఎడ్డీ, హీరో ఎలక్ట్రిక్ పాంటన్ ఎల్‍పీ, హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ డ్యుయల్ బ్యాటరీ, ఆప్టిమా సీఎక్స్ సింగిల్ బ్యాటరీ, హీరో ఎలక్ట్రిక్ ఎన్‍వైఎక్స్, హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎల్ఎక్స్, హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఎల్ఎక్స్ స్కూటర్లు లభిస్తున్నాయి. వీటిలో ఆప్టిమా బాగా పాపులర్ అయింది.
ప్రస్తుతం హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ (Hero Electric Optima) డ్యుయల్ బ్యాటరీ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.85,190గా ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ స్కూటర్ 140 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ గంటలకు 45 కిలోమీటర్లుగా ఉంది. ఆప్టిమా సింగిల్ బ్యాటరీ స్కూటర్ వేరియంట్ 82 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.67,190గా ఉంది.
సంబంధిత కథనం