తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Flight Tickets : అతి చౌకగా విమాన టికెట్లు కావాలా? గూగుల్​ మీకు సాయం చేస్తుంది..

Flight tickets : అతి చౌకగా విమాన టికెట్లు కావాలా? గూగుల్​ మీకు సాయం చేస్తుంది..

Sharath Chitturi HT Telugu

18 October 2024, 13:40 IST

google News
  • Cheap Flight tickets : సూపర్​ చీప్​గా విమాన టికెట్లు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకోసం గూగుల్​ కొత్త ఫీచర్​ని తీసుకొచ్చింది. గూగుల్​ ఫ్లైట్స్​లో ఇప్పుడు మీరు తక్కువ ధరతో కూడిన విమాన టికెట్లను ఎంపిక చేసుకోవచ్చు. పూర్తి వివరాలు..

అతి చౌకగా విమాన టికెట్లు కావాలా?
అతి చౌకగా విమాన టికెట్లు కావాలా? (AP)

అతి చౌకగా విమాన టికెట్లు కావాలా?

అతి చౌకైన ధరలకు విమాన టికెట్లు బుక్​ చేసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇప్పుడు గూగుల్​ మీకోసం కొత్త ఫీచర్​ని తీసుకొచ్చింది. దీని ద్వారా ‘సూపర్​ చీప్​’గాా ఫ్లైట్​ టికెట్లు బుక్​ చేసుకోవచ్చని సంస్థ చెబుతోంది. వివరాల్లోకి వెళితే..

అతి తక్కువ ధరకే విమాన టికెట్లు..

గూగుల్ ఫ్లైట్స్ మీకు డబ్బు ఆదా చేయడంలో సహాయపడే అనేక ఆప్షన్స్​ని అందిస్తుంది. ఇప్పుడు, టెక్ దిగ్గజం మీ టూల్​కిట్​లో మరొక ఫీచర్​ని జోడించింది. ఇది సూపర్-చౌక విమాన టిక్కెట్లను పొందడంలో సహాయపడుతుంది. మీరు గూగుల్ ఫ్లైట్స్​తో సెర్చ్ చేసినప్పుడు, ధర- సౌలభ్యం ఆధారంగా ఫలితాల పైన ఉత్తమ ఆప్షన్స్​ కనిపిస్తాయి.

కానీ కొన్నిసార్లు, బెస్ట్​ డీల్స్​ కోసం కొంత సౌలభ్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి ఈ సూపర్​ చీప్​ ఆప్షన్స్​ అందుబాటులో ఉండవచ్చు. ఉదాహరణకు ఎయిర్​లైన్స్ కంటే తక్కువ ధరను అందించే థర్డ్ పార్టీ బుకింగ్ సైట్​లు ఉండవచ్చు. లేదా మీరు బయలుదేరిన అదే నగరంలో ఉన్న వేరే విమానాశ్రయానికి తిరిగి ప్రయాణించడం ద్వారా మీరు డబ్బును ఆదా చేయవచ్చు.

"చీపెస్ట్​" ట్యాబ్​ గూగుల్ ఫ్లైట్స్​లో ఫీచర్​ వచ్చింది. మీరు ఇప్పుడు మీ ట్రిప్ వివరాలను నమోదు చేసి, మరింత తక్కువ ధరలతో మరిన్ని ఆప్షన్స్​ని చూసేందుకు "చీపెస్ట్​" పై క్లిక్​ చేయండి. గూగుల్ ఫ్లైట్స్ అందుబాటులో ఉన్న ప్రతి ప్రాంతంలో వచ్చే రెండు వారాల్లో ఈ అప్​డేట్ అందరికి లభిస్తుంది.

‘చీపెస్ట్​’ ట్యాబ్​ కింద మీకు మరిన్ని ఆప్షన్స్​ కూడా కనిపిస్తాయి. క్రియేటివ్​ ఇటినరీస్​, లాంగర్​ లేఓవర్స్​, సెల్ఫ్​- ట్రాన్స్​ఫర్స్​, కొనుగోళ్లు వంటివి కొన్ని ఆప్షన్స్​. అయితే సౌకర్యం కన్నా డబ్బుపై ఎక్కువ ఫోకస్​ చేసే వారికి సులభంగా చీపెస్ట్​ ఫ్లైట్​ టికెట్లు దొరికే విధంగా ఈ ఫీచర్​ ఉపయోగపడుతుంది. అవి చూసిన తర్వాత మీరే ఒక నిర్ణయం తీసుకోవచ్చు.

మీరు వచ్చే ఏడాది పెద్ద విహారయాత్రకు వెళుతున్నా లేదా సెలవుల కోసం ట్రిప్ ప్లాన్ చేస్తున్నా, ఈ అప్​గ్రేడ్ మీ ప్రయాణ బడ్జెట్​ను సద్వినియోగం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది.

అమెరికాలో త్వరలోనే హాలిడే సీజన్​ మొదలవుతుంది. థాంక్స్ గివింగ్, క్రిస్మస్, న్యూ ఇయర్​ నేపథ్యంలో అమెరికాలో విమాన ప్రయాణాలు అధికంగా ఉంటాయి. వాటికి అక్టోబర్​ నుంచే చాలా మంది బుకింగ్స్​ చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా ఈ సమయంలో గూగుల్​ ఫ్లైట్స్​లో ఈ ఫీచర్​ అందుబాటులోకి రావడం విశేషం. అక్కడ ఏమి ఉందో చూడటానికి, ప్రయాణికులు తమ ప్రణాళికలను సిద్ధం చేయడానికి ఇది సరైన సమయం!

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్స్​లో అందుబాటులో ఉంది. టెక్​ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం వాట్సాప్​లో హెచ్​టీ తెలుగు ఛానెల్​ని ఫాలో అవ్వండి..

టాపిక్

తదుపరి వ్యాసం