BSNL recharge plan : వర్త్​ వర్మ వర్త్​- ఈ చీపెస్ట్​ బీఎస్​ఎన్​ఎల్​ ప్లాన్​ చూశారా? రూ. 108కి…-check out this bsnl recharge plan unlimited calling for just 108 details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bsnl Recharge Plan : వర్త్​ వర్మ వర్త్​- ఈ చీపెస్ట్​ బీఎస్​ఎన్​ఎల్​ ప్లాన్​ చూశారా? రూ. 108కి…

BSNL recharge plan : వర్త్​ వర్మ వర్త్​- ఈ చీపెస్ట్​ బీఎస్​ఎన్​ఎల్​ ప్లాన్​ చూశారా? రూ. 108కి…

Sharath Chitturi HT Telugu
Oct 14, 2024 01:28 PM IST

BSNL recharge plan : మీరు బీఎస్​ఎన్​ఎల్​ సిమ్​ వాడుతున్నారా? అయితే ఇందులోని అతి చౌకైన ప్లాన్​ గురించి మీకు తెలుసా? బీఎస్​ఎన్​ఎల్​ రూ. 108 రీఛార్జ్​ ప్లాన్స్​ వివరాలివే..

చీపెస్ట్ బీఎస్​ఎన్​ఎల్​ ప్లాన్‍ని చూశారా?
చీపెస్ట్ బీఎస్​ఎన్​ఎల్​ ప్లాన్‍ని చూశారా? (HT_Photo)

దిగ్గజ టెలికాం సంస్థలు ఎయిర్​టెల్​, రిలయన్స్​ జియోలు తమ రీఛార్జ్​ ప్లాన్స్​ ధరలను పెంచడంతో ఇప్పుడు అందరి ఫోకస్​ బీఎస్​ఎన్​ఎల్​ మీద పడింది. మరి ఇటీవలి కాలంలో మీరు బీఎస్​ఎన్​ఎల్​ సిమ్​ తీసుకున్నారా? అయితే మీకు అతి చౌకైన బీఎస్​ఎన్​ఎల్​ ప్లాన్​ గురించి తెలుసా? ఈ రూ. 108 రీఛార్జ్​ ప్లాన్​తో మీరు చాలా బెనిఫిట్స్​ పొందొచ్చు. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

బీఎస్​ఎన్​ఎల్​ రూ. 108 రీఛార్జ్​ ప్లాన్​..

ఈ రూ. 108 బీఎస్​ఎన్​ఎల్​ రీఛార్జ్​ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. దీనితో రోజూ 1 జీబీ డేటాని ఇస్తోంది బీఎస్​ఎన్​ఎల్​ సంస్థ. అంటే 28 రోజులకు 28జీబీ డేటా లభిస్తున్నట్టు. నిర్దిష్ట లిమిట్​ ముగిసన తర్వాత ఇంటర్నెట్​ స్పీడ్​ అనేది 80 కేబీపీఎస్​కి పడిపోతుంది.

ఈ బీఎస్​ఎన్​ఎల్​ ప్రీపెయిడ్​ ప్లాన్​తో గడువు ముగిసేంతవరకు అన్​లిమిటెడ్​ వాయిస్​ కాల్స్​ చేసుకోవచ్చు. అంతేకాకుండా 500 ఎస్​ఎంఎస్​లు ఉచితం. ఎంపిక చేసిన వోచర్స్​తో ఈ బీఎస్​ఎన్​ఎల్​ రూ. 108 ప్లాన్​ వాలిడిటీని పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇతర ప్లాన్స్​ నుంచి ఈ ప్లాన్​లోకి మైగ్రేట్​ అయ్యే అవకాశం లేదు. వీటికి మంచి స్పెషల్​ బెనిఫిట్స్​ ఈ ప్లాన్​లో అందుబాటులో లేవు. బీఎస్​ఎన్​ఎల్​ ట్యూన్స్​ కూడా ఫ్రీగా రావడం లేదు.

ఈ రూ. 107 ప్లాన్​ని చెక్​ చేశారా?

బీఎస్​ఎన్​ఎల్​ సంస్థ రూ. 107 ప్లాన్​ని కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని వాలిడిటీ 50 రోజులు! 3 జీబీ వరకు డేటాని పొందొచ్చు. 200 మినిట్స్​ వాయిస్​ కాల్స్​ ఫ్రీ. అయితే ఈ రీఛార్జ్​ ప్లాన్​లో ఎస్​ఎంఎస్​లు ఉచితంగా లభించడం లేదు. ఎస్​ఎంఎస్​ చేస్తే ఖర్చు అవుతుంది. ఇతర బెనిఫిట్స్​ ఏం లేవు. బీఎస్​ఎన్​ఎల్​ ట్యూన్స్​ కూడా అందుబాటులో లేవు.

ఫ్రీ సిమ్​ డెలివరీ..

కస్టమర్స్​ని ఆకట్టుకునేందుకు బీఎస్​ఎన్​ఎల్​ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఫ్రీ సిమ్​ కార్డ్​ డెలివరీలను ప్రారంభించింది. అంటే, ఇప్పుడు మీరు ఇంట్లో నుంచే బీఎస్​ఎన్​ఎల్​ సిమ్​ కార్డ్​ని బుక్​ చేసుకోవచ్చు. అయితే ఇది ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన నగరాలకే అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ సర్వీస్​ని బీఎస్​ఎన్​ఎల్​ విస్తరించే అవకాశం ఉంది.

395 రోజుల వాలిడిటీతో..

ఇక బీఎస్​ఎన్​ఎల్​ రెగ్యులర్​ ప్లాన్స్​ కూడా ఆకర్షణీయంగానే ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్​కి చెందిన రూ. 2399 ప్లాన్​తో 395 రోజులపాటు ప్రత్యేకమైన వాలిడిటీ వస్తుంది. మరే ఇతర కంపెనీ ప్లాన్​లోనూ ఈ వాలిడిటీ లభించదు. ధర, వాలిడిటీ ప్రకారం, ప్లాన్ రోజువారీ ఖర్చు సుమారు 6 రూపాయలు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు అన్ని నెట్‌వర్క్‌లతో అపరిమిత కాలింగ్ (లోకల్ + ఎస్టీడీ + రోమింగ్) పొందుతారు. ఈ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 2 జీబీ డేటాను లభిస్తుంది. అంటే మొత్తం వ్యాలిడిటీలో 790 జీబీ డేటా వస్తుంది. రోజువారీ డేటా లిమిట్ అయిపోయినా 40 కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వాడకాన్ని కొనసాగించవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం