BSNL new plan : బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్- అతి తక్కువ ధరకే అన్లిమిటెడ్..
BSNL new recharge plan : బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఇక అతి తక్కువ ధరకే 365 రోజుల వాలిడిటీతో రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటాతో పాటు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ప్రముఖ టెలికాసం సంస్థలు తమ రీఛార్జ్ ధరలను పెంచడంతో ఇప్పుడు ఫోకస్ ప్రభుత్వ ఆధారిత బీఎస్ఎన్ఎల్వైపు షిఫ్ట్ అయ్యింది. బీఎస్ఎన్ఎల్ కూడా అందుకు తగ్గట్టుగానే సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా.. అందుబాటు ధరలో బీఎస్ఎన్ఎల్ 365 రోజుల కొత్త ప్లాన్‌ని లాంచ్ చేసింది! కస్టమర్లను అవసరాలను తీర్చుతునే, పోటీని తట్టుకుని నిలబడే విధంగా ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ని బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. చౌకగా మాత్రమే కాకుండా చాలా మంది వినియోగదారులకు ఉపయోగపడే విధంగా బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ వార్షిక రీఛార్జ్ ప్లాన్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్: ధర- ప్రయోజనాలు..
బీఎస్ఎన్ఎల్ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. రూ.2,999 ధరకు ఈ కొత్త బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లో ఏడాది పాటు అన్లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. దీంతోపాటు రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. రోజువారీ హైస్పీడ్ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత స్పీడ్ 40 కేబీపీఎస్‌కు తగ్గుతుందని కస్టమర్లు గుర్తుపెట్టుకోవాలి. దీంతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా లభిస్తాయి.
ఇదీ చూడండి:- BSNL Recharge Plan : 395 రోజుల వాలిడిటీతో అతి తక్కువ రీఛార్జ్ ప్లాన్.. రోజుకు రూ.6 ఖర్చు
బీఎస్ఎన్ఎల్ 4జీ..
ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ టెలికాం ఆపరేటర్ ఇప్పుడు జూన్ 2025 నాటికి తన 4 జి నెట్వర్క్ మోహరింపును పూర్తి చేయాలని భావిస్తోంది. బీఎస్ఎన్ఎల్ భారతదేశం అంతటా 100,000 సైట్లను ఏర్పాటు చేయాలనే తన ప్రతిష్టాత్మక లక్ష్యంలో ఇప్పటివరకు 1,000 సైట్లను మాత్రమే యాక్టివేట్ చేసింది!
ఓవైపు భారత దేశం 5జీ టెక్నాలజీవైపు దూసుకెళుతుంటే, బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ 3జీ సేవలను మాత్రమే అందిస్తోంది. బిఎస్ఎన్ఎల్ 4జీ రోల్అవుట్ ఆలస్యం అయినప్పటికీ, ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్, గణనీయమైన ప్రభుత్వ నిధులు- అంకితమైన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్‌తో, జూన్ 2025 నాటికి మోహరింపును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు భారత టెలికమ్యూనికేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి ఈ రోల్అవుట్ తోడ్పడుతుందని భావిస్తున్నారు.
బీఎస్ఎన్ఎల్ 3300జీబీ డేటా ప్లాన్..
కస్టమర్లను ఆకర్షించే వ్యూహంలో భాగంగా బీఎస్ఎన్ఎల్ ఇటీవల తన ప్రసిద్ధ 3300జీబీ డేటా ప్లాన్ ధరను మరింత తగ్గించింది. రూ.499 ధరలో రూ.100 తగ్గించి.. రూ.399కి ప్లాన్ అందిస్తోంది. చాలా తక్కువ ధరకు డేటాను అందించడం ద్వారా ఇంటర్నెట్ వినియోగదారులను ఆకర్షించడానికి ఈ ప్లాన్ రూపొందించారు. రూ.399 ప్లాన్ గణనీయమైన డేటాను అందించడమే కాకుండా, వినియోగదారులకు నమ్మకమైన, హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడానికి సిద్ధంగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంకో విషయం! మనం ఇప్పుడు వాట్సప్ ఛానల్స్‌లో అందుబాటులో ఉన్నాం! టెక్నాలజీ ప్రపంచం నుంచి ఎటువంటి ఆప్డేట్స్ తెలుసుకోవడానికైనా వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని వెంటనే ఫాలో అవ్వండి!
సంబంధిత కథనం