Guru Pradesha Vratam: ఈ మాసంలో గురుప్రదోష వ్రతం ఎప్పుడు- ఆ రోజు ఏం చేస్తే మీ ఇల్లు సంపదతో నిండుతుందో తెలుసుకొండి
Guru Pradesha Vratam: మార్గశిర్ష మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి తిథి నాడు గురు ప్రదోష వ్రతం వస్తోంది. ప్రదోష వ్రతం రోజున ఉపవాసం పాటించడం ద్వారా కోరిన కోర్కెలు నెరవేరే వరం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.
మార్గశిర్ష మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి తిథి రోజున ప్రదోష వ్రతం వస్తుంది. ఇది మహాదేవుడికి అంకితం చేయబడింది. గురువారం రావటం వల్ల దీనిని గురు ప్రదోష వ్రతం అంటారు. పంచాంగం ప్రకారం.. ప్రదోష వ్రతం రోజున చేసే పూజలు, ఉపవాసాలు శుభఫలితాలను అందిస్తాయి. ముఖ్యంగా ఈ రోజున శివపార్వతులను పూజించడం, ఉపవాస దీక్షలు పాటించడం వల్ల కోరిన కోరికలు నెరవేరే వరం దక్కుతుందని భక్తుల నమ్మిక. 2024 మార్గశిర మాసంలో గురు ప్రదోష వ్రతం ఎప్పుడు వచ్చింది తేదీ, ముహూర్తంలో పాటు పూజ చేసే విధానం, పరిహారాలు తెలుసుకుందాం.
గురు ప్రదోష వ్రతం ఎప్పుడు?
చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం.. నవంబర్ 28 202నన గురు ప్రదోష వ్రతానికి శుభదినం.
ముహూర్తం:
త్రయోదశి తిథి ప్రారంభం - నవంబర్ 28, 2024 సాయంత్రం 06:23 గంటలకు
త్రయోదశి తిథి ముగుస్తుంది - నవంబర్ 29, 2024 ఉదయం 08:39 ప్రదోష
పూజ ముహూర్తం - 17:24 నుండి 20:06
వ్యవధి - 02 గంటలు 42 నిమిషాల
ప్రదోష సమయం - 17:24 నుండి 20:06
పూజా విధానం:
ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి. పార్వతీ సమేత పరమశివుడిని కుటుంబంలోని అన్ని దేవుళ్లను పూజించాలి. ఉపవాసం ఉండాలనుకుంటే పవిత్ర జలాలు, పూలు, అక్షింతలతో ఉపవాస దీక్షను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేయండి. ఆ రోజు ఉదయం, సాయంత్రం ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించాలి. శివాలయం లేదా ఇంటిలో శివుని ప్రతిష్ఠను నిర్వహించి, శివ కుటుంబాన్ని పూజించండి. గురు ప్రదోష వ్రతం కథను వినండి. అనంతరం నెయ్యి దీపంతో శివుడికి హారతి నిచ్చి భక్తిశ్రద్ధలతో ఆయన్ని పూజించాలి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించండి. చివరగా పాపాలను తొలగించమని, పొరపాట్లను క్షమించమని శివుడిని వేడుకొండి.
పరమశివుడకి కింది వస్తువులతో అభిషేకం చేస్తే మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి
ఆవు పెరుగు- ఆరోగ్యం, బలం సమకూరతాయి. సంతాన ప్రాప్తి లభిస్తుంది.
ఆవు నెయ్యి- ఐశ్వర్యం పెరుగుతుంది
చెరకు రసం- దుఖం తొలగిపోతుంది
తేనె- తేజస్సు పెరుగుతుంది
భస్మ జాలం- పాపాలు తొలగిపోతాయి
సుగంధోదకం- పుత్ర సంతోషం కలుగుతుంది
పుష్పొదకం- స్థిరాస్తి పెరుగుతుంది
బిల్వ జాలం- ఆనందం వెల్లివిరుస్తుంది
నువ్వుల నూనె- మృత్యు దోషం తొలగిపోతుంది
రుద్రాక్షోదకం—ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది
సువర్ణ జలం- దరిద్రం తొలగిపోతుంది
అన్నాభిషేకం- సుఖ జీవనం
ద్రాక్ష రసం—సకల కార్యాభివృద్ధి
నారికేళ జలం- సర్వ సంపద వృద్ధి చెందుతుంది
ఖర్జూర రసం- శత్రునాశనం
దూర్వోదకం( గరిక జలం)- ఆర్థికాభివృద్ధి
ధవళోదకమ్- శివుడికి దగ్గరవుతారు
గంగోదకం- సర్వ సమృద్ధి, సంపద ప్రాప్తి లభిస్తుంది
కస్తూరీ జలం- రాజసం
నేరేడు పండ్ల రసం- నిరాశ తొలగిపోతుంది
నవరత్న జలం- గృహ ప్రాప్తి కలుగుతుంది
మామిడి పండు రసం- దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి.
పసుపు, కుంకుమ- మంగళ ప్రదం
విభూది- కోటి రెట్ల ఫలితం దక్కుతుంది
పంచామృతం- చెడు ఆలోచనలు తగ్గుతాయి. స్వార్థం అనే ఆలోచన రాకుండా చేస్తుంది. ఆనందం పొందుతారు.
ఇంట్లోనే అభిషేకం చేసుకోవచ్చు..
శివుడికి అభిషేకం చేయాలంటే గుడికి వెళతారు. ఇంట్లో కూడ శివలింగం ప్రతిష్టించి అభిషేకం చేయవచ్చు. పళ్ళెంలో శివలింగాన్ని పెట్టుకోవాలి. ఉత్తర ముఖంగా లింగం యోని భాగం ఉండాలి. అభిషేకం చేసే వ్యక్తులు లింగానికి పడమర వైపు ఉండాలి. పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు. రక్షిత శ్లోకం చెబుతున్నప్పుడు మీపై, అభిషేకం చేసేందుకు ఉపయోగించే వస్తువులపై కొద్దిగా నీళ్ళు చల్లుకోవాలి. పూజకి ఉపయోగించే అన్ని వస్తువులు పవిత్రంగా ఉండాలి. మంత్రాలు జపిస్తూ పంచామృతాలు శివలింగం మీద అభిషేకిస్తూ ఉండాలి. పూజ చేసేటప్పుడు రుద్రాక్షని ధరించడం ఉత్తమం. చివరగా మంచి నీటితో శివలింగాన్ని అభిషేకించాలి. మీరు ఇలా చేస్తున్నప్పుడు “ఓం నమః శివాయ” అని జపించాలి.
టాపిక్