Action OTT: 90 కోట్ల బడ్జెట్ - 30 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి అలియాభట్ డిజాస్టర్ యాక్షన్ మూవీ!
Action OTT: అలియాభట్ హీరోయిన్‌గా నటించిన జిగ్రా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. డిసెంబర్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని కరణ్ జోహార్‌తో కలిసి అలియాభట్ స్వయంగా ప్రొడ్యూస్ చేసింది.
Action OTT: అలియాభట్ హీరోయిన్‌గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ జిగ్రా ఓటీటీలోకి రాబోతోంది. వసన్ బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ బాలీవుడ్ మూవీని కరణ్ జోహార్, అపూర్వ మెహతాతో కలిసి అలియా భట్ స్వయంగా నిర్మించింది. అక్కాతమ్ముళ్ల బంధానికి యాక్షన్ అంశాలు జోడించి రూపొందిన జిగ్రా మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
30 కోట్ల కలెక్షన్స్...
దాదాపు 90 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన జిగ్రా మూవీ థియేటర్లలో కేవలం 30 కోట్లలోపే కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలకు అరవై కోట్లకుపైనే నష్టాలను మిగిల్చింది. జిగ్రా మూవీలో వేదాంగ్ రైనా కీలక పాత్రలో నటించగా...దల్జీత్ దొసాంజా, రాధిక మదన్, అభిమన్యు దసానీ అతిథి పాత్రల్లో మెరిశారు. ఈ బాలీవుడ్ మూవీలో టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఓ ఇంపార్టెంట్ రోల్‌లో మెరిశాడు.
నెట్‌ఫ్లిక్స్‌లో...
జిగ్రా మూవీ ఓటీటీలోకివస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. డిసెంబర్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ బాలీవుడ్ మూవీ రిలీజ్ కాబోతోంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో జిగ్రా విడుదలకానున్నట్లు సమాచారం. నవంబర్ నెలాఖరున జిగ్రా ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
జిగ్రా కథ ఇదే...
సత్యభామకు (అలియా భట్) తమ్ముడు అంకుర్ (వేదాంగ్ రైనా) అంటే పంచప్రాణాలు. చిన్నప్పుడే తల్లిదండ్రులను దూరమవ్వడంతో ఎన్నో కష్టాలు పడి తమ్ముడిని పెద్ద చేస్తుంది సత్యభామ. కజిన్ బ్రదర్‌తో కలిసి విదేశాలకు వెళ్లిన అంకుర్ డ్రగ్స్ కేసులో చిక్కుకుంటాడు.
అతడికి మరణ దండన విధిస్తారు. తన సోదరుడు నిరపరాధి అని నమ్మిన సత్యభామ అతడికి వెతుక్కుంటూ విదేశాలకు వెళుతుంది? అక్కడ అమెకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? డ్రగ్స్ కేసులోని నిజానిజాలను సత్యభామ ఎలా వెలికితీసింది? తన తమ్ముడిని నిర్ధోషిగా జైలు నుంచి ఏ విధంగా విడిపించింది అన్నదే ఈ మూవీ కథ.
అలియాభట్ ఇమేజ్...
కథ, కథనాల్ని కాకుండా అలియాభట్‌కు ఉన్న ఇమేజ్‌ను మాత్రమే నమ్ముకొని మేకర్స్ జిగ్రా మూవీని తెరకెక్కించారు. తన తమ్ముడిని సత్య జైలు నుంచి విడిపించే సన్నివేశాల్లో ఉత్కంఠ లోపించడం, అక్కాతమ్ముళ్ల బంధం నేపథ్యంలో వచ్చి సీన్స్‌లో ఎమోషన్స్ సరిగ్గా వర్కవుట్ కాకపోవడంతో జిగ్రా మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
జిగ్రా తర్వాత అల్ఫా, లవ్ అండ్ వార్ సినిమాలు చేస్తోంది అలియాభట్. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.