IND vs AUS Schedule: భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే, మ్యాచ్ టైమింగ్స్, జట్ల వివరాలు, స్ట్రీమింగ్ డీటైల్స్
IND vs AUS 2024 Test Series Schedule: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్‌కి శుక్రవారం నుంచి తెరలేవబోతోంది. ఇటీవల న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభావాన్ని ఎదుర్కొన్న భారత్ జట్టు.. ఈ సిరీస్‌లో సత్తాచాటాలని ఆశిస్తోంది.
ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ శుక్రవారం (నవంబరు 22) నుంచి ప్రారంభంకానుంది. ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి భారత్ జట్టు తొలి టెస్టు మ్యాచ్‌ను ఆడనుండగా.. సిరీస్‌లో మొత్తం ఐదు టెస్టులు జరగనున్నాయి. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లో 0-3 తేడాతో టీమిండియా వైట్‌వాష్ చవిచూసిన విషయం తెలిసిందే.
భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ షెడ్యూల్
- నవంబరు 22 నుంచి పెర్త్‌లో తొలి టెస్టు మ్యాచ్ (భారత కాలమాన ప్రకారం మ్యాచ్ ఉదయం 7.50 గంటలకి ప్రారంభం)
- డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు మ్యాచ్ (భారత కాలమాన ప్రకారం మ్యాచ్ ఉదయం 9:30 గంటలకి ప్రారంభం)
- డిసెంబరు 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ (భారత కాలమాన ప్రకారం మ్యాచ్ తెల్లవారుజామున 5.50 గంటలకి ప్రారంభం)
- డిసెంబరు 26 నుంచి మెల్‌బోర్న్‌లో నాలుగో టెస్టు మ్యాచ్ (భారత కాలమాన ప్రకారం మ్యాచ్ తెల్లవారుజామున 5.00 గంటలకి ప్రారంభం)
- జనవరి 3 నుంచి సిడ్నీలో ఐదో టెస్టు మ్యాచ్ (భారత కాలమాన ప్రకారం మ్యాచ్ తెల్లవారుజామున 5.00 గంటలకి ప్రారంభం)
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి భారత్ జట్టు ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, విరాట్ కోహ్లీ, యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్, నితీశ్ రెడ్డి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ కృష్ణ, హర్షిత్ రాణా
భారత్‌తో టెస్టు సిరీస్‌కి ఆస్ట్రేలియా జట్టు ఇదే
ట్రావిస్ హెడ్, మార్కస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనే, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), జోష్ ఇంగ్లీస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, నాథన్ లయన్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్
మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సిరీస్‌లోని ఈ ఐదు టెస్టులను స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్‌లో వీక్షించవచ్చు. అలానే డీడీ స్పోర్ట్స్‌లో ఉచితంగా ప్రసారం అవుతాయి. ఆన్‌లైన్‌లో డిస్నీ + హాట్‌స్టార్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో మ్యాచ్‌ను వీక్షించవచ్చు