Bigg Boss Telugu 8: గౌతమ్‌కు బొచ్చు పీకిచ్చిన పృథ్వీ.. హౌజ్‌లో గూండాయిజం.. మధ్యలోకి విష్ణుప్రియ.. ఏం పీకలేవంటూ! (వీడియో)-bigg boss telugu 8 gautham prithvi fight in final mega chief task bigg boss 8 telugu november 21 episode highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8: గౌతమ్‌కు బొచ్చు పీకిచ్చిన పృథ్వీ.. హౌజ్‌లో గూండాయిజం.. మధ్యలోకి విష్ణుప్రియ.. ఏం పీకలేవంటూ! (వీడియో)

Bigg Boss Telugu 8: గౌతమ్‌కు బొచ్చు పీకిచ్చిన పృథ్వీ.. హౌజ్‌లో గూండాయిజం.. మధ్యలోకి విష్ణుప్రియ.. ఏం పీకలేవంటూ! (వీడియో)

Sanjiv Kumar HT Telugu
Nov 21, 2024 01:00 PM IST

Bigg Boss Telugu 8 November 21 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8లో ఆఖరి మెగా చీఫ్ పోటీ మొదలు అయింది. ఇందులో పృథ్వీ, గౌతమ్ మధ్య బీకరమైన గొడవ జరిగింది. పృథ్వీ అయితే ఏకంగా చెస్ట్‌పై ఉన్న హెయిర్ పీకి ఇచ్చి రూడ్‌గా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన నవంబర్ 21 ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.

గౌతమ్‌కు బొచ్చు పీకిచ్చిన పృథ్వీ.. హౌజ్‌లో గూండాయిజం.. మధ్యలోకి విష్ణుప్రియ.. ఏం పీకలేవంటూ! (వీడియో)
గౌతమ్‌కు బొచ్చు పీకిచ్చిన పృథ్వీ.. హౌజ్‌లో గూండాయిజం.. మధ్యలోకి విష్ణుప్రియ.. ఏం పీకలేవంటూ! (వీడియో) (Disney Plus Hotstar/YouTube)

Bigg Boss 8 Telugu Today Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో కంటెస్టెంట్ల మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటోంది. తాజాగా గౌతమ్ వర్సెస్ పృథ్వీ ఫైట్ మరింత బీకరంగా సాగింది. అయితే, ప్రస్తుతం బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లో ఆఖరి మెగా చీఫ్ టాస్క్ జరుగుతోంది.

ఆఖరి మెగా చీఫ్ పోటీ

అంటే, ఈ సీజన్‌లో ఇదే చివరి మెగా చీఫ్ టాస్క్. అందుకోసమే కంటెస్టెంట్స్ తెగ పోటీ పడుతున్నారు. నవంబర్ 20 ఎపిసోడ్‌లో ప్రారంభమైన మెగా చీఫ్ పోటీ రెండో రోజు కూడా కొనసాగనుంది. బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 21 ఎపిసోడ్‌లో జరిగే మెగా చీఫ్ టాస్క్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో గౌతమ్ మధ్య పృథ్వీ ఫైట్ బీభత్సంగా జరిగింది.

"మెగా చీఫ్ అవ్వాలి అవ్వాలి అని చెప్పి చాలా ట్రై చేస్తున్నాను" అని రోహిణి చెప్పింది. నేను చేయని అబాండాలు నామీద పడ్డాయి. "వాటన్నింటిని నేను తప్పు అని నిరూపించుకోవాలనుకుంటున్నాను" అని నిఖిల్ అన్నాడు. వీరిలో ఒకరిని మెగా చీఫ్‌గా సెలెక్ట్ చేసే అవకాశం హౌజ్‌మేట్స్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో గౌతమ్ తన సపోర్ట్ ఎవరికో చెప్పాడు.

ప్లానింగ్ చేసి

"నేను రోహిణికి ఇద్దామని అనుకుంటున్నా. చాలామంది హౌజ్‌మేట్స్ కలిసి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌ను వచ్చినట్లే వచ్చినట్లు పంపిద్దామని చాలా ప్లానింగ్ జరిగింది" అని గౌతమ్ అన్నాడు. "వైల్డ్ కార్డ్స్‌ని పంపిద్దామని ప్లానింగ్ చేశామన్నదానిపై డిఫెండ్ చేసుకోవాలి" అని పృథ్వీ అన్నాడు. "ఓన్లీ వైల్డ్ కార్డ్స్‌నే పంపించాలనుకోవడం చాలా తప్పు" అని గౌతమ్ అన్నాడు. దాంతో గొడవ మొదలు అయింది.

"నా పర్సనల్ ఒపినీయన్ అదే" అని పృథ్వీ చెబుతుండగా.. "నీ ఒపినీయన్ కరెక్ట్ అయితే నిన్ను ఉంచుతారు. నాది కరెక్ట్ అయితే నన్ను ఉంచుతారు. ఓకేనా డన్. ప్రతిసారీ వాన్నే కాపాడుకుంటూ తప్పున్న వాన్ని నామినేట్ చేయకుండా ప్రతిదీ కలిసి వెళ్లడమేనా. నువ్ కంటికి కనిపించినదాన్ని కనుమరుగు చేద్దామనుకుంటున్నావ్" అని గౌతమ్ అన్నాడు.

నాకు కనిపించేదే

మధ్యలో దూరిన విష్ణుప్రియ "అలా ఏం చేయట్లేదు" గౌతమ్ అని అంది. "ఇదే.. ఇప్పుడు ఇక్కడ అయితుంటే నీకెందుకు వస్తుంది ప్రాబ్లమ్" అని గౌతమ్ రెచ్చిపోయాడు. "ఏది పడితే అది నువ్వు చెప్పకు" అని నిఖిల్ అన్నాడు. "నా కళ్లకు కనిపించిందే చెబుతున్నా. ఇక్కడ వైఫైలాగా హౌజ్ మొత్తం కనిపిస్తుంది" అని గౌతమ్ డిఫెండ్ చేసుకున్నాడు.

తర్వాత గౌతమ్‌ను నబీల్ కాంప్రమైజ్ చేస్తుంటే.. "వాడికేంటీ స్కోప్ ఇచ్చేది" అని ప్రేరణతో పృథ్వీ అన్నాడు. దాంతో గొడవ మరింత పెద్దది అయింది. "మంచిగా మాట్లాడు.. రౌడీయిజం చేయనీకి వచ్చావా. మంచిగా మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడు. వాడు వీడు ఏందీ" అని గౌతమ్ అన్నాడు. "నువ్ హౌజ్‌లోకి వచ్చావ్. ఏం చేశావ్" అని అడ్డదిడ్డంగా పృథ్వీ వాదించాడు.

రౌడీయిజం చేస్తున్నారా

"ఏం పీకలేవ్ మచ్చా నువ్వు. వాడు వీడు అన్నప్పుడు బరాబర్ ఇలాగే మాట్లాడుతా భయ్" అని గౌతమ్ అన్నాడు. తర్వాత ఇద్దరు నువ్వు ఎవడ్రా అంటే నువ్వు ఎవడ్రా అని అనుకున్నారు. ఇదే సమయంలో చెస్ట్‌పై ఉన్న హెయిర్ పీకి బొచ్చు కూడా పీకలేవ్ అన్నట్లుగా గౌతమ్‌పై విసిరాడు పృథ్వీ. "రౌడీయిజం చేయడానికి వచ్చారా ఒక్కొక్కడు వాడు వీడు అనుకుంటూ" అని గౌతమ్ అన్నాడు.

కట్ చేస్తే టేస్టీ తేజ, రోహిణి, అవినాష్ జరిగిన గొడవపై డిస్కషన్ పెట్టారు. "ఒకడు మాట్లాడుతుంటే ముగ్గురు నలుగురు వచ్చేస్తారు" అని తేజ, అవినాష్ అన్నారు. విష్ణుతో అనలేదా. "ముగ్గురు గ్రూపిజం అంటుంటే మధ్యలో నువ్వెందుకు వస్తున్నావని" అని రోహిణి అంది.

క్లియర్‌గా అది గూండాయిజం

"గౌతమ్ అక్కడే అదే ప్లేస్‌లో నిల్చుని ఉన్నాడు. పృథ్వీ నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తూ స్విమ్మింగ్ పూల్‌ నుంచి వస్తూ మీదమీదకు వస్తున్నాడు" అని అవినాష్ చెప్పాడు. "భయపడాలనా.." అని తేజ అంటే.. అదే అని రోహిణి అంది. "అన్నా అది క్లియర్‌గా గూండాయిజం, రౌడీయిజంలా ఉందన్న" అని టేస్టీ తేజ అన్నాడు.

Whats_app_banner