OnePlus Phone Discount : వన్‌ప్లస్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇప్పుడు కొంటే డిస్కౌంట్‌ పొందొచ్చు-oneplus nord ce 4 lite 5g gets 3000 rupees discount check available price online here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Phone Discount : వన్‌ప్లస్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇప్పుడు కొంటే డిస్కౌంట్‌ పొందొచ్చు

OnePlus Phone Discount : వన్‌ప్లస్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇప్పుడు కొంటే డిస్కౌంట్‌ పొందొచ్చు

Anand Sai HT Telugu
Nov 21, 2024 12:30 PM IST

OnePlus Nord CE 4 Lite 5G Discount : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ మీద డిస్కౌంట్ నడుస్తోంది. ఈ ఫోన్ తగ్గింపు ధరతో మీరు సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలపై ఓ లుక్కేయండి..

వన్‌ప్లస్ ఫోన్‌పై డిస్కౌంట్
వన్‌ప్లస్ ఫోన్‌పై డిస్కౌంట్

ఇండియాలో వన్‌ప్లస్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. చాలా మంది వీటిని ఇష్టపడుతారు. మీరు వన్‌ప్లస్ ఫోన్ కొనాలనుకుంటే ఇదే రైట్ టైమ్. ఎందుకంటే తగ్గింపు ధరతో మీకు దొరుకుతుంది. ప్రస్తుతం వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ ధరను తగ్గించింది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 14 శాతం తగ్గింపు, 10 శాతం బ్యాంక్ తగ్గింపు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను పొందవచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్‌ను 8జీబీ ప్లస్ 128జీబీతోపాటుగా 8జీబీ ప్లస్ 256జీబీ స్టోరేజ్ కెపాసిటీతో అందిస్తుంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా ఉంది. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ మొబైల్‌లో 6.6 అంగుళాల డిస్‌ప్లే, 5500mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను కంపెనీ రూ.19,999కి విడుదల చేసింది. 3000 రూపాయల తగ్గింపుతో రూ.17,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఎస్బీఐ డెబిట్ కార్డ్ చెల్లింపుపై 500 అదనపు తగ్గింపు లభిస్తుంది. అలాగే రూ.17,050 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఈ మొబైల్ 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1080×2400 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2100 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో కంపెనీ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్లలో తయారైంది. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్ 14.0పై నడుస్తుంది.

ఇందులో 8జీబీ ర్యామ్ వస్తుంది. 8జీబీ వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. ఫిజికల్ ర్యామ్‌తో 16జీబీని ఉపయోగించవచ్చు. 256జీబీ స్టోరేజ్ ఎంపిక, 2టీబీ మైక్రో ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇది ఓఐఎస్, ఈఐఎస్ మద్దతుతో 50-మెగాపిక్సెల్ సోనీ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

Whats_app_banner