How to lock Aadhaar card : ఆధార్ కార్డును ఎలా లాక్ చేయాలో తెలుసా? మీ డేటాని ఇలా కాపాడుకోండి..
Aadhaar card lock unlock : భారతీయ నివాసితులకు ఆధార్ కార్డు చాలా అవసరం. అందుకే ఆధార్ కార్డులు దుర్వినియోగం అవ్వకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఆధార్ కార్డును లాక్ చేసుకోవచ్చు. ఎలాగే తెలుసా? పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
భారతీయులకు ఆధార్ కార్డు తప్పనిసరి. సిలిండర్ బుకింగ్ నుంచి ఆసుపత్రి సేవల వరకు ఆధార్ కార్డు చాలా అవసరం. ప్రభుత్వ పథకాలు, టెలికమ్యూనికేషన్లు, బ్యాంకింగ్ సహా వివిధ సేవలను పొందడానికి ఈ 12 డిజిట్ ఆధార చాలా ముఖ్యం. కానీ కొన్నిసార్లు ఆధార్ కార్డు డేటా లీక్ అవ్వడం ఆందోళనకు గురిచేస్తున్న విషయం. సైబర్ నేరగాళ్లు ఆధార్ డేటాని తీసుకుని చాలా చోట్ల దుర్వినియోగం చేస్తుంటారు. మనం అనవసరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి మన డేటాని ఎలా కాపాడుకోవాలి? ఆధార్ కార్డును లాక్ చేసుకునే ఆప్షన్ ఉందా? ఇక్కడ తెలుసుకోండి..
ఆన్లైన్లో ఆధార్ కార్డు దుర్వినియోగానికి ఎలా చెక్ పెట్టాలి?
1. మై ఆధార్ పోర్టల్‌ను సందర్శించండి : అధికారిక “మై ఆధార్ వెబ్సైట్”కు వెళ్లండి.
2. లాగిన్: మీ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఓటీపీతో లాగిన్ అవ్వండి.
3. ఓటీపీ వెరిఫై: మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి పంపిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్‌పై క్లిక్ చేయాలి.
4. వ్యూ ఆథెంటికేషన్ హిస్టరీ: 'ఆథెంటికేషన్ హిస్టరీ' ఎంచుకోండి. మీ ఆధార్ వినియోగాన్ని సమీక్షించడానికి తేదీ పరిధిని ఎంచుకోండి. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాల కనిపిస్తే యూఐడీఏఐ వెబ్సైట్లో ఫిర్యాదు చేయండి.
ఇదీ చూడండి:- MAB : మీ బ్యాంకు ఖాతాలో నెలవారీ సగటు బ్యాలెన్స్ లేకపోతే ఏమవుతుంది?
మీ ఆధార్ కార్డు బయోమెట్రిక్స్ ఆన్లైన్లో ఎలా లాక్ చేయాలి?
1. మై ఆధార్ పోర్టల్ యాక్సెస్: మై ఆధార్ వెబ్‌సైట్‌ని సందర్శించండి.
2. లాక్ ఆధార్: "లాక్/అన్లాక్ ఆధార్"పై క్లిక్ చేసి మార్గదర్శకాలను చదివి ముందుకు సాగండి.
3. వివరాలు ఎంటర్ చేయండి: మీ వర్చువల్ ఐడీ, పూర్తి పేరు, పిన్‌కోడ్, క్యాప్చా అందించి, ఆపై 'సెండ్ ఓటీపీ'పై క్లిక్ చేయండి.
4. కంప్లీట్ లాకింగ్ ప్రాసెస్: ఓటీపీని ఎంటర్ చేసి 'సబ్మిట్' బటన్‌పై క్లిక్ చేసి మీ ఆధార్ కార్డును లాక్ చేయాలి.
ఆన్లైన్లో ఆధార్ దుర్వినియోగాన్ని ఎలా నివేదించాలి..?
మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అవుతుందని మీరు అనుమానించినట్లయితే, 1947కు కాల్ చేయడం, help@uidai.gov.in ఈమెయిల్ చేయడం లేదా యూఐడీఏఐ వెబ్సైట్లో ఫిర్యాదు చేయడం ద్వారా నివేదించండి.
ఆధార్ కార్డు ఫోటోకాపీల దుర్వినియోగాన్ని ఇలా అడ్డుకోండి..
1. అటెస్ట్ ఫోటోకాపీలు: ఫోటోకాపీలపై సంతకం చేయండి. పర్పస్, తేదీ సమయాన్ని పేర్కొనండి.
2. మాస్క్డ్ ఆధార్ ఉపయోగించండి: మొదటి 8 అంకెలు దాచిన మాస్క్డ్ ఆధార్ కార్డును పొందండి. మై ఆధార్ పోర్టల్లోకి వెళ్లి 'డౌన్లోడ్ ఆధార్' సెలెక్ట్ చేసి, 'మాస్క్డ్ ఆధార్ కావాలా?' అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసి డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి.
పైన చెప్పిన టిప్స్‌ని పాటించి మీ ఆధార్ కార్డును భద్రంగా ఉంచుకుంటే, మీరు స్కామ్ బారిన పడే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. వీటితో పాటు ఎవరికైనా ఆధార్ కార్డు ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి!
సంబంధిత కథనం