TVS Apache RTR 160 4V Vs Hero Xtreme 160R : ఈ రెండు బైకుల్లో ధర, ఫీచర్ల పరంగా చూస్తే కొనేందుకు ఏది బెటర్?
TVS Apache RTR 160 4V Vs Hero Xtreme 160R : ఇటీవలే టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి అప్‌డేట్ వెర్షన్ మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఈ బైక్ హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్‌తో పోటీ పడుతుంది. ఈ రెండు బైకుల్లో ఏది బెటర్ అని చూద్దాం..
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 అనేక మార్పులతో ప్రారంభించారు. అయితే ఈ బైక్ తీసుకోవాలా? వేరే ఏదైనా కొనాలా? అని చాలా మంది ఆలోచిస్తున్నారు. అపాచీ కొత్త బైక్ భారతీయ మార్కెట్‌లో హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్‌తో పోటీపడుతుంది. రెండు బైక్‌లు ఇంజన్, పనితీరు, డిజైన్ పరంగా ఒకదానితో ఒకటి పోటీపడతాయి. ఇందులో ఏది బెస్ట్ అని మీరు డిసైడ్ చేసుకునేందుకు ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది
2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 ఇండియన్ మార్కెట్లో రూ. 1.39 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేశారు. ఇది కేవలం ఒక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అదే సమయంలో హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.27 లక్షలుగా నిర్ణయించారు. దీని టాప్ వేరియంట్‌కు రూ. 1.36 లక్షల వరకు ఉంటుంది. ఈ విధంగా ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ కాస్త ధరలో తక్కువగా ఉంటుంది.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 మునుపటి కంటే ఎక్కువ ఫీచర్ తీసుకొచ్చారు. ఇది టీవీఎస్ SmartXonnect టీఎం టెక్నాలజీతో టీఎఫ్‌టీ డిస్‌ప్లే పొందుతుంది. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్‌లు, వాయిస్ అసిస్టెన్స్, గ్లైడ్ త్రూ టెక్నాలజీ వంటి ఫీచర్‌లను కూడా కలిగి ఉంటుంది.
ఇక హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ విషయానికొస్తే.. దాని సెగ్మెంట్ ప్రకారం మెరుగైన ఫీచర్లను కూడా అందిస్తుంది. ఇందులో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, పానిక్ బ్రేక్ అలర్ట్ సిస్టమ్, డ్రాగ్ టైమర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ 159.7 సీసీ సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత అయి ఉంటుంది. ఈ పవర్‌ట్రెయిన్ 17.3 బీహెచ్‌పీ శక్తిని, 14.73 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ చూస్తే.. 163.2 సిసి సింగిల్-సిలిండర్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ను పొందుతుంది. ఈ పవర్‌ట్రెయిన్ గరిష్టంగా 16.66 బీహెచ్‌పీ శక్తిని, 14.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా ఎక్స్‌ట్రీమ్ ఇంజిన్ అపాచీ కంటే తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
పై రెండు బైకుల ధర, ఫీచర్లు గమనించి.. ఏది తీసుకోవాలో డిసైడ్ చేసుకోండి.
టాపిక్