HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Indigo New Flights : విశాఖ, హైదరాబాద్ నుంచి ఇండిగో 11 కొత్త విమాన సర్వీసులు-ఎప్పటి నుంచంటే?

Indigo New Flights : విశాఖ, హైదరాబాద్ నుంచి ఇండిగో 11 కొత్త విమాన సర్వీసులు-ఎప్పటి నుంచంటే?

07 September 2024, 16:13 IST

Indigo New Flights : విశాఖ, హైదరాబాద్ నుంచి నూతన సర్వీసులను నడుపుతున్నట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ ప్రకటించింది. విశాఖ నుంచి నాలుగు, హైదరాబాద్ నుంచి ఏడు నూతన సర్వీసులను ప్రారంభించనుంది. విశాఖ నుంచి హైదరాబాద్, విజయవాడ, అహ్మదాబాద్ కు…. హైదరాబాద్ నుంచి ఏడు నగరాలకు కొత్త విమాన సర్వీసులు నడపనుంది.

Indigo New Flights : విశాఖ, హైదరాబాద్ నుంచి నూతన సర్వీసులను నడుపుతున్నట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ ప్రకటించింది. విశాఖ నుంచి నాలుగు, హైదరాబాద్ నుంచి ఏడు నూతన సర్వీసులను ప్రారంభించనుంది. విశాఖ నుంచి హైదరాబాద్, విజయవాడ, అహ్మదాబాద్ కు…. హైదరాబాద్ నుంచి ఏడు నగరాలకు కొత్త విమాన సర్వీసులు నడపనుంది.
విశాఖ నుంచి కొత్తగా 4 విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ ప్రకటించింది.  సెప్టెంబర్ నెల నుంచి ఒక సర్వీస్, అక్టోబర్ నెలలో మరో మూడు సర్వీసులు ప్రారంభించనుంది. సెప్టెంబర్ 21వ తేదీన ఉదయం 9 గంటలకు విశాఖ-హైదరాబాద్‌ ఇండిగో కొత్త సర్వీసు ప్రారంభం కానుంది.  అక్టోబర్‌ 27న విశాఖ-విజయవాడ నూతన సర్వీసును ప్రారంభించనున్నారు. 
(1 / 6)
విశాఖ నుంచి కొత్తగా 4 విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ ప్రకటించింది.  సెప్టెంబర్ నెల నుంచి ఒక సర్వీస్, అక్టోబర్ నెలలో మరో మూడు సర్వీసులు ప్రారంభించనుంది. సెప్టెంబర్ 21వ తేదీన ఉదయం 9 గంటలకు విశాఖ-హైదరాబాద్‌ ఇండిగో కొత్త సర్వీసు ప్రారంభం కానుంది.  అక్టోబర్‌ 27న విశాఖ-విజయవాడ నూతన సర్వీసును ప్రారంభించనున్నారు. (Twitter)
కొత్త సర్వీసులు విశాఖ నుంచి ప్రతిరోజూ ఉదయం 9.15 గంటలకు బయలుదేరతాయి. అక్టోబర్ నెలలో విశాఖ-హైదరాబాద్‌ సర్వీసును కూడా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ విమానం విశాఖ నుంచి బయలుదేరుతుంది. విశాఖ-అహ్మదాబాద్‌ మధ్య వారానికి మూడు రోజుల పాటు కొత్త సర్వీసును నడపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోషియేషన్ తెలిపింది. 
(2 / 6)
కొత్త సర్వీసులు విశాఖ నుంచి ప్రతిరోజూ ఉదయం 9.15 గంటలకు బయలుదేరతాయి. అక్టోబర్ నెలలో విశాఖ-హైదరాబాద్‌ సర్వీసును కూడా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ విమానం విశాఖ నుంచి బయలుదేరుతుంది. విశాఖ-అహ్మదాబాద్‌ మధ్య వారానికి మూడు రోజుల పాటు కొత్త సర్వీసును నడపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోషియేషన్ తెలిపింది. (Twitter)
ఇండిగో ఎయిర్ లైన్స్ హైదరాబాద్ నుంచి అయోధ్యతో సహా ఏడు కొత్త నగరాలకు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త సర్వీసులు సెప్టెంబర్ నుంచి ప్రారంభకానున్నాయి. దీంతో హైదరాబాద్ కు దేశీయ విమాన కనెక్టివిటీ మెరుగుపడుతుందని ఇండిగో తెలిపింది. 
(3 / 6)
ఇండిగో ఎయిర్ లైన్స్ హైదరాబాద్ నుంచి అయోధ్యతో సహా ఏడు కొత్త నగరాలకు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త సర్వీసులు సెప్టెంబర్ నుంచి ప్రారంభకానున్నాయి. దీంతో హైదరాబాద్ కు దేశీయ విమాన కనెక్టివిటీ మెరుగుపడుతుందని ఇండిగో తెలిపింది. (twitter)
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొత్త సర్వీసులు రాజ్‌కోట్, అగర్తలా, జమ్ము, ఆగ్రా, కాన్పూర్, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లకు నడపనున్నారు. సెప్టెంబర్ 29న అయోధ్యకు నేరుగా సర్వీస్ ప్రారంభించనున్నారు. ఈ సర్వీస్ సోమ, మంగళ, శుక్ర, ఆదివారాల్లో వారానికి నాలుగు సార్లు నడపనున్నారు. 
(4 / 6)
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొత్త సర్వీసులు రాజ్‌కోట్, అగర్తలా, జమ్ము, ఆగ్రా, కాన్పూర్, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లకు నడపనున్నారు. సెప్టెంబర్ 29న అయోధ్యకు నేరుగా సర్వీస్ ప్రారంభించనున్నారు. ఈ సర్వీస్ సోమ, మంగళ, శుక్ర, ఆదివారాల్లో వారానికి నాలుగు సార్లు నడపనున్నారు. (Twitter)
హైదరాబాద్ నుంచి ఉత్తర్ ప్రదేశ్ లోని మూడు ప్రధాన నగరాలకు ఇండిగో కొత్త సర్వీసులు నడపనుంది. సెప్టెంబర్ 28 నుంచి వారానికి మూడ్రోజులు(బుధ, గురు, శనివారాలు) ఆగ్రా, ప్రయోగ్ రాజ్ లకు డైరెక్ట్ సర్వీసులు నడపనున్నారు.  కాన్పూర్ సర్వీస్ సెప్టెంబర్ 27న ప్రారంభించనున్నారు. ఈ సర్వీస్ వారానికి నాలుగు రోజులు(సోమ, బుధ, శుక్ర, శనివారాలు) నడపనున్నారు. 
(5 / 6)
హైదరాబాద్ నుంచి ఉత్తర్ ప్రదేశ్ లోని మూడు ప్రధాన నగరాలకు ఇండిగో కొత్త సర్వీసులు నడపనుంది. సెప్టెంబర్ 28 నుంచి వారానికి మూడ్రోజులు(బుధ, గురు, శనివారాలు) ఆగ్రా, ప్రయోగ్ రాజ్ లకు డైరెక్ట్ సర్వీసులు నడపనున్నారు.  కాన్పూర్ సర్వీస్ సెప్టెంబర్ 27న ప్రారంభించనున్నారు. ఈ సర్వీస్ వారానికి నాలుగు రోజులు(సోమ, బుధ, శుక్ర, శనివారాలు) నడపనున్నారు. (twitter)
హైదరాబాద్ నుంచి రాజ్ కోట్ కు సెప్టెంబర్ 16 నుంచి డైరెక్ట్ ఫ్లైట్ నడపనున్నట్లు ఇండిగో ప్రకటించింది. అగర్తలాకు కొత్త సర్వీస్ ను సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభించనున్నారు. ఈ సర్వీస్ వారానికి నాలుగు రోజులు(సోమ, బుధ, శుక్ర, ఆదివారాలు) నడుపుతారు. హైదరాబాద్ నుంచి జమ్మూకు నూతన సర్వీసును సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభించనున్నారు. ఈ సర్వీస్ వారానికి మూడురోజులు(మంగళ, గురు, శనివారాలు) నడపనున్నారు. 
(6 / 6)
హైదరాబాద్ నుంచి రాజ్ కోట్ కు సెప్టెంబర్ 16 నుంచి డైరెక్ట్ ఫ్లైట్ నడపనున్నట్లు ఇండిగో ప్రకటించింది. అగర్తలాకు కొత్త సర్వీస్ ను సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభించనున్నారు. ఈ సర్వీస్ వారానికి నాలుగు రోజులు(సోమ, బుధ, శుక్ర, ఆదివారాలు) నడుపుతారు. హైదరాబాద్ నుంచి జమ్మూకు నూతన సర్వీసును సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభించనున్నారు. ఈ సర్వీస్ వారానికి మూడురోజులు(మంగళ, గురు, శనివారాలు) నడపనున్నారు. (Twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి