తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Google Pixel Watch 2 : అదిరిపోయే ఫీచర్స్​తో గూగుల్​ పిక్సెల్​ వాచ్​ 2..!

Google Pixel Watch 2 : అదిరిపోయే ఫీచర్స్​తో గూగుల్​ పిక్సెల్​ వాచ్​ 2..!

Sharath Chitturi HT Telugu

26 September 2023, 7:55 IST

    • Google Pixel Watch 2 : గూగుల్​ పిక్సెల్​ వాచ్​ 2 త్వరలోనే లాంచ్​కానుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి.
గూగుల్​ పిక్సెల్​ వాచ్​ 2..
గూగుల్​ పిక్సెల్​ వాచ్​ 2..

గూగుల్​ పిక్సెల్​ వాచ్​ 2..

Google Pixel Watch 2 : 'పిక్సెల్​' ఈవెంట్​కు గూగుల్​ సన్నద్ధమవుతోంది. అక్టోబర్​ 4న జరగనున్న ఈ ఈవెంట్​లో పిక్సెల్​ 8 సిరీస్​ను లాంచ్​ చేయనుంది దిగ్గజ టెక్​ సంస్థ. పిక్సెల్​ వాచ్​ 2ని కూడా లాంచ్​ చేస్తోందని తెలుస్తోంది. కాగా.. లాంచ్​కి ముందే ఈ స్మార్ట్​వాచ్​కు సంబంధించిన ఫీచర్స్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఆ వివరాలు..

గూగుల్​ పిక్సెల్​ వాచ్​ 2 ఇలా ఉంటుంది..!

పిక్సెల్​ వాచ్​ 2.. ఫస్ట్​ జనరేషన్​ మోడల్​ను పోలి ఉంది. రైట్​ సైడ్​లో రౌండ్​ బెజెల్​-లెస్​ డిస్​ప్లే, మెటల్​ క్రౌన్​ ఉన్నాయి. ఈ గ్యాడ్జెట్​ను 100శాతం అల్యుమీనియంతో తయారు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో మూడు కొత్త సెన్సార్స్​ వచ్చినట్టు సమాచారం.

Google Pixel Watch 2 release date : పాలిష్​డ్​ సిల్వర్​/బే, మాట్​ బ్లాక్​/ ఓబ్సీడియన్​, షాంపైన్​ గోల్డ్​/ హాజెల్​, పాలిష్డ్​ సిల్వర్​/ పోర్సెలిన్​ వంటి రంగుల్లో ఈ గూగుల్​ పిక్సెల్​ వాచ్​ 2 అందుబాటులో ఉండనుంది. ఈ వాచ్​కు మెటల్​ స్లిమ్​, యాక్టివ్​ స్పోర్ట్​ బాండ్స్​ను ఇస్తోంది గూగుల్​.

ఇక ఈ స్మార్ట్​వాచ్​లో ఫిట్​బిట్​కి చెందిన మల్టీ-పాత్​ హార్ట్​రేట్​ సెన్సార్​, స్ట్రెస్​ మేనేజ్​మెంట్​ సిస్టెమ్​ వంటివి ఉంటాయి. వీటితో వ్యాయామాలను, స్ట్రెస్​తో బాడీలో కనిపించే మార్పులను ఈ వాచ్​ రికార్డ్​ చేస్తుందట. వీటితో పాటు అనేక హెల్త్​, ఫిట్​నెస్​ ట్రాకింగ్​ ఫీచర్స్​, ఫాల్​ డిటెక్షన్​, ఎమర్జెన్సీ ఎస్​ఓఎస్​, హార్ట్​ జోన్​ ట్రైనింగ్​, 6 నెలల ఫ్రీ ఫిట్​బిట్​ ప్రీమియం వంటివి కూడా వస్తాయని తెలుస్తోంది.

ఇదీ చూడండి:- Huawei new smartphone : శాటిలైట్​ కాలింగ్​ ఫీచర్​తో హువావే ప్రీమియం స్మార్ట్​ఫోన్​ లాంచ్​!

ఈ గూగుల్​ పిక్సెల్​ వాచ్​ 2లో 24 గంటల బ్యాటరీ లైఫ్​ ఉంటుందని, 75 నిమిషాల్లో ఫుల్​ ఛార్జింగ్​ చేసుకోవచ్చని లీక్స్​ సూచిస్తున్నాయి. అనేక సేఫ్టీ ఫీచర్స్​ని కూడా ఇందులో గూగుల్​ అప్డేట్​ చేసినట్టు కనిపిస్తోంది. ఎమర్జెన్సీ సర్వీసెస్​ సమయంలో మెడికల్​ డేటాను కూడా షేర్​ చేసుకోవచ్చట.

ఈ ఫీచర్స్​పై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అక్టోబర్​ 4న జరగనున్న ఈవెంట్​తో ఈ గూగుల్​ పిక్సెల్​ వాచ్​ 2పై ఓ క్లారిటీ వస్తుంది.

లాంచ్​ ఎప్పుడు.. ధర ఎంత?

Google Pixel Watch 2 price in India : ఈ గూగుల్​ పిక్సెల్​ వాచ్​ 2.. ఇండియాలో కూడా లాంచ్​ అవుతుంది. అక్టోబర్​ 5న.. ఇందుకు సంబంధించిన వివరాలను సంస్థ ప్రకటించే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం