Gold and Silver prices today : మళ్లీ సైలెంట్‌గా పెరిగిపోతున్న పసిడి, వెండి ధరలు- నేటి రేట్లు ఇలా..
30 November 2024, 5:37 IST
- Gold and Silver prices today : దేశంలో పసిడి ధరలు సైలెంట్‌గా పెరిగిపోతున్నాయి. వెండి రేట్లు సైతం వృద్ధిచెందాయి. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 వృద్ధి చెంది.. రూ. 78,120కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 78,110గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,81,200గా ఉంది.
మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 71,610కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 71,600గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 7,16,100కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 7,161గా కొనసాగుతోంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,770గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,270గా ఉంది. కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,610 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 78,120గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 71,610గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 78,120గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 71,160గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 78,120గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 71,610గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 78,120గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్‌లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 71,660గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 78,170గా కొనసాగుతోంది. భువనేశ్వర్‌లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 71,610గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 78,120గా ఉంది.
ఫెడ్ వడ్డీ రేట్ల కోత, అంతర్జాతీయ అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,160గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 91,600కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 91,500గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 1,00,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్‌కతాలో రూ. 91,600.. బెంగళూరులో రూ. 91,600గా ఉంది.