తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : జులై 14 : స్థిరంగా పసిడి, వెండి ధరలు..

Gold and silver prices today : జులై 14 : స్థిరంగా పసిడి, వెండి ధరలు..

Sharath Chitturi HT Telugu

14 July 2024, 6:29 IST

google News
    • Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి రేట్లు సైతం స్థిరంగా ఉన్నాయి. ప్లాటీనం రేట్లు మారలేదు. పూర్తి వివరాలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 67,600గా ఉంది. శనివారం కూడా ఇదే ధర పలికంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,76,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,761గా కొనసాగుతోంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 73,750 వద్ద కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,37,500గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,750గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,900గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,600 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 73,750గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,050గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,240గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 67,600గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,750గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,600గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,750గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,650గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73,800గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,600గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,750గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు ఇలా..

దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,550గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 95,500కి చేరింది. శనివారం ఇదే ధర పలికింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,00,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 95,500.. బెంగళూరులో రూ. 95,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ 26,880గా ఉంది. ఆ ముందు రోజు కూడా ఇదే ధర పలికింది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,880గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం