తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gautam Adani Wealth : 5.6 బిలియన్​ డాలర్లు పెరిగిన గౌతమ్​ అదానీ సంపద!

Gautam Adani wealth : 5.6 బిలియన్​ డాలర్లు పెరిగిన గౌతమ్​ అదానీ సంపద!

Sharath Chitturi HT Telugu

04 December 2023, 15:07 IST

  • Gautam Adani wealth : కొన్ని రోజుల వ్యవధిలోనే వ్యాపారవేత్త గౌతమ్​ అదాన సంపద భారీగా పెరిగింది. సోమవారం ట్రేడింగ్​ సెషన్​తో అది మరింత వృద్ధిచెందింది!

5.6 బిలియన్​ డాలర్లు పెరిగిన గౌతమ్​ అదానీ సంపద!
5.6 బిలియన్​ డాలర్లు పెరిగిన గౌతమ్​ అదానీ సంపద! (REUTERS)

5.6 బిలియన్​ డాలర్లు పెరిగిన గౌతమ్​ అదానీ సంపద!

Gautam Adani wealth : దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. గత కొన్ని రోజులుగా భారీగా ర్యాలీ అవుతున్నాయి. సోమవారం.. రికార్డ్​ స్థాయిని టచ్​ చేశాయి. ఈ నేపథ్యంలో వ్యాపారవేత్త, అదానీ సంస్థల ఛైర్మన్​ గౌతమ్​ అదానీ సంపద భారీగా పెరిగింది. గత వారంతో ముగిసిన ట్రేడింగ్​ సెషన్​తో.. ఆయన నెట్​ వర్త్​ ఏకంగా 5.6 బిలియన్​ డాలర్లు వృద్ధిచెందింది.

కారణం ఏంటి..?

అదానీ గ్రూప్​లో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిన్​డెన్​బర్గ్​ అనే సంస్థ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది. కాగా.. ఈ కేసులో విచారణను పూర్తి చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. తీర్పును రిజర్వులో పెట్టింది. అప్పటి నుంచి అదానీ గ్రూప్​ స్టాక్స్​ దూసుకెళుతున్నాయి.

Gautam Adani Net worth : ఇక ఆదివారం వెలువడిన 4 రాష్ట్రాల ఫలితాల్లో బీజేపీ హవా కనిపించడం కూడా అదానీ సంపద పెరుగుదలకు ఒక కారణం! సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు భారీ లాభాల్లో దూసుకెళుతున్నాయి. ఫలితంగా అదానీ స్టాక్స్​లో కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ ప్రారంభమైన 15 నిమిషాలకు, అంటే ఉదయం 9:30కి.. అదానీ గ్రూప్​ మార్కెట్​ వాల్యూ ఏకంగా 9.8 బిలియన్​ డాలర్లు పెరిగింది!

ఇదీ చూడండి:- Stocks to buy today : నిఫ్టీ @ ఆల్​ టైమ్​ హై- ఈ స్టాక్స్​ కొంటే భారీ లాభాలు!

ఇక మధ్యాహ్నం నాటికి సెన్సెక్స్​ 2శాతం, నిఫ్టీ 2,02శాతం పెరిగాయి. అదే సమయంలో.. అదానీ ఎంట్రిప్రైజెస్​ 7.8శాతం, అదానీ గ్రీన్​ ఎనర్జీ 8.43శాతం, అదానీ టోటల్​ గ్యాస్​ 4.56శాతం, అదానీ పవర్​ 5.35శాతం, అదానీ విల్మర్​ 2.59శాతం, అదానీ పోర్ట్స్​ 6.10శాతం మేర పెరిగాయి.

Nifty all time high : మొత్తం మీద.. కోర్టు విచారణ పూర్తైన తర్వాత.. అదానీ అన్ని సంస్థల మార్కెట్​ క్యాపిటల్​ రూ. 10.26లక్షల కోట్లకు చేరింది.

డైమెండ్​ ట్రేడర్​గా కెరీర్​ని ప్రారంభించిన గౌతమ్​ అదానీ.. అనతికాలంలోనే అనేక వ్యాపారాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2022 ప్రపంచ కుబేరుల లిస్ట్​లో.. కొన్ని రోజుల పాటు రెండో స్థానంలో కొనసాగారు. ఈ ఏడాది తొలినాళ్లల్లో వెలువడిన హిండెన్​బర్గ్​ నివేదికతో అదానీ స్టాక్స్​ ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇక కంపెనీ షేర్లు కోలుకోలేవని అందరు భావించారు. కానీ అవి రెట్టింపు వేగంతా పెరిగి, అదానీ సంపదను మరింత పైకి తీసుకెళ్లాయి!

తదుపరి వ్యాసం