Assembly election results : 'మోదీ' మేనియా తగ్గలే! 2024లోనూ విపక్ష ‘ఇండియా’కు కష్టమే!
Assembly election results : 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది.. కాంగ్రెస్‌తో పాటు విపక్ష ఇండియా కూటమికి డెంజర్ బెల్స్ లాంటిదే!
Assembly election results : 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కనిపిస్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కమలదళం గెలువువైపు దూసుకెళుతోంది. ఇది.. కాంగ్రెస్‌తో పాటు విపక్ష 'ఇండియా' కూటమికి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పుకోవాలి. ఏది ఏమైనా.. ఇండియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేనియా మాత్రం ఇంకా తగ్గలేదని ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇలా..
ముందుగా.. ఆదివారం వెలువడుతున్న 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుకుంటే.. ఒక్క తెలంగాణ మినహా.. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగలడం ఖాయంగా మారింది. మధ్యప్రదేశ్‌లో ఈసారి గెలుస్తుందనుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు సొంత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ని కూడా కోల్పోయే ప్రమాదంలో పడింది.
Madhya Pradesh election results : ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటల నాటికి.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ 160 సీట్లల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ కేవలం 64 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 116 సీట్లు కావాల్సి ఉండటంతో.. ఇక్కడ బీజేపీ గెలుపు ఖరారైపోయినట్టు. వాస్తవానికి మధ్యప్రదేశ్‌లో ఈసారి బీజేపీ తిరిగి అధికారాన్ని చేపట్టడం కష్టమని చాలా మంది భావించారు. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని సూచించాయి. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ.. ఆధిక్యంలోకి దూసుకెళ్లింది కమలదళం.
ఇక రాజస్థాన్‌లో.. ఓటమికి అడుగుదూరంలో ఉంది కాంగ్రెస్. బీజేపీ 109 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 75 సీట్లకే పరిమితమైంది. మెజారిటీకి కావాల్సిన సీట్లు 100. ఇక్కడా.. బీజేపీ అధికారం దాదాపు ఖాయమైపోయింది.
Chhattisgarh assembly election results : మరోవైపు.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బే తగిలే విధంగా ఉంది. ఈ రాష్ట్రంపై కాంగ్రెస్ కోటి ఆశలు పెట్టుకుంది. ఇక్కడ కాంగ్రెస్ గెలుపు, బీజేపీ ఓటమి ఖాయమని అందరు అనుకున్నారు. కానీ పరిస్థితులు తారుమారయ్యాయి. మెజారిటీ ఫిగర్ 46గా ఉండగా.. బీజేపీ 50కిపైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 35కే పరిమితమైంది.
మోదీ.. మోదీ.. మోదీ..
2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి నూతన ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. విపక్షాలు ఎంత ప్రయత్నించినా.. మోదీ మేనియాను మాత్రం అడ్డుకోవడంలో విఫలమవుతున్నాయని స్పష్టమవుతోంది. రెండుసార్లు అధికారంలోకి వచ్చినా.. దేశంలో ఇంకా మోదీ మేనియా తగ్గలేదని నీరుపిస్తున్నాయి ఈ దఫా ఫలితాలు.
Modi BJP : ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అనే కాకుండా.. దాదాపు అన్ని ఎన్నికల్లో మోదీ ముఖచిత్రంతోనే కమలదళం ఎన్నికల్లోకి వెళుతోంది. మోదీ కూడా.. అన్ని తానై చూసుకుంటున్నారు. అటు పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతూనే.. శరవేగంగా సభలు నిర్వహిస్తూ తన ఛరిష్మాతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
ఈ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌కు చేదు జ్ఞాపకంగానే మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోదీ, బీజేపీలపై యుద్ధానికి సిద్ధమవుతున్న వేళ.. తాజా ఫలితాలు ఇండియా కూటమిని, మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌ని ఆందోళనకు గురిచేసే విషయమే. దేశంలో మోదీని అడ్డుకుని, 2024లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే, ఈ శక్తి సరిపోదని, మోదీకి మించిన శక్తి కావాలని.. తాజా ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి.
2024 Lok Sabha elections : మరి ప్రధాని మోదీకి కాంగ్రెస్, ఇండియా ఎలాంటి ఫైట్ ఇస్తుంది? లోక్‌సభ ఎన్నికల్లో ఏ మేరకు ప్రదర్శన ఇస్తుంది? అన్న విషయాలు తెలియాలంటే.. సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూడాల్సిందే!
సంబంధిత కథనం