PM Modi Schedule: తెలంగాణ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుతోంది. ప్రచార గడువు సమీపిస్తుండటంతో బీజేపీ అగ్రనేతలంతా తెలంగాణకు తరలి వస్తున్నారు. రెండు రోజుల పాటు ప్రధాని మోదీ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. తెలంగాణలో ఆరు బహిరంగ సభలలో ప్రధాని మోదీ హాజరు కానున్నారు. హైదరాబాద్‌లో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరా రైంది. నవంబర్ 25 నుంచి 27వ తేదీ వరకు ఆరు ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభలతో పాటు హైదరాబాద్‌లో జరిగే రోడ్ షోలో ప్రధాని పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా ఒక రోజు రాత్రి రాజభవన్‌లో బస చేయనున్నారు. 26వ తేదీ సాయంత్రం తిరుమలకు వెళ్లి మర్నాడు తిరిగి హైదరాబాాద్ రానున్నారు.
ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 1.25 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరు కుంటారు. అక్కడి నుంచి 2.05 గంటలకు కామారెడ్డికి వెళతారు. మధ్యాహ్నం 2.15 నుంచి 2.55 వరకు కామారెడ్డి బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4. 15 నుంచి 4.55 గంటల వరకు మహేశ్వరంలో జరిగే సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత రాజ్‌భవన్ చేరుకుని అక్కడే బస చేస్తారు.
26వ తేదీ ఉదయం 11.30నుంచి మధ్యాహ్నం 12.45 వరకు హైదరాబాద్ సమీపం లోని కన్హ శాంతివనంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు తూప్రాన్ వెళ్లి మధ్యాహ్నం 2.15 నుంచి 2.45 గంటల వరకు బహిరంగసభలో పాల్గొంటారు. తర్వాత 3.45 నుంచి సాయంత్రం 4.25 వరకు నిర్మల్‌లో జరిగే సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి హకీంపేట విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం తిరుపతికి వెళ్లారు. రాత్రికి తిరుమలలో బస చేస్తారు.
27వ తేదీన శ్రీవారి దర్శనానంతరం తిరు పతి నుంచి బయల్దేరి ఉదయం 11.30 గంట లకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మహబూబాబాద్ చేరు 12.45 నుంచి 1.25 వరకు నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు.
అనంతరం 2.45 నుంచి 3.25 వరకు కరీంనగర్‌లో జరిగే సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4.40కి హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు హైద రాబాద్‌లో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. రోడ్‌షోతో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు. సాయంత్రం 6.25 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. హైదరాబాద్‌లో జరిగే రోడ్ షోట్ రూట్ మ్యాప్‌ను ఖరారు చేయాల్సి ఉందని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
ప్రధాని మోదీ తిరుమల పర్యటన ఖరారైంది. 26వ తేదీ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 6.50 గంటలకు తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి మోదీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుంటారు. 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8:45 గంటల వరకు శ్రీవారిని దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనానంతరం 10.25 గంటలకు తిరుపతి విమానా శ్రయం నుంచి హైదరాబాద్ తిరిగి వెళ్తారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో 24వ తేదీ అమిత్ షా పాల్గొంటారు. హుజురాబాద్, మంచిర్యాల, ఆర్మూర్‌లో అమిత్ షా పర్యటిస్తారు. 24 సాయంత్రం కూకట్‌పల్లిలో రోడ్ షో నిర్వహిస్తారు. 26వ తేదీన మక్తల్, రాజేంద్రనగర్ రోడ్ షోలో పాల్గొంటారు. శేరిలింగం పల్లిలో అమిత్ షా రోడ్ షో నిర్వహిస్తారు. అంబర్ పేట రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి పాల్గొంటారు. 28వ తేదీ ఎన్నికల ప్రచారం చివరి రోజు రామగుండం, పెద్దపల్లి నియోజక వర్గాల్లో అమిత్ షా పర్యటిస్తారు.
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా 23వ తేదీ ముదోల్, నిజామాబాద్, సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. సికింద్రాబాద్‌లో రోడ్ షో నిర్వహిస్తారు. 25వ తేదీ హుజుర్‌నగర్, హుస్నాబాద్, ముషీరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 27వ తేదీ బాన్స్ వాడ, జుక్కల్, గజ్వేల్‌లో నడ్డా పర్యటిస్తారు.
యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ 24వ తేదీ బోథ్, ఆదిలాబాద్, ఖానాపూర్, ఖైరతాబాద్‌లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. నవంబర్ 25న బోధన్, వేములవాడ, గోషామహాల్ రోడ్‌షో నిర్వహిస్తారు. సనత్‌నగర్‌లో పర్యటిస్తారు. 26వ తేదీన మహబూబ్‌నగర్, కల్వకుర్తి, ఎల్‌బి నగర్ పర్యటనలతో పాటు కుత్బుల్లాపూర్‌లో రోడ్‌షో నిర్వహిస్తారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 24వ తేదీ సిర్పూర్‌లో పర్యటిస్తారు. అదే నర్సాపూర్, మేడ్చల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 26వ తేదీన బాల్కొండ, సికింద్రాబాద్ కంటోన్మెంట్, కార్వాన్‌లో పర్యటిస్తారు.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 24వ తేదీన జూబిలీహిల్స్, మునుగోడులో పర్యటిస్తారు.అస్సోం సిఎం హిమంత బిశ్వకర్మ 27వ తేదీన మహేశ్వరం, దుబ్బాక, వరంగల్, పరకాలలో పర్యటిస్తారు.sa