Rajasthan, MP and Chhattisgarh Assembly Election results 2023 Live updates : ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీదే విజయం..
- Rajasthan, MP and Chhattisgarh Assembly Election results 2023 Live updates: ఛత్తీస్గడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తుండటంతో ఈ ఎలక్షన్ ఫలితాలు కీలకంగా మారాయి. ఫలితాల లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజ్ని ఫాలో అవ్వండి.
Sun, 03 Dec 202303:21 PM IST
ఈ ‘హ్యాట్రిక్’ తో ఆ ‘హ్యాట్రిక్’ పక్కా..: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ గఢ్ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ‘హ్యాట్రిక్’తో పోల్చారు. ఈ హ్యాట్రిక్ విజయం.. 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని కలిగించిందని వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల్లో 2014, 2019లో విజయం సాధించిన బీజేపీ.. 2024 ఎన్నికల్లోనూ కచ్చితంగా విజయం సాధించి, హ్యాట్రిక్ కొడుతుందని ఈ మూడు రాష్ట్రాల ఫలితాలతో తేలిందన్నారు. ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
Sun, 03 Dec 202303:06 PM IST
మూడు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల ఓటు షేర్ ఇదే..
రాజస్తాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ ల్లో ప్రధానంగా పోటీ బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యనే నెలకొన్నది. ఈ పోటీలో బీజేపీ స్పష్టమైన విజయం సాధించింది. అయితే, ఆ రెండు పార్టీలు సాధించిన ఓట్ల షేరు ఇలా ఉంది.
మద్య ప్రదేశ్: బీజేపీ- 49.9% ; కాంగ్రెస్- 40.4%.
రాజస్తాన్: బీజేపీ- 42.4%; కాంగ్రెస్- 39.6%.
చత్తీస్ గఢ్: బీజేపీ- 46.2% ; కాంగ్రెస్- 42.7%
Sun, 03 Dec 202302:45 PM IST
చరిత్రాత్మక ఫలితాలు ఇవి: ప్రధాని మోదీ
మధ్య ప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రధాని మోదీ చరిత్రాత్మకమని అభివర్ణించారు. గతంలో ఈ తరహా ఫలితాల ఎప్పుడూ రాలేదన్నారు. ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ విజయం ప్రభుత్వం చేపట్టిన ‘ఆత్మ నిర్భరత’, ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ పథకాలదన్నారు. కాంగ్రెస్ కుల గణన హామీని విమర్శిస్తూ, దేశంలో మహిళలు, యువత, పేదలు, రైతులు అనే నాలుగే కులాలు ఉన్నాయన్నారు. వారి అభ్యున్నతి కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారు.
Sun, 03 Dec 202301:13 PM IST
అత్యధిక, అత్యల్ప మెజారిటీలు సాధించిన వారు వీరే..
మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ 2 నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి అత్యధికంగా 71.4% ఓటు షేరు సాధించి రికార్డు సృష్టించారు. ఆయన మెజారిటీ 95,000. కాగా, మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా భుధ్ని స్థానం నుంచి 71.1% ఓటు షేరుతో 95, 170 పై చిలుకు మోజారిటీతో గెలుపొందారు. మరోవైపు, రాజస్తాన్ లోని జహజ్ పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన గోపీచంద్ మీనా కేవలం 56 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు.
Sun, 03 Dec 202301:00 PM IST
రేపు మిజోరంలో కౌంటింగ్
Mizoram Assembly Election Results 2023: ప్రస్తుతం ఫలితాలు వెలువడుతున్న తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలతో పాటు మిజోరం లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మిగతా రాష్ట్రాలతో పాటు మిజోరం ఎన్నికల కౌంటింగ్ కూడా ఈ రోజే జరగాల్సి ఉండగా, స్థానికుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు కౌంటింగ్ ను ఎన్నికల సంఘం డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.
Sun, 03 Dec 202311:37 AM IST
ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందన
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. రాజస్తాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ లలో బీజేపీ కి విజయం అందించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా దేవుళ్లకు శిరసు వంచి నమస్కరిస్తున్నానన్నారు. ‘‘ప్రజలు ఎప్పుడు సుపరిపాలనకు, అభివృద్ధికి పట్టం కడతారని రాజస్తాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ లలో ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయి’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆయా రాష్ట్రాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడం కొనసాగిస్తామన్నారు.
Sun, 03 Dec 202302:46 PM IST
రాజస్తాన్ సీఎం రేసులో జైపూర్ రాజకుమారి దియా కుమారి
Rajasthan Election Results 2023: రాజస్తాన్ లోని విద్యాధర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి దియా కుమారి 71,368 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. దియా కుమారి జైపూర్ రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. జైపూర్ సంస్థానాన్ని చివరగా పరిపాలించిన రెండో మాన్ సింగ్ మనవరాలు ఆమె. 2013లో ఆమె బీజేపీలో చేరారు. ప్రస్తుతం రాజసముంద్ ఎంపీగా ఉన్నారు. 2019 లో ఈ స్థానం నుంచి ఆమె 5.51 లక్షల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ రాజకుమారి కూడా సీఎం రేసులో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Sun, 03 Dec 202310:18 AM IST
రాజస్తాన్ సీఎం రేసులో మహంత్ బాలక్ నాథ్
రాజస్తాన్ లో బీజేపీ విజయం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే 38 స్థానాల్లో విజయం సాధించి మరో 78 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. కాగా, అనూహ్యంగా రాజస్తాన్ సీఎం రేసులోకి ఒక సన్యాసి దూసుకురావడం సంచలనం గా మారింది. రాజస్తాన్ సీఎం రేసులో వసుంధర రాజే ముందంజలో ఉండగా, ఆరెస్సెస్, బీజేపీ అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉన్న మహంత్ బాలక్ నాథ్ అనూహ్యంగా ఈ రేసులోకి దూసుకువచ్చారు.
Sun, 03 Dec 202310:53 AM IST
రాజస్తాన్ లోని టోంక్ లో సచిన్ ముందంజ
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ టోంక్ నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 14 రౌండ్లు ముగిసే సమయానికి ఆయన తన సమీప బీజేపీ అభ్యర్థి అజిత్ సింగ్ మెహతా కన్నా 19,438 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. కాగా, రాజస్తాన్ లో బీజేపీ విజయం దిశగా పయనిస్తోంది.
Sun, 03 Dec 202308:42 AM IST
మధ్య ప్రదేశ్ లో బీజేపీ గెలుపునకు ఈ వ్యూహాలే కారణం..
ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని మధ్య ప్రదేశ్ లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తోంది. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి మరోసారి ప్రజలు పట్టం కట్టడానికి ప్రధాన కారణాలుగా ఈ ఐదింటిని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అవి
- మోదీ కేంద్రంగా ప్రచారం
- బీజేపీ సంక్షేమ పథకాలు
- బీజేపీ ఎన్నికల వ్యూహాలు
- డబుల్ ఇంజన్ సర్కారు ప్రయోజనాలు
- ప్రచారంలో కాంగ్రెస్ వెనుకంజ
Sun, 03 Dec 202308:04 AM IST
మరింత స్ట్రాంగ్ గా మారిన బీజేపీ
ఇప్పటికే అధికారంలో ఉన్న మధ్య ప్రదేశ్ లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు, రాజస్తాన్, చత్తీస్ గఢ్ ల్లో పవర్ లో ఉన్న కాంగ్రెస్ నుంచి అధికారాన్ని లాగేసుకునే పరిస్థితి నెలకొనడంతో బీజేపీ మరింత స్ట్రాంగ్ గా మారుతోంది. ఈ ఫలితాలతో బీజేపీ రానున్న లోక్ సభ ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో పోటీ పడనుంది.
Sun, 03 Dec 202307:48 AM IST
మధ్యప్రదేశ్‌లో సంబరాలు..
మధ్యప్రదేశ్ బీజేపీ వర్గంలో సంబరాలు మొదలయ్యాయి. పార్టీ నేతలు మిఠాయులు పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.
Sun, 03 Dec 202307:16 AM IST
మధ్య ప్రదేశ్ లో మంత్రుల వెనుకంజ
మధ్య ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం మరోసారి ఘన విజయంతో అధికారంలోకి రావడం దాదాపు ఖాయమైంది. అయితే, శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలోని కీలక మంత్రులు ఈ ఎన్నికల్లో ఓటమి దిశగా వెళ్తుండడం ఆశ్చర్యకరంగా మారింది. అందులోనూ, రాష్ట్ర ప్రభుత్వ వాయిస్ గా ఉన్న సీనియర్ మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా సమీప కాంగ్రెస్ అభ్యర్థి కన్నా 2343 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. అలాగే, మంత్రులు అరవింద్ బధోరియా, మోహన్ యాదవ్, విశ్వాస్ సరంగ్, రాజ్యవర్ధన్ సింగ్ .. తదితర సుమారు 8 మంది మంత్రులు సమీప కాంగ్రెస్ ప్రత్యర్థుల కన్నా వెనుకబడి ఉన్నారు.
Sun, 03 Dec 202307:11 AM IST
మోదీ.. మోదీ.. మోదీ..
2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కనిపిస్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కమలదళం గెలువువైపు దూసుకెళుతోంది. ఇది.. కాంగ్రెస్‌తో పాటు విపక్ష 'ఇండియా' కూటమికి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పుకోవాలి. ఏది ఏమైనా.. ఇండియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేనియా ఇంకా తగ్గలేదని ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి!
Sun, 03 Dec 202307:05 AM IST
‘అంతా మోదీజీ మహిమే’ - శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్య ప్రదేశ్ లో బీజేపీ విజయానికి ప్రధాన కారణం ప్రధాని మోదీయేనని రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ నిర్వహించిన ప్రచారం, ప్రజలకు ఆయనపై ఉన్న విశ్వాసం కారణంగానే మధ్య ప్రదేశ్ లో మళ్లీ విజయం సాధిస్తున్నామని అన్నారు. ‘‘రాష్ట్ర ప్రజల మనసుల్లో మోదీ ఉన్నారు. మోదీ మనసులో రాష్ట్ర ప్రజలు ఉన్నారు’’ అని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉండడంతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు చేయగలిగామని తెలిపారు.
Sun, 03 Dec 202306:55 AM IST
చత్తీస్ గఢ్ లో కూడా విజయం దిశగా బీజేపీ
కాంగ్రెస్ కు అవకాశం ఉందనుకున్న చత్తీస్ గఢ్ లోనూ బీజేపీ విజయం సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం 90 సీట్లకు గానూ, 54 స్థానాల్లో బీజేపీ స్పష్టమైన లీడ్ లో ఉంది. మొదట్లో సమానంగా ఉన్న సీట్ల సంఖ్య క్రమంగా బీజేపీ వైపు మొగ్గు చూపడం కనిపిస్తోంది. ఇక్కడ మేజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ సీట్లనే బీజేపీ గెలుచుకోనుంది.
Sun, 03 Dec 202306:41 AM IST
Madhya Pradesh election results : బీజేపీ హిట్- కాంగ్రెస్ ఔట్!
మధ్యప్రదేశ్‌లో ఈసారి బీజేపీ రావడం కష్టమేనని అందరు అనుకున్నారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ.. ఎన్నికల ఫలితాల్లో కమలదళం దూసుకెళుతోంది. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉవ్విళ్లూరిని కాంగ్రెస్ డీలా పడింది.
Sun, 03 Dec 202306:23 AM IST
Rajasthan elections 2023 : రాజస్థాన్‌లో బీజేపీ గెలుపు ఖాయం!
రాజస్థాన్‌లో బీజేపీ గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో కమలదళం 113 చోట్ల లీడ్‌లో ఉంది. కాంగ్రెస్ 76 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇతరులు 10 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు.
Sun, 03 Dec 202306:00 AM IST
Chhattisgarh election results 2023 : కాంగ్రెస్‌పై కోపాన్ని ఓట్ల రూపంలో చూపించారు
ఓట్ల లెక్కింపులో బీజేపీ హవా కొనసాగుతుండటంపై ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం, బీజేపీ నేత రమన్ సింగ్ స్పందించారు. కాంగ్రెస్‌పై ఉన్న కోపాన్ని ప్రజలు ఓట్ల రూపంలో చూపించారని అన్నారు. పూర్తి మెజారిటీతో తాము అధికారంలోకి వస్తామని అన్నారు.
Sun, 03 Dec 202305:49 AM IST
బీజేపీ శిబిరంలో సంబరాలు..
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ శిబిరాల్లో సంబరాలు మొదలయ్యాయి. పార్టీ కార్యకర్తలు, వివిధ ప్రాంతాల్లో కార్యాలయాలకు వెళ్లి సంబరాలు చేసుకుంటున్నారు.
Sun, 03 Dec 202305:39 AM IST
Chhattisgarh assembly election results : కాంగ్రెస్‌కు షాక్!
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రెండ్స్‌ని చూస్తుంటే.. ఇక్కడ కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోతుందని తెలుస్తోంది. బీజేపీ 50 సీట్లల్లో లీడ్‌లో ఉంది. కాంగ్రెస్ 38 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇతరులు రెండు చోట్ల లీడ్‌లో ఉన్నారు.
Sun, 03 Dec 202305:00 AM IST
Rajasthan election results 2023 : రాజస్థాన్‌లో బీజేపీ హవా..
రాజస్థాన్‌లో బీజేపీ హవా కనిపిస్తోంది. బీజేపీ 102 చోట్ల లీడ్‌లో ఉంది. కాంగ్రెస్.. 81 స్థానాల్లో గెలిచింది.
Sun, 03 Dec 202304:35 AM IST
Madhya Pradesh Assembly Election results : బీజేపీ హవా
మధ్యప్రదేశ్‌లో బీజేపీ హవా కొనసాగుతోంది. ట్రెండ్స్ ప్రకారం.. 230 సీట్లల్లో 144 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 73 సీట్లల్లో ముందంజలో ఉంది. ఇతరులు 7 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Sun, 03 Dec 202304:29 AM IST
Telangana Election results 2023 : అదిలాబాద్‌లో ఇలా..
ఆదిలాబాద్ అప్డేట్స్: ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ 666 ఓట్లతో ముందంజలో ఉన్నారు. బోథ్ BRS అనిల్ జాదవ్ 1210 ఓట్లతో ముందంజలో ఉన్నారు. నిర్మల్ BJP అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి 2500 ముందంజలో ఉన్నారు. ఖానాపూర్ కాంగ్రెస్ వెడ్మా బజ్జు ముందంజలో ఉన్నారు. ముథోల్ బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ ముందంజలో ఉన్నారు. మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమసాగర్ రావు 3070 ఓట్ల ముందంజలో ఉన్నారు. బెల్లంపెల్లిలో వినోద్ 2600ఓట్ల ముందంజలో ఉన్నారు. చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ 3000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Sun, 03 Dec 202304:15 AM IST
Madhya Pradesh Assembly Election results : మధ్యప్రదేశ్ సీఎ ముందంజ..
ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం.. బుద్నీ నుంచి పోటీ చేసిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్.. ముందంజలో ఉన్నారు.
Sun, 03 Dec 202303:55 AM IST
Madhya Pradesh Assembly Election results : మధ్యప్రదేశ్‌లో ఇలా..
మధ్యప్రదేశ్‌లో ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ 86 చోట్ల, కాంగ్రెస్ 47 చోట్ల, ఇతరులు 5 చోట్ల ఆధికంలో ఉన్నారు.
Sun, 03 Dec 202303:44 AM IST
Assembly Election results 2023 : ఈసీ అప్డేట్స్..
ఎన్నికల సంఘం ప్రకారం.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ 8 సీట్లు- బీజేపీ 6 సీట్లల్లో ముందంజలో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ 2 సీట్లు, తెలంగాణలో బీఆర్ఎస్ ఒక సీటు లీడ్‌లో ఉన్నాయి.
Sun, 03 Dec 202303:22 AM IST
Assembly Election results 2023 Live updates : బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం.. రెండు రాష్ట్రాల్లో బీజేపీ లీడ్‌లో ఉంది. అవి.. రాజస్థాన్, మధ్యప్రదేశ్. మరో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ దూసుకెళుతోంది. అవి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్
Sun, 03 Dec 202303:16 AM IST
Chhattisgarh assembly election results 2023 : ఛత్తీస్‌గఢ్‌లో ఇలా..
ఛత్తీస్‌గఢ్ నుంచి వస్తున్న ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం.. 14 చోట్ల కాంగ్రెస్, 10 చోట్ల బీజేపీ లీడ్‌లో ఉన్నాయి.
Sun, 03 Dec 202303:11 AM IST
Madhya Pradesh Assembly Election results 2023 : హోరాహోరీ..!
ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ.. 66 సీట్లల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 51 స్థానాల్లో లీడ్‌లో ఉంది.
Sun, 03 Dec 202303:02 AM IST
Telangana Election Results 2023 Live Updates : పోస్టల్ బ్యాలెట్లో బండి సంజయ్ ముందంజ
తెలంగాణ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కరీంనగర్‌లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నారు.
Sun, 03 Dec 202302:52 AM IST
Rajasthan Assembly Election results : ఆధిక్యంలో బీజేపీ!
రాజస్థాన్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తోంది.
Sun, 03 Dec 202302:33 AM IST
Election results counting : ఓట్ల లెక్కింపు షురూ..
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.
Sun, 03 Dec 202302:22 AM IST
Madhya Pradesh election results 2023 : గెలుపుపై ధీమా..
మధ్యప్రదేశ్‌లో 230 సీట్లు ఉన్నాయి. గెలుపు కోసం 116 సీట్లల్లో గెలవాలి. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరా-హోరీ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ తామే గెలుస్తామని పార్టీలు ధీమాగా ఉన్నాయి.
Sun, 03 Dec 202302:21 AM IST
Assembly Election results 2023 Live : కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌లో హడావుడి..
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద హడావుడి మొదలైంది. పార్టీ కార్యకర్తలు కార్యాలయానికి చేరుకుంటున్నారు.
Sun, 03 Dec 202302:21 AM IST
Assembly Election results 2023 Live : బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలా కీలకంగా మారనున్నాయి. అందుకే అన్ని పార్టీలు.. ప్రజలను ఆకట్టుకునేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాయి. మరి వారి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో కొన్ని గంటల్లో తేలిపోనుంది.
Sun, 03 Dec 202302:21 AM IST
Assembly Election results 2023 Live : తెలంగాణ ఎన్నికల ఫలితాలు..
తెలంగాణ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Sun, 03 Dec 202301:02 AM IST
అన్ని ఏర్పాట్లు పూర్తి..
ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ఎన్నికల సంఘం. 8 గంటలకు వివిధ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ప్రారంభంకానుంది.
Sun, 03 Dec 202312:42 AM IST
ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?
నవంబర్ 30న ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ హవా కొనసాగుతుందని సూచించాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలవడం కష్టమేనని, మధ్యప్రదేశ్‌లో హోరా-హోరీ పోరు తప్పదని పేర్కొన్నాయి.
Sun, 03 Dec 202312:41 AM IST
మధ్యప్రదేశ్..
మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 సీట్లు ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 116. ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. 2018 ఎన్నికల్లో హంగ్ ఏర్పడటంతో హైఓల్టేజ్ రాజకీయాలు దర్శనమిచ్చాయి. ఈసారి ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.
Sun, 03 Dec 202312:40 AM IST
ఛత్తీస్‌గఢ్‌లో..
ఛత్తీస్‌గఢ్‌లో 90 సీట్లు ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 46. ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది.
Sun, 03 Dec 202312:39 AM IST
రాజస్థాన్‌లో రాజకీయ సమీకరణలు..
రాజస్థాన్‌లో మొత్తం 200 సీట్లు ఉండగా.. 199 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక్కడ గెలవాలంటే.. మెజారిటీ ఫిగర్ 100 దాటాల్సిందే. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ రాజస్థాన్ ప్రజలు.. దశాబ్దాలుగా.. ఏ పార్టీకి కూడా వరుసగా రెండోసారి అధికారన్ని కట్టబెట్టలేదు!
Sun, 03 Dec 202312:36 AM IST
ఓట్ల లెక్కింపు..
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. వాస్తవానికి మిజోరం ఎన్నికల ఫలితాలు కూడా నేడే వెలువడాల్సి ఉంది. కానీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సోమవారానికి వాయిదా వేశారు.
Sun, 03 Dec 202312:36 AM IST
ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం..
దేశంలో మరో హైఓల్టేజ్ యాక్షన్‌కు రంగం సిద్ధమైంది. దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకొన్ని గంటల్లో మొదలవ్వనుంది. రాజస్థాన్ని కాంగ్రెస్ కాపాడుకుంటుందా? మధ్యప్రదేశ్ బీజేపీదేనా? ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమా? అన్న ప్రశ్నలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.