Stocks to buy today : నిఫ్టీ @ ఆల్ టైమ్ హై- ఈ స్టాక్స్ కొంటే భారీ లాభాలు!
Stocks to buy today : నిఫ్టీ ఆల్ టైమ్ హైని తాకింది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ రన్ కొనసాగుతోంది. సోమవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు.. రికార్డు స్థాయిని తాకాయి. ఉదయం 9 గంటల 45 నిమిషాలకు.. బీఎస్ఈ సెన్సెక్స్ 1000 పాయింట్లు లాభపడి 68,486 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ50.. 290 పాయింట్ల లాభంతో 20,565 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 900కుపైగా పాయింట్లు పెరిగి..45,750 వద్ద ట్రేడ్ అవుతోంది బ్యాంక్ నిఫ్టీ.
ఆదివారం వెలువడిన 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్లడం.. స్టాక్ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇండియా జీడీపీ నెంబర్లు కూడా శక్తివంతంగా రావడంతో, దేశం.. వేగంగా అభివృద్ధి చెందుతోందన్న సంకేతాలు అందడం.. స్టాక్ మార్కెట్లకు మరింత ఉత్తేజాన్ని ఇచ్చాయని స్పష్టం చేస్తున్నారు.
లాభాలు.. నష్టాలు..
Nifty all time high : ఎల్టీ, ఎన్టీపీ, ఐసీఐసీ బ్యాంక్, ఎస్బీఐ, ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటాక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, రిలయెన్స్ షేర్లు భారీ లాభాలలో కొనసాగుతున్నాయి.
మారుతీ సుజుకీ, నెస్లే, సన్‌ఫార్మా షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.
స్టాక్స్ టు బై..
Stocks to buy : పంజాబ్ నేషనల్ బ్యాంక్:- బై రూ. 80.70, స్టాప్ లాస్ రూ. 77.50, టార్గెట్ రూ. 87
టాటా పవర్:- బై రూ. 276, స్టాప్ లాస్ రూ. 265, టార్గెట్ రూ. 298
కొటాక్ మహీంద్రా బ్యాంక్:- బై రూ. 1750, స్టాప్ లాస్ రూ. 1730, టార్గెట్ రూ. 1780
ICICI bank share price target : ఐసీఐసీఐ బ్యాంక్:- బై రూ. 947, స్టాప్ లాస్ రూ. 938, టార్గెట్ రూ. 960
క్రాఫ్ట్‌మాన్ ఆటోమోటివేషన్:- బై రూ. 5090, స్టాప్ లాస్ రూ. 4944, టార్గెట్ రూ. 5,100
ఏషియన్ పెయింట్స్:- బై రూ. 3173.40, స్టాప్ లాస్ రూ. 3180, టార్గెట్ రూ. 3300
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం