తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Credit Card Budgeting: క్రెడిట్ కార్డ్ బడ్జెటింగ్ అంటే తెలుసా?.. ఈ ప్లానింగ్ చాలా అవసరం

Credit card budgeting: క్రెడిట్ కార్డ్ బడ్జెటింగ్ అంటే తెలుసా?.. ఈ ప్లానింగ్ చాలా అవసరం

Sudarshan V HT Telugu

30 October 2024, 17:18 IST

google News
  • క్రెడిట్ కార్డు వినియోగంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా ఖర్చు చేయడమనేది క్రెడిట్ కార్డు వినియోగదారుల్లో చాలా సాధారణంగా కనిపించే ట్రెండ్. అదికూడా కార్డు తీసుకున్న మొదటి నెలల్లో అనవసర ఖర్చు ఎక్కువగా చేస్తారని ఒక స్టడీలో తేలింది. అందువల్ల, అందరూ క్రెడిట్ కార్డ్ బడ్జెటింగ్ నేర్చుకోవాలి.

క్రెడిట్ కార్డ్ బడ్జెటింగ్
క్రెడిట్ కార్డ్ బడ్జెటింగ్

క్రెడిట్ కార్డ్ బడ్జెటింగ్

Credit card budgeting: మీరు కొత్త క్రెడిట్ కార్డు వినియోగదారు అయితే, మీరు ఈ కథనాన్ని కచ్చితంగా చదవాలి. క్రెడిట్ కార్డును విచ్చలవిడిగా వాడి అప్పుల పాలు కావడమో, సరైన సమయానికి డ్యూస్ చెల్లించలేక ఇబ్బందులు పడడమో జరగకుండా ఉండాలంటే, క్రెడిట్ కార్డు వినియోగంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు, మీ సిబిల్ స్కోర్ బావుండాలంటే మీ క్రెడిట్ హిస్టరీ బావుండాలన్న విషయం గుర్తుంచుకోండి.

క్రెడిట్ కార్డు బడ్జెటింగ్

క్రెడిట్ కార్డు వినియోగంలో తీసుకోవాలసిన జాగ్రత్తలను క్రెడిట్ కార్డు బడ్జెటింగ్ తెలియజేస్తుంది. ముఖ్యంగా, మీ క్రెడిట్ కార్డు బిల్లు కన్నా మీ ఆదాయం చాలా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కొంతమంది క్రెడిట్ కార్డు వినియోగదారులు తమ నెలవారీ ఆదాయం కంటే క్రెడిట్ కార్డుతో చాలా ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. తత్ఫలితంగా, వారు రుణ ఉచ్చులో పడవచ్చు. కాబట్టి, క్రెడిట్ కార్డు నెలవారీ బడ్జెట్ ను క్రమబద్ధీకరించాల్సి ఉంటుంది.

క్రెడిట్ కార్డు బడ్జెటింగ్ కోసం ముఖ్య చిట్కాలు

1. మీ ఆదాయ వనరులను జాబితా చేయండి: మీ బడ్జెట్ వాస్తవికంగా ఉండేలా చూసుకోవడానికి, ముందుగా మీ ఆదాయంతో ప్రారంభించడం మంచిది. మీ ఆదాయం మారుతూ ఉంటే, సగటు అంచనాను అనుసరించండి.

2. గత క్రెడిట్ కార్డ్ స్టేట్ మెంట్ లను విశ్లేషించండి: క్రెడిట్ కార్డు వినియోగదారులు తాము గత నెలల్లో ఏయే కేటగిరీలలో ఎక్కువ ఖర్చు చేశారో గుర్తించాలి. అందుకు మీ గత స్టేట్ మెంట్ లను పరిశీలించి, కేటగిరీల వారీగా మీ ఖర్చులను గుర్తించండి. కిరాణా, వినోదం, భోజనం, గ్యాస్ వంటి సాధారణ వర్గాలలో చేర్చడం ద్వారా మీరు ఖర్చులను వర్గీకరించవచ్చు. తద్వారా మీరు అనవసరంగా చేసిన ఖర్చులను గుర్తించవచ్చు.

3. అవసరమైన, అవసరం కాని ఖర్చులను వేరు చేయండి: ఖర్చులను అద్దె, బీమా, యుటిలిటీస్ వంటి వివిధ కేటగిరీలుగా విభజించండి. రెండవ కేటగిరీలో కిరాణా, గ్యాస్, అవసరమైన వైద్య ఖర్చులు వంటి వేరియబుల్ ఎసెన్షియల్ ఖర్చులు ఉంటాయి. ఇవి హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఆ తర్వాత డైనింగ్ అవుట్, ఎంటర్టైన్మెంట్, షాపింగ్ వంటివి ఉంటాయి.

4. ఖర్చు శాతాన్ని ఎంచుకోండి: మీ ఆదాయంలో ఎంత క్రెడిట్ కార్డు ఖర్చుకు కేటాయించాలో ముందే నిర్ణయించడం చాలా ముఖ్యం. వీలైతే 20-30 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంచాలి.

5. క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని 30% కంటే తక్కువగా ఉంచండి: మీరు క్రెడిట్ కార్డు వినియోగాన్ని, మీ క్రెడిట్ లిమిట్ లో 30 శాతం కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. 30 శాతం పరిమితికి దగ్గరగా ఉంటే ఖర్చు చేయడం మానుకోవాలి.

6. ఎమర్జెన్సీలకు ప్లాన్ చేసుకోండి: అనుకున్న దానికంటే ఎక్కువ వాడకుండా ఉండేందుకు అనుకోని ఖర్చుల కోసం మీ క్రెడిట్ లిమిట్ లో 5-10 శాతాన్ని కేటాయించవచ్చు.

ఈ విధానం మీ క్రెడిట్ కార్డు (credit cards) వ్యయాన్ని బడ్జెట్ పరిమితుల్లో ఉంచడానికి మీకు సహాయపడుతుంది, తద్వారా ప్రయోజనాలను పెంచడానికి, రుణాన్ని తగ్గించడానికి మీకు సహాయపడుతుంది.

తదుపరి వ్యాసం