Mukaab : ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భవనం- ఖర్చు రూ. 42,05,11,19,00,000!-saudi arabia begins construction of the worlds largest building mukaab details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mukaab : ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భవనం- ఖర్చు రూ. 42,05,11,19,00,000!

Mukaab : ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భవనం- ఖర్చు రూ. 42,05,11,19,00,000!

Sharath Chitturi HT Telugu
Oct 26, 2024 12:09 PM IST

సౌదీ అరేబియా రియాద్​లో 400 మీటర్ల క్యూబ్ భవనాన్ని నిర్మిస్తోంది. దీని పేరు ముకాబ్. పనులు పూర్తైన తర్వాత ఈ ముకాబ్​.. ప్రపంచంలోనే అతిపెద్ద భవనంగా నిలిచిపోతుంది. పూర్తి వివరాలు..

సౌదీ అరేబియాలో ముకాబ్​..
సౌదీ అరేబియాలో ముకాబ్​.. (X/@therealmindman)

ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్​ని కట్టేందుకు సౌదీ అరేబియా రెడీ అవుతోంది. ఈ మేరకు 400 మీటర్ల ఎత్తుండే ‘ముకాబ్​’ భవన నిర్మాణాన్ని ప్రారంభించింది. క్యూబ్​ ఆకారంలో ఉండే ఈ భవనంలో అత్యాధునిక వసతులు ఉండనున్నాయి. రాజధాని నగరం రియాద్​లో ఉండే ఈ భవనం.. రెండు మిలియన్ చదరపు మీటర్ల ఫ్లోర్​స్పేస్​ను కలిగి ఉంటుంది. అంతేకాదు, న్యూయార్క్​లోని ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్​కు ఇరవై రెట్లు ఎక్కువగా ఉంటుంది! ముకాబ్​ మొత్తం ఖర్చు ఎంతో తెలిస్తే నోరెళ్ల బెడతారు!

న్యూ మురబ్బా జిల్లాలో..

ముకాబ్​ని సుమారు 50 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని (సుమారు రూ. 42,05,11,19,00,000), న్యూ మురబ్బా అని పిలిచే కొత్త జిల్లాకు ఇది కేంద్ర బిందువుగా పనిచేస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ విస్తారమైన ప్రాంతంలో 25 మిలియన్ చదరపు మీటర్ల ఫ్లోర్​స్పేస్ ఉంటుంది. ఇందులో 104,000 గృహాలు ఉంటాయి. రిటైల్, కార్పొరేట్, సాంస్కృతిక అనుభవాల ప్రత్యేక మిశ్రమాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్​ని నిర్మిస్తున్నారు. ఇది వ్యాపారానికి కేంద్రంగా కూడా మారుతుంది.

ప్రీమియం ఆతిథ్యానికి ఒక విజన్..

"ప్రీమియం హాస్పిటాలిటీ డెస్టినేషన్"గా డిజైన్ చేసిన ముకాబ్ ఒక సెంట్రల్ అట్రియం స్పేస్​ను కలిగి ఉంటుంది. ఇది సందర్శకులు, నివాసితులకు అనుభవాన్ని పెంచుతుంది. ఈ భవనం బహుముఖ రూపకల్పన వివిధ రంగాలకు సేవలు అందిస్తుంది. ఇది స్థానిక- అంతర్జాతీయ సందర్శకులకు కేంద్ర బిందువుగా మారుతుందని భావిస్తున్నారు.

దేశ పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (పీఐఎఫ్)లో కీలక పాత్ర పోషిస్తున్న సౌదీకి చెందిన న్యూ మురబ్బా డెవలప్​మెంట్ కంపెనీ (ఎన్​ఎండీసీ) ఈ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోంది. సౌదీ అరేబియా తన ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడానికి, సృజనాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి విస్తృత ప్రయత్నాల్లో భాగంగా ఈ చొరవ తీసుకుంది.

ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వారసత్వం..

భూమిని సరిగ్గా వాడుకోదన్న కారణంతో క్యూబ్​ ఆకారంలో పెద్దగా భవనాలు కనిపించవు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే అలవాటు సౌదీ అరేబియాకు ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన ఆకాశహర్మ్యంగా ఉండాలని భావించిన జెడ్డా టవర్​తో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సౌదీ గతంలో చేపట్టింది. కానీ దీన్ని 2018లో నిలిపివేశారు.

ఎడారిలో 170 కిలోమీటర్ల మేర విస్తరించిన మిర్రర్ సిటీగా రూపుదిద్దుకున్న ఈ లైన్​ని ప్రస్తుతానికి కేవలం 2.4 కిలోమీటర్లకు కుదించారు.

సృజనాత్మకత సుస్థిరత కోసం..

న్యూ మురబ్బా జిల్లా "సాంకేతికత, సృజనాత్మకత, సుస్థిరతను నిరంతరాయంగా మిళితం చేస్తుంది," అని భావిస్తున్నారు. దాని అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఈ అభివృద్ధి “ప్రకృతి సౌందర్యం, ప్రామాణిక సంస్కృతికి అనుగుణంగా పురోగతి, సృజనాత్మకత, వ్యవస్థాపకత”కు కేంద్రంగా ఉంటుంది.

మరి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద భనవంపై మీ ఒపీనియన్​ ఏంటి?

Whats_app_banner

సంబంధిత కథనం