Citroen eC3 launched : సిట్రోయెన్ ఈసీ3 లాంచ్.. టియాగో ఈవీ కన్నా ఎక్కువ ధరతో!
27 February 2023, 16:22 IST
- Citroen eC3 launched in India : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సిట్రోయెన్ ఈసీ3.. ఇండియాలో లాంచ్ అయ్యింది. టాటా టియాగో ఈవీ గట్టిపోటీనిస్తూ.. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ ఇండియాలోకి అడుగుపెట్టేసింది. దీని ధరతో పాటు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఇండియాలో సిట్రోయెన్ ఈసీ3 లాంచ్.. ధర ఎంతంటే!
Citroen eC3 launched in India : ఫ్రెంచ్ కార్ మేకర్ సిట్రోయెన్.. ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఏడాది జనవరిలో సిట్రోయెన్ సంస్థ ఆవిష్కరించిన ఈసీ3.. ఎట్టకేలకు సోమవారం లాంచ్ అయ్యింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 11.50లక్షలుగా ఉంది. లైవ్, ఫీల్, ఫీల్ వైబ్ ప్యాక్, ఫీల్ డ్యూయెల్ టోన్ వైబ్ ప్యాక్ వంటి నాలుగు వేరియంట్లలో ఈ సిట్రోయెన్ ఈసీ3 అందుబాటులో ఉండనుంది. టాప్ ఎండ్ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 12.43లక్షలుగా ఉంది.
టాటా టియాగో ఈవీకి గట్టి పోటీ..!
ప్రస్తుతం మార్కెట్లో లాంచ్ అయిన ఈసీ3.. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న సిట్రోయెన్ సీ3 ఐసీఈ ఇంజిన్‌తో పోలి ఉంటుంది. ఇక ఈ ఈసీ3 బుకింగ్స్ గత నెలలోనే ప్రారంభం అవ్వగా.. రానున్న కొన్ని రోజుల్లో డెలివరీలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Citroen eC3 on road price in Hyderabad : ఇండియా మార్కెట్లో చౌకైన ఎలక్ట్రిక్ వాహనంగా టాటా టియాగో ఈవీ కొనసాగుతోంది. ఇప్పుడు ఈ టాటా టియాగో ఈవీకి సిట్రోయెన్ ఈసీ3 గట్ట పోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. టాటా టియాగో ఈవీ ఎక్స్‌షోరూం ధరలు రూ. 8.49లక్షలు- రూ. 11.79లక్షల మధ్యలో ఉంటుంది. వాస్తవానికి.. టియాగో ఈవీకి సమీపంలోనే సిట్రోయెన్ ఈసీ3 ధరలు కూడా ఉంటాయని మార్కెట్ వర్గాలు భావించాయి. కానీ టాటా టియాగో ఈవీ కన్నా కాస్త ఎక్కువ ధరతోనే సిట్రోయెన్ ఈసీ3 లాంచ్ అయ్యింది.
ఈసీ3 వేరియంట్లు- ధరల వివరాలు..
ఇక సిట్రోయెన్ ఈసీ3 లైవ్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 11.50లక్షలు. ఫీల్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 12.13లక్షలు. ఫీల్ వైబ్ ప్యాక్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 12.28లక్షలు. చివరిగా.. ఫీల్ డ్యూయెల్ టోన్ వైబ్ ప్యాక్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 12.43లక్షలుగా ఉంది.
Citroen eC3 launch : సిట్రోయెన్ ఈసీ3లో 29.2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 57 పీఎస్ పవర్‌ను, 143 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 0-60 కేఎంపీహెచ్‌ను 6.8 సెకన్లలో అందుకోగలుగుతుంది. దీని టాప్ స్పీడ్ 107 కేఎంపీహెచ్. ఇందులో ఉన్న డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో 10-80శాతం ఛార్జింగ్‌ను 57 నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు. 15ఏ పవర్ సాకెట్‌తో 10-100శాతం ఛార్జింగ్ 10.5 గంటల్లో పూర్తవుతుంది.
Citroen eC3 on road price : ఇక ఈ సిట్రోయెన్ ఈసీ3 డిజైన్.. స్టాండర్డ్ సీ3తోనే పోలి ఉంటుంది. అదనంగా 'ఈ' బ్యాడ్జ్ వస్తుంది. ఇంటీరియర్‌లో కూడా పెద్దగా మార్పులు లేవు. 3 స్పోక్ ఫ్లట్ బాటమ్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, వయర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, 35 కనెక్టెడ్ కార్ ఫీచర్స్ వంటివి లభిస్తున్నాయి.