తెలుగు న్యూస్ / ఫోటో /
Electric vehicles in India : ఈవీ @20లక్షలు.. భారతీయుల చూపు- ఎలక్ట్రిక్ వాహనాలవైపు!
- Electric vehicles in India : ఎలక్ట్రిక్ వాహనాలపై భారతీయుల ఆసక్తి ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది. ఆటో సంస్థల మధ్య నెలకొన్న పోటీతో ధరలు దిగొస్తుండటం కూడా ప్లస్ పాయింట్‌గా నిలుస్తోంది. 2021తో పోల్చుకుంటే 2022లో ఈవీ సెగ్మెంట్ 200శాతం వృద్ధిని సాధించింది! దేశంలో ఈవీ సేల్స్ 20లక్షల మైలురాయిని దాటినట్టు కేంద్ర విద్యుత్‌శాఖ వెల్లడించింది. కేవలం 6ఏళ్లల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం విశేషం.

(1 / 7)
"ఈ-వాహన్4 పోర్టల్ ప్రకారం.. దేశంలో 2023 జనవరి 31 నాటికి దేశంలో 20,40,624 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి," అని లోక్‌సభ వేదికగా కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు.(HT AUTO)
(2 / 7)
ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధిలో 3 వీలర్దే అధిక వాటా! 2018లో 1.08 లక్షల యునిట్లుగా ఉన్న 3 వీలర్ ఈవీలు.. 2022 నాటికి 3.38లక్షలకు చేరాయి. ఇక ప్యాసింజర్ వెహికిల్ సెగ్మెంట్లో.. 2 వీలర్ ఈవీలు దూసుకెళుతున్నాయి. 2018లో కేవలం 16,943గా ఉన్న ఎలక్ట్రిక్ బైక్స్.. 2022లో 6.28లక్షలకు చేరాయి. పలు రాష్ట్రాల్లోని డేటాలు ఇంకా జోడించకుండానే నెంబర్లు ఈ రెంజ్లో ఉండటం విశేషం.(HT AUTO)
(3 / 7)
ఇక 2023 తొలి నెలలోనే.. 57,447 ఈవీల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవడంతో.. ఈ ఏడాది ఈవీ వృద్ధి ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనాలు మొదలయ్యాయి.(HT AUTO)
(4 / 7)
ఈవీ ప్యాసింజర్ సెగ్మెంట్లో టాటా మోటార్స్ రారాజుగా కొనసాగుతోంది. ఇండియా ఈవీ మార్కెట్ షేర్లో ఈ సంస్థ వాటా 90శాతంగా ఉంది. 2 వీలర్ ఈవీ సెగ్మెంట్లో ఓలా ఎలక్ట్రిక్ దూసుకెళుతోంది.(HT AUTO)
(5 / 7)
దేశంలో ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ వాహనాలనే ఎక్కవగా వినియోగిస్తున్నారు. కానీ ఈవీలకు ఈ రేంజ్లో డిమాండ్ లభిస్తుండటంతో భవిష్యత్తులో ఈవీలదే రాజ్యం అని ఆశలు చిగురిస్తున్నాయి.(HT AUTO)
(6 / 7)
ఈవీ సెగ్మెంట్‌పై ఆటో సంస్థలు కూడా దృష్టిసారించాయి. పోటీని తట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.(HT AUTO)
ఇతర గ్యాలరీలు