తెలుగు న్యూస్  /  బిజినెస్  /  C3 Aircross Vs Rumion : సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ వర్సెస్​ టయోటా రుమియన్​- ఏది బెస్ట్​?

C3 Aircross vs Rumion : సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ వర్సెస్​ టయోటా రుమియన్​- ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu

17 September 2023, 14:40 IST

google News
    • Citroen C3 Aircross vs Toyota Rumion : సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ వర్సెస్​ టయోటా రుమియన్​. ఈ రెండిట్లో ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకుందాము…
సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ వర్సెస్​ టయోటా రుమియన్
సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ వర్సెస్​ టయోటా రుమియన్

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ వర్సెస్​ టయోటా రుమియన్

Citroen C3 Aircross vs Toyota Rumion : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో లేటెస్ట్​ ఎంట్రీ.. సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​. ఇందులో 5 సీటర్​, 7 సీటర్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ఈ ఎస్​యూవీ.. టయోటా రుమియన్​ ఎంపీవీకి గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది వాల్యూ ఫర్​ మనీ? ఏది కొంటే బెటర్​? వంటి వివరాలను తెలుసుకుందాము..

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ వర్సెస్​ టయోటా రుమియన్​- లుక్స్​..

సిట్రోయెన్​ కొత్త ఎస్​యూవీలో డబుల్​ చెవ్రాన్​ లోగోతో కూడిన స్లీక్​ గ్రిల్​, బంపర్​ మౌంటెడ్​ హెడ్​లైటస్​, స్ప్లిట్​-టైప్​ డీఆర్​ఎల్స్​, సిల్వర్డ్​ స్కిడ్​ ప్లేట్స్​, రూఫ్​ రెయిల్స్​, రేర్​ వైపర్​ విత్​ వాషర్​, సీ-షేప్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్స్​, డిజైనర్​ అలాయ్​ వీల్స్​ వంటివి ఉన్నాయి.

టయోటా రుమియన్​లో ప్రొజెక్టర్​ హెడ్​ల్యాంప్స్​, వర్టికల్లీ స్టేక్​డ్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్స్​, క్రోమ్​ సరౌండెడ్​ గ్రిల్​, బాడీ కలర్డ్​ ఇండికేటర్​- మౌంటెడ్​ ఓఆర్​వీఎంలు, రూఫ్​ మౌంటెడ్​ యాంటీనా, 15 ఇంచ్​ డ్యూయెల్​ టోన్​ అలాయ్​ వీల్స్​ వస్తున్నాయి.

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ వర్సెస్​ టయోటా రుమియన్​- ఫీచర్స్​..

Citroen C3 Aircross price Hyderabad : సీ3 ఎయిర్​క్రాస్​లో మినిమలిస్ట్​ డాష్​బోర్డ్​, ఫాబ్రిక్​ అప్​హోలిస్ట్రీ, కీలెస్​ ఎంట్రీ, స్టార్ట్​- స్టాప్​ బటన్​, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, రూఫ్​ మౌంటెడ్​ రేర్​ ఏసీ వెంట్స్​, 10 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, డ్యూయెల్​ ఎయిర్​బ్యాగ్స్​ వస్తున్నాయి.

ఇదీ చూడండి:- 2023 Hyundai i20 vs Maruti Suzuki Baleno : ఈ రెండు కార్స్​లో ఏది బెస్ట్​?

ఇక మారుతీ సుజుకీ ఎర్టిగా ఆధారంగా రూపొందించిన రుమియన్​ ఎంపీవీ 7 సీటర్​ కేబిన్​లో డ్యూయెల్​ టోన్​ డాష్​బోర్డ్​, ఫౌక్స్​ వుడ్​ ట్రిమ్స్​, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, సెమీ- డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 7 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, 4 ఎయిర్​ బ్యాగ్స్​ లభిస్తున్నాయి.

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ వర్సెస్​ టయోటా రుమియన్​- ఇంజిన్​..

సిట్రోయెన్​ కొత్త వెహికిల్​లో 1.2 లీటర్​ లిక్విడ్​ కూల్డ్​, టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 108.4 హెచ్​పీ పవర్​ను, 190 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 6 స్పీడ్​ మేన్యువల్​ గేర్​ బాక్స్​ ఉంటుంది.

Toyota Rumion on road price Hyderabad : మరోవైపు రుమియన్​లో 1.5 లీటర్​ డ్యూయెల్​ జెట్​ ఇంజిన్​ వస్తుంది. ఇది 103 హెచ్​పీ పవర్​ను, 136.8 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. సీఎన్​జీ ఆప్షన్​ కూడా ఉంది.

ఈ రెండు వాహనాల ధరలు..

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ బుకింగ్స్​ మొదలయ్యాయి. ఈ మోడల్​ ఇంట్రొడక్టరీ ఎక్స్​షోరూం ప్రారంభ ధర రూ. 9.99లక్షలుగా ఉంది. టయోటా రుమియన్​ ఎక్స్​షోరూం ధర రూ. 10.29లక్షలు- రూ. 13.68లక్షల మధ్యలో ఉంటుంది.

తదుపరి వ్యాసం